Begin typing your search above and press return to search.

బికినీ బీచ్‌లో ధ‌న‌శ్రీ వైబ్స్ వైర‌ల్

తాజాగా ఈ బ్యూటీ బీచ్ వెకేష‌న్ లో అదిరిపోయే ఫోజుల‌తో క‌ట్టి ప‌డేసింది. ధ‌న‌శ్రీ వంగ‌పువ్వు రంగు లాంగ్ ఫ్రాక్ ధ‌రించి అందంగా క‌నిపిస్తోంది.

By:  Sivaji Kontham   |   21 Dec 2025 4:00 AM IST
బికినీ బీచ్‌లో ధ‌న‌శ్రీ వైబ్స్ వైర‌ల్
X

కిల్ల‌ర్ లుక్స్ తో క‌ట్టి ప‌డేయ‌డంలో ధ‌నశ్రీ వ‌ర్మ‌ త‌ర్వాతే. స్ట‌న్నింగ్ ఫోజుల‌తో కుర్ర‌కారు గుండెల్లో గిలిగింత‌లు పెట్ట‌డంలో ఈ భామ ట్రాక్ పెద్ద‌దే. కొరియోగ్రాఫ‌ర్ కం న‌టి ధ‌న‌శ్రీ‌ ఫ్యాష‌న్ సెన్స్ ప‌రంగాను నేటి జెన్ జెడ్ కిడ్స్ లో ఠ‌ఫ్ కాంపిటీట‌ర్ గా దూసుకుపోతోంది. తాజాగా ఈ బ్యూటీ బీచ్ వెకేష‌న్ లో అదిరిపోయే ఫోజుల‌తో క‌ట్టి ప‌డేసింది. ధ‌న‌శ్రీ వంగ‌పువ్వు రంగు లాంగ్ ఫ్రాక్ ధ‌రించి అందంగా క‌నిపిస్తోంది. బీచ్ ప‌రిస‌రాల్లో అంద‌మైన రిసార్ట్ వాతావ‌ర‌ణంలో ఎంతో స్ట్రైకింగ్ గా క‌నిపిస్తోంది ఈ బ్యూటీ. క‌నుచూపు మేరా నీలి రంగు స‌ముద్రం ఎంతో మ‌నోహ‌రంగా క‌నిపిస్తుంటే, అక్క‌డ స్వేచ్ఛ‌గా సేద‌దీరుతూ ధ‌న‌శ్రీ ఇచ్చిన ఫోజులు హృద‌యాల‌ను గెలుచుకుంటున్నాయి. ఈ భామ త‌న వీపందాన్ని ఎలివేట్ చేస్తూ, బ్యాక్ లెస్ ఫ్రాక్‌లో మ‌తులు చెడ‌గొడుతోంది. ఓవైపు సినిమాలు, మ‌రోవైపు కొరియోగ్ర‌ఫీ అసైన్ మెంట్స్, టీవీ షోల‌తో బిజీ బిజీగా గ‌డిపే ధ‌న‌శ్రీ త‌న తీరిక స‌మ‌యాన్ని ఇలా యూనిక్‌గా ప్లాన్ చేసింది.

ధ‌న‌శ్రీ ప్ర‌స్తుతం టాలీవుడ్ లో డ్యాన్స్ బేస్డ్ చిత్రంలో న‌టిస్తోంది. ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాత‌ దిల్ రాజు నిర్మిస్తున్నారు. మ‌రోవైపు త‌మిళం, హిందీలోను ధ‌న‌శ్రీ న‌టిస్తోంది. 2025లో ఎక్కువ‌గా మీడియా హెడ్ లైన్స్ లో నిలిచిన ఈ భామ‌ క్రికెట‌ర్ చాహ‌ల్ నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా క్రైసిస్ స‌మ‌యంలో ప‌రిచ‌యం అనంత‌రం ప్రేమలో ప‌డిన ధ‌న‌శ్రీ‌-చాహ‌ల్ జంట‌ పెద్ద‌ల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ బంధం ఎంతో కాలం నిల‌వ‌లేదు.

అయితే బ్రేక‌ప్ త‌ర్వాత ధ‌న‌శ్రీ‌, చాహ‌ల్ ఎవరికి వారు త‌మ కెరీర్‌పై దృష్టి సారించారు. ప్ర‌స్తుతం ధ‌న‌శ్రీ కొరియోగ్రాఫ‌ర్ గా, న‌టిగా బిజీ బిజీగా ఉన్నారు. చాహ‌ల్ క్రికెట్ నుంచి విర‌మించాక ఇత‌ర ఆదాయ మార్గాల‌ను అన్వేషిస్తున్నాడు.

ఆకాశం దాటి వ‌స్తావా?

దిల్ రాజు నిర్మిస్తున్న `ఆకాశం దాటి వస్తావా` చిత్రంతో ధనశ్రీ వర్మ న‌టిగా పరిచయం అవుతోంది. ఇది ధ‌న‌శ్రీ‌ కెరీర్‌లో ఒక కీల‌క‌ ముందడుగు. ఇది నృత్య ప్రధాన చిత్రం. ఇందులో తన డ్యాన్సింగ్ స్కిల్ ని అన్నివిధాలా ప్ర‌ద‌ర్శించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్ప‌టికే వెబ్ లో అందుబాటులో ఉన్న‌ చాలా మ్యూజిక్ వీడియోలలో అద్భుత నృత్యంతో క‌ట్టి ప‌డేసిన ధ‌న‌శ్రీ పెద్ద‌తెర‌పైనా త‌న డ్యాన్సుల‌తో అద‌ర‌గొడుతుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అలాగే నటిగాను రాణిస్తుంద‌ని అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. శశి కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో కొత్తత‌రం నటీనటులు న‌టిస్తున్నారు. కొరియోగ్రఫీ నుండి నటన వైపు ధనశ్రీ మారడం ఒక సాహసోపేతమైన నిర్ణయం. వెండితెరపై ఎలా నటిస్తుందో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో కొరియోగ్రాఫర్ యష్,మలయాళ నటి కార్తీక మురళీధరన్ కూడా నటిస్తున్నారు.