గద్దర్ అవార్డ్స్ వేదికపై డీఎస్పీ సర్ ప్రైజ్.. రష్మిక పెళ్లిపై ఇలా..
దేవిశ్రీ ప్రసాద్ పాట పాడుతుంటే, రష్మిక సిగ్గుతో ముఖం దాచుకుంటూ పడిపడి నవ్వడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
By: M Prashanth | 20 March 2026 9:34 AM ISTహైదరాబాద్‌లో జరిగిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తనదైన స్టైల్ లో సందడి చేశారు. స్టేజ్ మీద తన పాటలతో అందరినీ ఉర్రూతలూగిస్తున్న సమయంలో, డీఎస్పీ ఒక్కసారిగా తన పాటను ఆపేసి రష్మిక మందన్న వైపు చూస్తూ చేసిన హంగామా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అప్పటివరకు ఒక బజ్ తో సాగుతున్న కార్యక్రమాన్ని తనదైన టైమింగ్ తో డీఎస్పీ ఒక్కసారిగా మార్చేశారు.
పాడుతూ మధ్యలో దేవిశ్రీ ప్రసాద్ ఉన్నట్టుండి ఏడుస్తున్నట్లు నటిస్తూ.. "రష్మిక.. మా క్రష్మిక.. ఎంత పని చేశావే దేవరకొండను పెళ్లి చేసుకున్నావు" అంటూ ఒక ఫన్నీ సాంగ్‌ను అందుకున్నారు. తన పెళ్లి గురించి ఇలా, అదీ ఒక పెద్ద అవార్డు వేదికపై పాట రూపంలో వినిపిస్తుందని రష్మిక అస్సలు ఊహించలేదు. ఆ సమయంలో రష్మిక ఇచ్చిన రియాక్షన్ అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది.
దేవిశ్రీ ప్రసాద్ పాట పాడుతుంటే, రష్మిక సిగ్గుతో ముఖం దాచుకుంటూ పడిపడి నవ్వడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. పక్కనే ఉన్న దిల్ రాజు వంటి సినీ ప్రముఖులు కూడా డీఎస్పీ అల్లరికి ఫిదా అయిపోయి నవ్వుల్లో మునిగిపోయారు. "ఈ కుర్రాళ్ల గుండెలన్నీ అటుకు పుటుకు అని పేలిపోయాయే" అంటూ దేవిశ్రీ ప్రాసలు కలిపి పాడుతుంటే, గ్యాలరీలో ఉన్న ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది.
విజయ్ దేవరకొండతో వివాహం తర్వాత రష్మికకు ఇది ఒక రకమైన స్వీట్ సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు. తన వ్యక్తిగత విషయాల గురించి ఇండస్ట్రీలోని సహచరులు ఇంత సరదాగా స్పందించడం ఆమెను ఎంతో సంతోషపెట్టినట్లు కనిపిస్తోంది. నవ్వుతూనే ఉన్న రష్మిక, దేవిశ్రీ చేసిన ఈ హడావిడిని బాగా ఎంజాయ్ చేశారు. అవార్డ్స్ వేడుకలో ఇలాంటి చిలిపి చేష్టలు వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చేశాయి.
దేవిశ్రీ ప్రసాద్ కేవలం ఒక సంగీత దర్శకుడిగానే కాకుండా, స్టేజ్ మీద ఒక మంచి ఎంటర్టైనర్‌గా తనను తాను నిరూపించుకున్నారు. విజయ్ రష్మికల పెళ్లి గురించి అందరికీ తెలిసిందే అయినా, దాన్ని ఇలా సాంగ్ రూపంలో ప్రజెంట్ చేయడం డీఎస్పీ క్రియేటివిటీకి నిదర్శనం. రష్మిక రియాక్షన్ కూడా ఎక్కడా ఇబ్బందిగా లేకుండా చాలా సహజంగా ఉంది. ఒక సెలబ్రిటీ తన పర్సనల్ లైఫ్ గురించి వచ్చే జోక్స్‌ను ఎంత స్పోర్టివ్‌గా తీసుకోవాలో ఆమె నిరూపించారు.
ఇక గద్దర్ అవార్డ్స్ వేదికపై జరిగిన ఈ చిన్నపాటి సరదా సన్నివేశం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జీ, రష్మిక సిగ్గుపడిన తీరు చూసి నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అవార్డుల ప్రదానం ఒకవైపు జరుగుతున్నా, ఇలాంటి మూమెంట్స్ ఫంక్షన్‌కు అసలైన కళను తీసుకొస్తాయి. డీఎస్పీ ఈ రేంజ్‌లో రష్మిక పెళ్లిపై స్పందించడం నిజంగా ఒక క్రేజీ మూమెంట్ అని చెప్పాలి.
