తప్పు చేశాను.. ఇకపై అలా జరగదు - ధన శ్రీ
అయితే విడాకుల తర్వాత చాహల్ తన పనిలో తాను బిజీగా ఉంటే.. ధనశ్రీ వర్మ బిగ్ బాస్ తరహా షో అయినటువంటి రైజ్ అండ్ ఫాల్ అనే రియాల్టీ షోలో పాల్గొంది.
By: Madhu Reddy | 8 Oct 2025 4:00 PM ISTఇండియన్ స్టార్ క్రికెటర్ యుజ్వెంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొని.. పెళ్లయిన కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకున్నారు. వీరి విడాకులు పరస్పర అంగీకారంతోనే జరిగాయి. అయితే విడాకుల తర్వాత చాహల్ తన పనిలో తాను బిజీగా ఉంటే.. ధనశ్రీ వర్మ బిగ్ బాస్ తరహా షో అయినటువంటి రైజ్ అండ్ ఫాల్ అనే రియాల్టీ షోలో పాల్గొంది. ఈ రియాల్టీ షోలో ధనశ్రీ వర్మ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెడుతోంది.
ఇందులో భాగంగా తాజాగా ఆమె మాట్లాడిన మాటలు మరోసారి సంచలనంగా మారాయి. "తప్పు చేశాడని తెలిసినా సపోర్ట్ చేసి మరో మిస్టేక్ చేశాను.. మళ్లీ అలా చేయాలనుకోవట్లేదు" అంటూ మాట్లాడింది. మరి ధనశ్రీ వర్మ మాట్లాడిన మాటల వెనుక ఉన్న అర్థం ఏంటి? చాహాల్ ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసిందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ధనశ్రీ వర్మ తాజాగా రైజ్ అండ్ ఫాల్ షోలో మాట్లాడుతూ .. "నా భాగస్వామి తప్పు చేశాడని తెలిసినా మద్దతు ఇచ్చాను. ఆ తర్వాత ఎందుకు సపోర్ట్ చేశానా? అని పశ్చాత్తాపపడ్డాను. కానీ మళ్ళీ ఇంకోసారి అలా చేయాలి అనుకోవట్లేదు" అని చెప్పింది.అయితే ఈ మాటలు విన్న చాలామంది చాహాల్ ని ఉద్దేశించే ధనశ్రీ వర్మ ఆ వ్యాఖ్యలు చేసింది అని అనుకున్నారు. అయితే ఈ మాటలు ధనశ్రీ వర్మ ఆ షోలో అనడానికి కారణం తన తోటి హౌస్ మేట్ నిక్కి షా తో ఉన్న విభేదాల గురించి మరో హౌస్ మేట్ తో చెబుతున్న క్రమంలో ఈ మాటలు మాట్లాడింది.
అయితే ధనశ్రీ చెప్పిన మాటలు అటు హౌస్ మేట్ తో పాటు చాహల్ కి కూడా పరోక్షంగా సెట్ అవుతాయి అని కొంతమంది ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. ఇదే షోలో తన వైవాహిక బంధం గురించి మీ మధ్య సంబంధం ఇక సెట్ అవ్వదు అని ఎప్పుడు అనిపించింది అంటూ హౌస్ మేట్ అడగగా.. పెళ్లయిన రెండో నెలకే అతన్ని పట్టుకున్నాను అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. కానీ విడాకులు తీసుకోలేక అతనితో బంధాన్ని కంటిన్యూ చేసినట్టు ధనశ్రీ వర్మ పరోక్షంగా చెప్పుకొచ్చింది.
ఇదే షోలో నేను భరణం తీసుకోలేదని,మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని,ఇలా సైలెంట్ గా ఉన్నానని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ ఖరాఖండిగా చెప్పేసింది. అలా తాజాగా మరోసారి ఈ షోలో చాహల్ కి పరోక్ష కౌంటర్ ఇచ్చింది అంటున్నారు ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్స్.. ఇక చాహల్ , ధనశ్రీ వర్మ ఇద్దరూ 2020 డిసెంబర్ లో పెళ్లి చేసుకొని 2025 మార్చిలో విడాకులు తీసుకున్నారు.
