Begin typing your search above and press return to search.

తెల్ల చీరలో తడి అందాలతో హీట్ పుట్టిస్తున్న దేవియాని!

ఈ మేరకు ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఈ లేటెస్ట్ అవుట్ ఫిట్ అభిమానులకి గిలిగింతలు పెడుతోంది.

By:  Madhu Reddy   |   24 Jun 2026 10:39 AM IST
తెల్ల చీరలో తడి అందాలతో హీట్ పుట్టిస్తున్న దేవియాని!
X

ఒకవైపు నటన మరొకవైపు గ్లామర్ తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అటు సోషల్ మీడియాలో భారీ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ టాలీవుడ్ బ్యూటీ దేవియాని శర్మ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం , అభినయంతో లక్షల మంది ఫాలోవర్స్ ను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎప్పట్లాగే మరోసారి అందాలు ఆరబోస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఈ లేటెస్ట్ అవుట్ ఫిట్ అభిమానులకి గిలిగింతలు పెడుతోంది.




తడి అందాలతో గిలిగింతలు..

తాజాగా తెల్లచీరలో తడి అందాలతో ఆకట్టుకునే రేంజ్ లో ఫోటోలు షేర్ చేసింది దేవియాని శర్మ. ఎంబ్రాయిడరీ తో చక్కగా డిజైన్ చేసిన వైట్ కలర్ స్లీవ్ లెస్ డీప్ వీ నెక్ తో డిజైన్ చేసిన బ్లౌజ్ ధరించిన ఈమె.. దీనికి కాంబినేషన్లో వైట్ కలర్ సాఫ్ట్ సిఫాన్ శారీ కట్టుకొని అందాలతో మెస్మరైజ్ చేసింది. ఇక చెవులకు హెవీ ఇయర్ రింగ్స్ ధరించిన ఈమె తడి అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఫోటోలు షేర్ చేసింది. ఇకపోతే ఈసారి మాత్రం నెటిజన్స్ కి ఛాన్స్ ఇవ్వకుండా కామెంట్ బాక్స్ సెక్షన్ ఆఫ్ చేయడం గమనార్హం. మొత్తానికైతే దేవియాని షేర్ చేసిన ఈ లేటెస్ట్ ఫోటోషూట్ అభిమానులను విపరీతంగా అలరిస్తోంది.




సేవ్ ది టైగర్స్ సీజన్ 3 తో మళ్లీ ఆడియన్స్ ముందుకు..

దేవియాని శర్మ తాజాగా సూపర్ హిట్ కామెడీ ఫ్రాంచైజీ సేవ్ ది టైగర్స్ సీజన్ 3 తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూన్ 19న ప్రముఖ ఓటీటీ దిగ్గజం జియో హాట్ స్టార్ వేదికగా ఈ సీజన్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఏడు ఎపిసోడ్లు గల ఈ సీజన్ ఇప్పుడు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ తమ అద్భుతమైన నటనతో ఆకట్టుకోగా.. మరొకవైపు జోర్దార్ సుజాత , దేవియాని శర్మ, పావని తమ నటనతో మెప్పించారు. అంతేకాదు ఈ సీజన్లో కొత్తగా వెన్నెల కిషోర్ ఇంద్రుడి పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

దేవియాని శర్మ 1993 మే 30న సునీల్ శర్మ, నీనా శర్మ దంపతులకు న్యూఢిల్లీలో జన్మించింది .ఈమెకు సోదరి సోనం శర్మ కూడా ఉన్నారు. టీనేజ్ వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన ఈమె.. ఆ తర్వాత నటనపై ఆసక్తితో కొన్ని నాటకాలలో కూడా నటించింది. రొమాంటిక్ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన దేవియాని శర్మ తొలిసారి లవ్ శుదా అనే హిందీ చిత్రం ద్వారా తన నటన జీవితాన్ని ప్రారంభించింది. ఇక భానుమతి అండ్ రామకృష్ణ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. ఇక అలా మోడల్ గా, నటిగా బిజీ అయిపోయింది . మరొకవైపు పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.