స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!
ఇప్పటికే ఎల్లమ్మ టైటిల్ సాంగ్ కోసం దేవిశ్రీ ప్రసాద్ చేసిన ప్రత్యేక ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షించింది.
By: Priya Chowdhary Nuthalapti | 5 Nov 2026 9:44 AM ISTప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఎల్లమ్మ. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బలగం సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి వార్త ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్రకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.
ప్రముఖ నటుడి సోదరుడు ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఆయన ఎవరు..ఈ పాత్ర ఎలా ఉండబోతోంది..అనే విషయాలపై ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వార్త కానీ నిజమైతే సినిమాలో విలన్ పాత్ర కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తుండటంతో పాటు, ఈ సినిమాలో బలమైన ప్రతినాయకుడిని చూపించబోతున్నారనే ప్రచారం సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతోంది.
ఇప్పటికే ఎల్లమ్మ టైటిల్ సాంగ్ కోసం దేవిశ్రీ ప్రసాద్ చేసిన ప్రత్యేక ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షించింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 100 మంది జానపద కళాకారులను ఒకచోట చేర్చి ఈ పాటను రూపొందిస్తున్నారు. భారతీయ జానపద సంగీతంలోని వైవిధ్యాన్ని ఒకే పాటలో చూపించాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. విభిన్న ప్రాంతాల సంప్రదాయాలు, సంగీత శైలులు ఈ పాటలో వినిపించనున్నాయి.
బలగం సినిమాతో తెలంగాణ పల్లె జీవితాన్ని, మనుషుల మధ్య అనుబంధాలను ఎంతో సహజంగా చూపించిన వేణు యెల్దండి.. ఇప్పుడు ‘ఎల్లమ్మ’తో మరోసారి జానపద నేపథ్యాన్ని ఎంచుకున్నారు. ఈసారి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలవనుంది. కథ, సంగీతం, నటీనటుల ఎంపికతో ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకంగా మారుతోంది.
దేవిశ్రీ ప్రసాద్ తొలిసారి హీరోగా నటిస్తుండటంతో ఆయన నటన ఎలా ఉండబోతోందనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో ఉంది. మరోవైపు విలన్ పాత్రకు సంబంధించిన వార్తలు సినిమాపై మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి.
ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. త్వరలోనే తొలి పాటను విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించింది చిత్ర బృందం.
