Begin typing your search above and press return to search.

కళ్ళతోనే మాయ చేస్తూ చెమటలు పట్టిస్తున్న సేవ్ ది టైగర్స్ బ్యూటీ!

అయితే ఇలా ఎన్నో చిత్రాలలో నటించినప్పటికీ ఈమెకు మంచి గుర్తింపును అందించిన సిరీస్ మాత్రం సేవ్ ద టైగర్స్ అనే చెప్పాలి.

By:  Madhu Reddy   |   7 Jun 2026 11:36 AM IST
కళ్ళతోనే మాయ చేస్తూ చెమటలు పట్టిస్తున్న సేవ్ ది టైగర్స్ బ్యూటీ!
X

1993 మే 30న న్యూఢిల్లీలో జన్మించిన దేవియాని శర్మ తన అద్భుతమైన నటనతో నటన రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలోకి రాకముందు మోడల్ గా తన కెరీర్ను ప్రారంభించిన ఈ చిన్నది.. ఆ తర్వాత తొలిసారి హిందీ చిత్రం లవ్ షూధా అనే చిత్రంలో అతిధి పాత్ర పోషించి సినీ రంగ ప్రవేశం చేసింది. 2020లో భానుమతి రామకృష్ణ అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన దేవియాని శర్మ.. 2021 లో వచ్చిన రొమాంటిక్ , 2022లో ఝాన్సీ చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయితే ఇలా ఎన్నో చిత్రాలలో నటించినప్పటికీ ఈమెకు మంచి గుర్తింపును అందించిన సిరీస్ మాత్రం సేవ్ ద టైగర్స్ అనే చెప్పాలి. ఈ సిరీస్ లో తన అద్భుతమైన నటనతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్.. జూన్ 19వ తేదీ నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ వేదికగా మూడవ సీజన్ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది.

ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా ఈ మూడు జంటలు ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైపోయారు. పైగా ఈ సీజన్లో వెన్నెల కిషోర్ కూడా తన కామెడీతో ఆకట్టుకోవడానికి రాబోతున్నారు. మరి జూన్ 19వ తేదీ నుండి జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.

మరొకవైపు ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా దేవియాని శర్మ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా మరో ఔట్ఫిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్కై బ్లూ కలర్ హెవీ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన స్లీవ్ లెస్ బాడీ కాన్ టాప్ ధరించి తన అందాలతో మెస్మరైజ్ చేసింది. మత్తెక్కించే కళ్ళతో రొమాంటిక్గా ఫోటోలకు ఫోజులిస్తూ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇక అమ్మడి అందానికి.. గ్లామర్ లుక్కుకి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇకపోతే ఈమె హెయిర్ స్టైల్ విషయానికి వస్తే.. పాపిడి తీసి జుట్టును ముడిపెట్టిన ఈమె.. కళ్ళ మీదకు ఒక చిన్న లేయర్ లాగా జుట్టును వదిలేసి స్టైలిష్ గా ఆకట్టుకుంది. ఈ ఫోటోలకు క్యాప్షన్ గా విశ్వం నా అందాన్ని చూసి గుసగుసలాడుతోంది. నేను నా హృదయంతో ఆ గుసగుసలను వింటున్నాను అంటూ షేర్ చేసింది. మొత్తానికైతే సరికొత్త ఫోటోషూట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అటు గ్లామర్ తో గిలిగింతలు పెడుతోంది దేవియాని శర్మ. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.