చాహల్ (X) ధనశ్రీ: విరిగిన బంధాలపై టీఆర్పీ ఆటలు!
అసలు తన బ్రేకప్ తర్వాత మళ్లీ చాహల్ తో స్నేహంగా ఉంటున్నానని చెప్పిన ధనశ్రీ డబుల్ స్టాండార్డ్స్ గురించి నెటిజనులు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు.
By: Sivaji Kontham | 19 Sept 2025 2:00 AM ISTచాలా రియాలిటీ షోలు స్క్రిప్టు ప్రకారం నడుస్తాయి. ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో దానిని తెరపై చూపించేందుకు స్క్రిప్టు రచయితలు పని చేస్తారని గసగుసలు ఉన్నాయి. కానీ బిగ్ బాస్ రియాలిటీ షోకి ఇది వర్తించదని కార్యక్రమ కర్తలు చెబుతుంటారు. ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం? అనే దానిపై ఇప్పటికీ స్పష్ఠత లేదు.
ఇప్పుడు చాహల్ మాజీ భార్య, వివాదాస్పద ధనశ్రీ వర్మ `రైజ్ అండ్ ఫాల్` అనే రియాలిటీ షోలో పాల్గొంటోంది. ఈ షోలో ముక్కలైన తన వైవాహిక బంధం గురించి సహచరుడు ప్రశ్నించడం చర్చగా మారింది. తోటి పోటీదారు ఆర్భాజ్ పటేల్ కు ధనశ్రీ వర్మ విడాకుల మ్యాటర్‌పై చాలా డౌట్లు ఉన్నాయి. అందుకే ఈ టాపిక్‌ని పదే పదే అతడు ప్రశ్నిస్తూనే ఉంటాడు. ఇది వీక్షకులకు వినోదం పంచుతుంది.
ఈసారి అతడి ప్రశ్నలకు కాస్త హద్దు దాటి మాట్లాడింది ధనశ్రీ వర్మ. అసలు తన బ్రేకప్ తర్వాత మళ్లీ చాహల్ తో స్నేహంగా ఉంటున్నానని చెప్పిన ధనశ్రీ డబుల్ స్టాండార్డ్స్ గురించి నెటిజనులు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఓవైపు మాజీ భర్తతో స్నేహంగా ఉన్నానని చెబుతున్న ధనశ్రీ, తాజా రియాలిటీ షోలో కనికరం అన్నదే లేకుండా చాహల్ పై నిందలు వేసింది. అతడు మోసం చేసాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తన గురించి తప్పుడు ప్రచారం చేయించాడని, యజ్వేంద్ర అభిమానులు తననే నిందించారని ప్రత్యారోపణలు చేసింది.
నిజానికి స్నేహంగా ఉన్నప్పుడు ఇక ముగిసిన విషయాన్ని మర్చిపోవాలి.. అలా కాకుండా టీర్పీల కోసం పాకులాడే ఇలాంటి వేదికలకెక్కి అతడి పరువు మర్యాదలకు భంగం కలిగించేలా ప్రవర్తించడం సరి కాదని చాలా మంది సూచిస్తున్నారు. రియాలిటీ షోల కోసం విరిగిపోయిన బంధాన్ని ప్రశ్నిస్తుంటే, దానికి సమాధానాలివ్వాలనుకోవడం సరైనదేనా? అని కూడా ప్రశ్నిస్తున్నారు.
