Begin typing your search above and press return to search.

మాజీ భర్త చాహల్ కు ధనశ్రీ స్ట్రాంగ్ కౌంటర్!

భారత స్టార్ క్రికెటర్ చాహల్ తన భార్య ధనశ్రీ వర్మకు రీసెంట్గా విడాకులు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.

By:  Madhu Reddy   |   9 Sept 2025 11:00 PM IST
మాజీ భర్త చాహల్ కు ధనశ్రీ స్ట్రాంగ్ కౌంటర్!
X

భారత స్టార్ క్రికెటర్ చాహల్ తన భార్య ధనశ్రీ వర్మకు రీసెంట్గా విడాకులు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. విడిపోతున్నట్టు ఈ జంట ప్రకటించిన కొద్ది నెలలకే వీరికి విడాకులు మంజూరు చేసింది కోర్టు. అయితే ధనశ్రీకి విడిపోవాలని లేకపోయినప్పటికీ యుజ్వేంద్ర చాహల్ మాత్రం భార్య నుండి విడాకులు తీసుకోవాలి అనుకున్నట్టు రూమర్లు వినిపించాయి. అంతేకాదు విడాకులు మంజూరయ్యే ముందు కూడా కోర్టులో నేను ఏడుస్తూనే ఉన్నాను అని, విడాకులు వెనక్కి తీసుకుందామనే ఆలోచన తనలో ఉంది అన్నట్లుగా ఓ ఇంటర్వ్యూలో ధనశ్రీ చెప్పింది.

ఇదంతా పక్కన పెడితే.. విడాకుల తర్వాత ప్రతి ఒక్క సెలబ్రిటీ తమ మాజీలపై పరోక్ష కామెంట్లు చేస్తారు. అయితే కొంతమంది తమ మాజీల గురించి పాజిటివ్ గా చెబితే కొంతమంది నెగటివ్ గా చెబుతారు. అయితే రీసెంట్ గా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న చాహల్ మాత్రం ధనశ్రీ గురించి నెగిటివ్ గా మాట్లాడడంతో చాహల్ చేసిన కామెంట్లపై తాజా షోలో ధనశ్రీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఇంతకీ చాహల్ కామెంట్లపై ధనశ్రీ ఏ విధంగా రియాక్ట్ అయిందో ఇప్పుడు చూద్దాం..

ప్రేమించి పెళ్లి చేసుకున్న ధనశ్రీ,చాహల్ ఇద్దరూ తమ పెళ్లి బంధాన్ని ఎన్నో రోజులు కొనసాగించలేకపోయారు. ముఖ్యంగా ప్రేమ లేకపోతే ఏ బంధమైనా తెగిపోతుంది. కాబట్టి వీరి మధ్య బంధం తెగిపోయింది. అయితే విడాకుల తర్వాత చాహల్ తన విడాకుల గురించి మాజీ భార్యతో ఉన్న బంధం గురించి ఓ పాడ్ కాస్ట్ లో చెప్పుకొచ్చారు. చాహల్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారడంతోపాటు ధనశ్రీ మీద సోషల్ మీడియాలో నెగెటివిటీ పెరిగిపోయింది.చాలామంది సోషల్ మీడియాలో ధనశ్రీ పై నెగిటివ్ పోస్టులు పెట్టడంతో దీనిపై ఆమె కూడా స్పందించింది.

ధనశ్రీ తాజాగా అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లోని రైజ్ అండ్ ఫాల్ అనే షోలో పాల్గొంది.అయితే ఇందులో చాహల్ పాడ్ కాస్ట్ లో మాట్లాడిన మాటల పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా అనే ప్రశ్న ఎదురవగా.. "నేను అస్సలు సంతృప్తిగా లేను.. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు వచ్చి విడిపోయారు. విడిపోయిన తర్వాత ఒకరి గురించి ఒకరు ఎందుకు ఇలా మాట్లాడుకోవాలి. ప్రతి ఒక్కరికి పరువు అనేది ఉంటుంది.కానీ ఒకరి పరువును తీసి ఇమేజ్ పెంచుకోవాలని చూడకూడదు. నేను ఒక మహిళను.. నాకు కూడా అలాంటి మాటలు మాట్లాడడం వచ్చు. నేను మాట్లాడినా నన్ను ఎవరు ఏమీ అనరు. కానీ అప్పట్లో అతను నా భర్త.. కాబట్టి ఆ బంధాన్ని ఇప్పటికీ గౌరవిస్తున్నాను. గౌరవిస్తూనే ఉంటాను. బంధం ముగిసిపోయిన తర్వాత కూడా ఒకరి గురించి ఒకరు తప్పుగా మాట్లాడడం మంచిది కాదు.. మీ ఇమేజ్ మీరు పెంచుకోండి. మీ మంచితనాన్ని మీ పనితో మీరు నిరూపించుకోండి. కానీ వేరొకరి పరువు తీసి వారిని అవమానించేలా మాట్లాడి.. మీ ఇమేజ్ ని ఎందుకు పెంచుకోవాలి" అంటూ పరోక్షంగా చాహల్ మాట్లాడిన మాటలకి కౌంటర్ ఇచ్చింది ధనశ్రీ.

అంతేకాకుండా సోషల్ మీడియాలో తనపై వచ్చే నెగిటివ్ పోస్టులపై స్పందిస్తూ.. "ఈ మధ్యకాలంలో నాపై నెగటివ్ పిఆర్ చేస్తున్నారు. ఇలాంటి విషయాలు మీకు ఏ విధంగానూ సహాయపడవు. వాటిని మానేసుకుంటే మంచిది" అంటూ చెప్పుకొచ్చింది. విడాకుల తర్వాత ఫస్ట్ టైం ధనశ్రీ చాహల్ వ్యాఖ్యలపై చాలా ఓపెన్ గా మాట్లాడడంతో చాలామంది నెటిజన్లు విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకున్నాక.. ఒకరిపై ఒకరు ఇలా కౌంటర్లు వేసుకోవడం ఎందుకు అంటూ కామెంట్లు పెడుతున్నారు.