Begin typing your search above and press return to search.

ఎల్లమ్మ న్యూ లుక్.. ఊహించని పర్శిగా రాక్‌స్టార్

'బలగం' సినిమాతో పల్లెటూరి కథల సత్తా ఏంటో చూపించిన దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న పవర్ ఫుల్ ప్రాజెక్ట్ 'ఎల్లమ్మ'. ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.

By:  M Prashanth   |   2 Aug 2026 5:48 PM IST
ఎల్లమ్మ న్యూ లుక్.. ఊహించని పర్శిగా రాక్‌స్టార్
X

తెలుగు ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్‌గా దశాబ్దాల పాటు ఎన్నో బ్లాక్‌బస్టర్ ఆల్బమ్స్ అందించిన దేవిశ్రీప్రసాద్, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. 'బలగం' సినిమాతో పల్లెటూరి కథల సత్తా ఏంటో చూపించిన దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న పవర్ ఫుల్ ప్రాజెక్ట్ 'ఎల్లమ్మ'. ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ పుట్టినరోజున ఈ సినిమా నుంచి క్యారెక్టర్ లుక్‌ని మేకర్స్ సోషల్ మీడియాలోకి విడుదల చేశారు.




ఈ సినిమాలో డీఎస్పీ 'పర్శి' అనే పాత్రను పోషిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి వచ్చిన ప్రీ ప్రొడక్షన్ పిక్స్, చిన్న చిన్న క్లూస్ చూస్తేనే ఇది పక్కా రా అండ్ వైల్డ్ ఎమోషన్స్‌తో రాబోయే గ్రామీణ జానపద డ్రామా అని క్లారిటీ వచ్చేసింది. కథలో పవర్ ఫుల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, రిలీజైన మోషన్ పోస్టర్‌లో మాత్రం డీఎస్పీ లుక్ చాలా ప్రశాంతంగా, క్లాసిక్ వింటేజ్ స్టైల్‌లో కనిపించడం ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. లైన్స్ ఉన్న షర్ట్, ప్యాంట్ ధరించి, చేతిలో అమ్మవారి కిరీటాన్ని పట్టుకున్న విజువల్స్ చాలా డిఫరెంట్ వైబ్‌ని క్రియేట్ చేస్తున్నాయి.

చాలా ఏళ్లుగా స్టేజ్ పెర్ఫార్మన్స్‌లు, ప్రైవేట్ వీడియోల్లో ఓవర్ ది టాప్ ఎనర్జీతో కనిపించే డీఎస్పీని ఇలా చాలా గ్రౌండెడ్ అండ్ నేచురల్ గెటప్‌లో చూడటం సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తోంది. గెటప్ పరంగా ఎంత సింపుల్‌గా కనిపించినా, ఈ క్యారెక్టర్ వెనుకున్న ఎమోషన్ మాత్రం చాలా డెప్త్‌గా ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తన సొంత ఊరి జాతరలోని జానపద రూట్స్‌ను రీసెంట్‌గా చూసిన డీఎస్పీ, ఆ వైబ్‌ని ఈ సినిమా కోసం గట్టిగానే ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది.

హీరోగానే కాకుండా ఈ సినిమాకు దేవి సంగీతం కూడా అందిస్తున్నాడు. మోషన్ పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించిన మ్యూజిక్ ఎమోషన్ మిస్టరీ టచ్‌తో సినిమా మూడ్‌లోకి తీసుకెళ్లేలా ఉంది. ఇక సినిమా కంటెంట్ కు తగ్గటుగా డీఎస్పీ ఇచ్చే ఫోక్ ట్యూన్స్ తోడైతే సౌండ్ ట్రాక్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో నేటివిటీ ఉన్న కథలకు మంచి డిమాండ్ ఉంది. అందుకే 'ఎల్లమ్మ' సినిమాను కూడా తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ ప్లాన్ చేస్తోంది. హీరోయిన్ ఎంపిక పూర్తయిన వెంటనే షూటింగ్ వేగవంతం కానుంది. దేవిశ్రీప్రసాద్ పూర్తిస్థాయి హీరోగా మారుతుండటం వల్ల ఈ సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. పక్కా వింటేజ్ లుక్‌తో పర్శిగా సింపుల్‌గా ఎంట్రీ ఇచ్చిన డీఎస్పీ, థియేటర్లలో ఏ రేంజ్ రా అండ్ రస్టిక్ డ్రామాను ప్రెజెంట్ చేస్తారో చూడాలి.