ఆరడుగుల బుల్లెట్ సాంగ్.. దేవిశ్రీ చెప్పిన సీక్రెట్..!
ఈ ఎపిసోడ్ ప్రోమోలో డీఎస్పీ సూపర్ హిట్ సాంగ్ రెండిటిని ఎలా కంపోజ్ చేశాడన్నది చెప్పారు. ఐతే యాదృశ్చికం ఏంటంటే ఈ రెండు సాంగ్స్ ఒక సినిమాలోనివే అవ్వడం విశేషం.
By: Ramesh Boddu | 30 Oct 2025 3:15 PM ISTసినీ తారల ముచ్చట్లు బాగా తెలిసిన వారే మళ్ళీ అడిగి తెలుసుకుంటే ఆ కిక్కు వేరేలా ఉంటుంది. అలాంటి షోలు ఎన్నొచ్చినా కూడా సూపర్ క్లిక్ అవుతాయి. అలాంటి షో ఒకటి జయమ్ము నిశ్చయమ్మురా అంటూ జగ్గు భాయ్ అలియాస్ జగపతి బాబు చేస్తున్నారు. ఒకప్పటి హీరో ఇప్పుడు విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా అన్నిటిలో ఆయన ది బెస్ట్ ఇస్తారు. ఇప్పుడు బుల్లితెర మీద హోస్ట్ గా జగపతి బాబు కొత్త అవతారం ఎత్తారు. అక్కినేని నాగార్జున, శోభు యార్లగడ్డతో పాటు నాగ చైతన్య ఇలా అందరు ఈ షోకి వచ్చి ఆడియన్స్ ని అలరిస్తున్నారు.
జగపతి బాబు షోకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్..
రీసెంట్ గా రమ్యకృష్ణ ఈ షోకి వచ్చి ఎంటర్టైన్ చేశారు. అప్పటి విషయాలతో పాటు జగపతి బాబుతో ఆమె ఎంత క్లోజ్ అన్నది ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది. ఇక లేటెస్ట్ గా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ జగపతి బాబు షోకి గెస్ట్ గా వచ్చారు. ఈ ఎపిసోడ్ ప్రోమోలో డీఎస్పీ సూపర్ హిట్ సాంగ్ రెండిటిని ఎలా కంపోజ్ చేశాడన్నది చెప్పారు. ఐతే యాదృశ్చికం ఏంటంటే ఈ రెండు సాంగ్స్ ఒక సినిమాలోనివే అవ్వడం విశేషం.
అమ్మాయి చూడగానే పాట రాశా వంట కదా అదేంటి అనగానే వెనక నిన్ను చూడగానే సాంగ్ ప్లే చేశారు. ఐతే దాని గురించి చెబుతూ రోడ్డు మీద అమ్మాయిలు వెళ్తుంటే నిన్న చూడగానే సాంగ్ వచ్చింది.. ఇటు మళ్లీ మరో అమ్మాయి వెళ్తే అలా ఆ సాంగ్ చేశానని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారికి సాంగ్ వినిపిద్దామని వెళ్తే అక్కడ కెమెరా స్టాండ్ తో వీడు ఆరడుగుల బుల్లెట్ అంటూ గన్ ఫైర్ తో అనుకున్నామని అలా ఆ సాంగ్స్ వచ్చినట్టు చెప్పారు.
DSP మొదటిగా కంపోజ్ చేసిన పాట..
ఇక తను మొదటిగా కంపోజ్ చేసిన పాటని అక్కడ లైవ్ పాడి వినిపించారు దేవి శ్రీ ప్రసాద్. మొత్తానికి అలా తన ఇంటర్వ్యూ ప్రోమోతోనే ఇంట్రెస్టింగ్ డీటైల్స్ చెప్పారు. ముఖ్యంగా జగపతి బాబు దేవి గురించి చెబుతూ లెజెండ్ లో విలన్ గా తాను చేస్తే ఆ సినిమాకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని అన్నారు.
హోస్ట్ గా జగపతి బాబు గెస్ట్ గా దేవి శ్రీ ప్రసాద్ ఈ స్పెషల్ జయమ్ము నిశ్చయమ్మురా చిట్ చాట్ ఫుల్ ఎపిసోడ్ ఈ సండే స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ ఇంటర్వ్యూ తర్వాత దేవి ఏ సాంగ్ ఎలా కంపోజ్ చేశాడు అన్నది తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. దేవి శ్రీ ప్రసాద్ ప్రజెన్స్ ఎక్కడ ఉన్నా ఆ షో కానీ ఆ ఈవెంట్ కానీ ఎనర్జిటిక్ గా మారుతుంది. జగపతి బాబుతో చేస్తున్న ఈ ఎపిసోడ్ కూడా సంథింగ్ క్రేజీగా ఉండబోతుందని చెప్పొచ్చు.
