Begin typing your search above and press return to search.

'దండోరా' పిల్లా సాంగ్.. మెల్లగా ఎక్కేస్తోంది!

అగ్రవర్ణాలకు చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా, వారికి ఎదురు తిరిగినా ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయనే అంశంతో దండోరా రూపొందుతోంది.

By:  M Prashanth   |   30 Nov 2025 3:02 PM IST
దండోరా పిల్లా సాంగ్.. మెల్లగా ఎక్కేస్తోంది!
X

నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ కలర్ ఫోటో, బెదురు లంక 2012 వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు రూపొందించి లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సంస్థ మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న ఆ బ్యానర్.. ఇప్పుడు క్రేజీ కాన్సెప్ట్ తో దండోరా మూవీ తెరకెక్కిస్తోంది.

అగ్రవర్ణాలకు చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా, వారికి ఎదురు తిరిగినా ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయనే అంశంతో దండోరా రూపొందుతోంది. తెలంగాణ గ్రామీణ ఆచారాలు- సంప్రదాయాలు, ఎమోషన్లు, కామెడీల మేళవింపుతో తెరకెక్కుతోంది. డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ కానుకగా సినిమా రిలీజ్ కానుంది.

మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్న దండరో మూవీలో శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మాణిక చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, అదితి త‌దిత‌రులు లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ టీజర్ తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశారు. రీసెంట్ గా వచ్చిన టీజర్.. అందరినీ ఆకట్టుకుని సందడి చేసింది.

ఇప్పుడు సినిమా నుంచి రిలీజ్ అయిన పిల్ల సాంగ్.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. రీసెంట్ గా వచ్చిన ఆ పాట.. మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటూ చక్కర్లు కొడుతోంది. ఏ దండోరా కొట్టుకుందిరో.. గుండెల్లో గుచ్చికుందిరో.. అంటూ సాగుతున్న సాంగ్ కు పూర్ణ చారి లిరిక్స్ అందించగా.. మార్క్ కె రాబిన్ కంపోజ్ చేశారు.

రవికృష్ణ, మాణిక చిక్కాలపై తీసిన ఆ సాంగ్ కు అదితి భవరాజు, అనురాగ్ కులకర్ణి తమ గాత్రంతో ప్రాణం పోశారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. అయితే పాట అదిరిపోయిందని నెటిజన్లు, సినీ ప్రియులతోపాటు ముఖ్యంగా సంగీత ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. రీసెంట్ టైమ్ లో వచ్చిన ది బెస్ట్ మెలోడీ అంటూ కొనియాడుతున్నారు.

సాంగ్ లో స్పెషల్ వైబ్ ఉందని.. మంచి ఫీల్ వస్తుందని మ్యూజిక్ లవర్స్ చెబుతున్నారు. సాంగ్ లో ప్రతి సెకండ్ కూడా అద్భుతమని అంటున్నారు. రేర్ మెలోడీ పీస్ గా కామెంట్లు పెడుతున్నారు. మెల్లగా ఎక్కుతోందని, సాంగ్ కు అడిక్ట్ అయ్యామని మరికొందరు చెబుతున్నారు. లిరిక్స్, వాయిస్, విజువల్స్, కంపోజిషన్ సూపర్ అని అంటున్నారు. రవి కృష్ణ తన యాక్టింగ్ తో పాటు స్పెప్పులతో చించేశారని ప్రశంసిస్తున్నారు. మరి మీరు ఆ పాటను విన్నారా లేదా.. వినకపోతే ఇప్పుడే వినేయండి.