Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : అందాల శర్మ మిర్రర్‌ సెల్ఫీ

సేవ్‌ ది టైగర్స్‌ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయిన ముద్దుగుమ్మ దేవియాని శర్మ. అంతకు ముందు కూడా చాలా సినిమాల్లో కనిపించిన దేవియాని శర్మ పెద్దగా గుర్తింపు దక్కించుకోలేదు.

By:  Ramesh Palla   |   22 Aug 2025 12:00 AM IST
పిక్‌టాక్‌ : అందాల శర్మ మిర్రర్‌ సెల్ఫీ
X

సేవ్‌ ది టైగర్స్‌ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయిన ముద్దుగుమ్మ దేవియాని శర్మ. అంతకు ముందు కూడా చాలా సినిమాల్లో కనిపించిన దేవియాని శర్మ పెద్దగా గుర్తింపు దక్కించుకోలేదు. కనీసం నోటెడ్‌ కూడా కాలేదు. ఎప్పుడైతే ఆ వెబ్‌ సిరీస్‌లో కనిపించిందో అప్పటి నుంచి మంచి గుర్తింపు దక్కించుకుంది. సోషల్‌ మీడియాలో ఈమె ఫాలోయింగ్‌ పెరిగింది. సినిమా ఆఫర్లు వరుసగా రావడం లేదు, కానీ ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉన్న నటి అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అవ్వడం వల్ల సోషల్‌ మీడియాలో ఈమె ఏ ఫోటోలు షేర్‌ చేసినా అందరి దృష్టిని ఆకర్షించడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసారి ఈ ఫోటోలతో దేవియాని శర్మ తన అందంతో ఆకట్టుకుంది.


స్కిన్‌ షో తో దేవియాని శర్మ

సోషల్‌ మీడియాలో సెలబ్రిటీలు రెగ్యులర్‌గా ఫోటోలు షేర్‌ చేస్తూ ఉంటారు. అయితే చాలా తక్కువ మంది ఫోటోలు మాత్రమే చూడగానే వావ్‌ అనిపించేంత అందంగా ఉంటాయి, కొన్ని ఫోటోలు చూడగానే అంతకు మించి అన్నట్లుగా అనిపిస్తాయి. దేవియాని శర్మ ఎప్పుడు ఫోటోలు షేర్‌ చేసినా నెటిజన్స్ వావ్‌ అంటూ తెగ కామెంట్స్ చేస్తారు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్‌ ఈ అమ్మడి సొంతం కావడం వల్ల ఎలాంటి ఔట్‌ ఫిట్‌ ధరించిన భలే సెట్‌ అవుతుందని చాలా మంది అంటూ ఉంటారు. సాధారణంగానే హీరోయిన్స్‌ స్కిన్‌ షో చేస్తూ ఉంటారు. ఇక ఈమె స్కిన్‌ షో ఫోటోలు సైతం రెగ్యులర్‌గా సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతూ ఉంటాయి. కొందరు స్కిన్‌ షో చేస్తే చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ దేవియాని శర్మ మాత్రం చూడముచ్చటగా ఉంటుంది.


మిర్రర్‌ సెల్ఫీతో అందం

తాజా మిర్రర్‌ సెల్ఫీలో బ్లాక్ పాయింట్‌ వేసుకుని, బ్లాక్‌ టాప్‌లో నడుము అందం చూపిస్తూ దేవియాని శర్మ చూపరులను ఆకట్టుకుంది. దేవియాని శర్మ ఇంతం అందంగా ఉన్నా ఆఫర్లు దక్కక పోవడం విచారకరం అంటూ కొందరు ఇన్‌స్టాలో పాపం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నటిగా దేవియాని శర్మ ముందు ముందు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. తప్పకుండా ఈమె ఈ అందంతో మరిన్ని ఆఫర్లు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. స్టార్‌ హీరోయిన్స్‌కి ఏమాత్రం తగ్గకుండా దేవియాని శర్మ అందంగా ఉందని, ఆమె సోషల్‌ మీడియాలో ఇదే రేంజ్‌లో అందంగా ఉన్న ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా ఖచ్చితంగా ముందు ముందు అయినా ఆఫర్లు దక్కించుకుంటుంది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సేవ్‌ ది టైగర్స్ ముద్దుగుమ్మ షో

సేవ్‌ ది టైగర్స్‌ వెబ్‌ సిరీస్‌ లో మొత్తం ముగ్గురు ముద్దుగుమ్మలు ఉంటాయి. అయినా కూడా ఈమెకు ప్రత్యేకంగా గుర్తింపు లభించింది. ఆ వెబ్‌ సిరీస్‌లో పెద్దగా స్కిన్‌ షో చేయలేదు, అయినా కూడా ఆమె పాత్ర గురించి ప్రముఖంగా మాట్లాడుకున్నారు. అంతే కాకుండా దేవియాని శర్మ నటన గురించి ఆ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ సమయంలో ప్రముఖంగా చర్చ జరిగింది. అందంతో పాటు యాక్టింగ్‌ ప్రతిభ కూడా ఉన్న దేవియాని శర్మ తప్పకుండా ముందు ముందు ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటుంది అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా ఈమె ఇతర భాషల సినిమా ఇండస్ట్రీలోనూ ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేయడం మంచిదని, అక్కడ అయినా ఈమెకు లక్‌ కలిసి వస్తుందేమో అనే అభిప్రాయంను కొందరు కామెంట్స్ రూపంలో షేర్‌ చేస్తున్నారు.