Begin typing your search above and press return to search.

దండోరా ద‌మ్ము అక్క‌డే తెలుస్తోంది

కోర్టు సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన శివాజీ ఇప్పుడు దండోరా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   13 Dec 2025 3:32 PM IST
దండోరా ద‌మ్ము అక్క‌డే తెలుస్తోంది
X

కోర్టు సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన శివాజీ ఇప్పుడు దండోరా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో న‌వ‌దీప్, ర‌వికృష్ణ‌, నందు, మ‌నికా చిక్కాల‌, బిందు మాధ‌వి, ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. క‌ల‌ర్ ఫోటో, బెదురులంక లాంటి సినిమాల‌ను అందించిన లౌక్య ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై రవీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మ‌నిషికిచ్చే ఆఖ‌రి మ‌ర్యాద చావు

రీసెంట్ గా దండోరా మూవీ నుంచి మేక‌ర్స్ టీజ‌ర్ ను రిలీజ్ చేయ‌గా టీజ‌ర్ కు ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. టీజ‌ర్ లో చావు అనేది మ‌నిషికిచ్చే ఆఖ‌రి మ‌ర్యాద అంటూ శివాజీ చెప్పే డైలాగ్ చూస్తుంటే మూవీలో ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్ ను డైరెక్ట‌ర్ ట‌చ్ చేశార‌నిపిస్తోంది. పుట్టుక‌కు, చావు మ‌ధ్య మ‌నిషి ఎదుర్కొనే ప‌రిస్థితులు, భావోద్వేగాల గురించి చెప్పే క‌థాంశంతో ఈ సినిమా రూపొందుతుంద‌ని చాలా క్లియ‌ర్ గా తెలుస్తోంది.

సెన్సిటివ్ పాయింట్ ను ట‌చ్ చేస్తున్న దండోరా

కులం అనే సెన్సిటివ్ పాయింట్ను ట‌చ్ చేస్తూ, తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంలో మ‌న పురాతన ఆచారాలు, సాంప్ర‌దాయాల‌ను ఆవిష్క‌రిస్తూ మంచి వ్యంగ్యం, చక్క‌టి హాస్యం, హృద‌యాన్ని హ‌త్తుకునే భావోద్వేగాల క‌ల‌యిక‌గా ఈ మూవీని ఆవిష్క‌రిస్తుండ‌గా డిసెంబ‌ర్ 25న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రిలీజ్ ద‌గ్గ‌ర పడుతున్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ ను వేగవంతం చేయ‌డంతో పాటూ ఇప్ప‌టికే సినిమా బిజినెస్ క్లోజ్ అయిన‌ట్టు తెలుస్తోంది.

రిలీజ్ కు చాలా ముందే బిజినెస్ ను పూర్తి చేసుకున్న దండోరా

దండోరా మూవీని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూట‌ర్లు నైజాంలో రిలీజ్ చేస్తుండ‌గా, ఆంధ్ర‌, సీడెడ్, క‌ర్ణాట‌క‌లో ప్రైమ్ షో ఎంట‌ర్టైన్మెంట్ లాంటి మంచి డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. ఓవ‌ర్సీస్ లో ఈ సినిమాను అధ‌ర్వ‌ణ భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ రిలీజ్ చేస్తుంది. ఒక చిన్న సినిమా రిలీజ్ కు ముందే బిజినెస్ మొత్తాన్ని పూర్తి చేసుకుందంటే అక్క‌డే కంటెంట్ లోని గొప్ప‌ద‌నం అర్థం చేసుకోవ‌చ్చ‌ని, ఈ సినిమా స‌క్సెస్ పై తామెంతో కాన్ఫిడెంట్ గా ఉన్నామ‌ని మేక‌ర్స్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.