విదేశీ టూరిజం సరే.. దిల్ రాజుతో ధనశ్రీ మూవీ ఏమైనట్టు?
క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌తో విడిపోయిన తర్వాత ధనశ్రీ వర్మ సినిమాలపై దృష్టి పెట్టారు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న డ్యాన్స్ బేస్డ్ మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు. అయితే ఈ సినిమా నుంచి చాలా కాలంగా అప్‌డేట్ లేకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు అబుదాబిలో లేజర్ షో వీడియోలను షేర్ చేయగా, సినిమాల అప్‌డేట్ ఎప్పుడిస్తారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
By: Sivaji Kontham | 14 Nov 2026 9:22 AM ISTప్రముఖ కొరియోగ్రాఫర్, నటి ధనశ్రీ వర్మ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులు, వెకేషన్లతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌తో విడిపోయిన తర్వాత.. తన పూర్తి దృష్టిని కెరీర్‌పైనే కేంద్రీకరించారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను పక్కన పెట్టి.. వరుస సినిమా ఆఫర్లతో సిల్వర్ స్క్రీన్‌పై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.
ధనశ్రీ కెరీర్‌లో అత్యంత కీలకమైన ప్రాజెక్టుగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రాన్ని చెప్పుకోవచ్చు. తనకు ఎంతో ఇష్టమైన డ్యాన్స్ నేపథ్యంలో సాగే ఈ డ్యాన్స్ బేస్డ్ మూవీతో ధనశ్రీ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. గతంలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సెట్స్ పైకి వెళ్లడంతో.. ధనశ్రీ టాలీవుడ్ ఎంట్రీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అప్పట్లో రాజ్ కుమార్ రావ్ సినిమాలో ఐటమ్ నంబర్ తోను ధనశ్రీ చర్చల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కొన్ని స్పెషల్ నంబర్లకు ధనశ్రీ సంతకాలు చేసింది.
అయితే దిల్ రాజు నిర్మాణంలోని సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా కాలం గడుస్తున్నా.. ఇటీవల కాలంలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎలాంటి కొత్త అప్‌డేట్స్ బయటకు రాకపోవడం ఆసక్తికరంగా మారింది. దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ డ్యాన్స్ మూవీ ప్రస్తుతం ఏ దశలో ఉంది? షూటింగ్ పూర్తయిందా లేక ఏవైనా కారణాలతో ఆలస్యమవుతోందా? అనే చర్చ సినీ వర్గాల్లో సాగుతోంది.
సినిమా అప్‌డేట్స్ సంగతి పక్కన పెడితే.. ధనశ్రీ వర్మ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలు.. వెకేషన్ విశేషాలతో అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా అబుదాబీ పర్యటనలో భాగంగా అక్కడ నిర్వహించిన ఒక స్పెషల్ లేజర్ షోను ఎంతో ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో అవి కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిలో కొన్ని వీడియోలు నిజంగా స్టన్నింగ్ గా ఉన్నాయి. ``రియాలిటీ ఫిల్టర్‌తో ఒక కలలోకి ఎప్పుడైనా నడిచారా? మరో ప్రపంచంలోకి విహరించండి..`` అంటూ దుబాయ్ టూరిజాన్ని ప్రమోట్ చేస్తోంది ధనశ్రీ. అయితే దుబాయ్ ప్రమోషన్స్ కాకుండా సినిమాలతో అభిమానుల ముందుకు ఎప్పుడు వస్తున్నారు? అంటూ నెటిజనులు ధనశ్రీని ప్రశ్నిస్తున్నారు.
