పవన్ ను మార్చిన దేవీశ్రీ ఫిలాసఫీ
దేవీ చెప్పిన ఆ ఆలోచన పవన్ కళ్యాణ్‌ను ఎంతగానో ప్రభావితం చేసిందట. ఆ సంభాషణ తర్వాత పవన్ కళ్యాణ్ వావ్... ఎంత మంచి ఫిలాసఫీ చెప్పావ్ అంటూ దేవీని అభినందించారట.
By: Sravani Lakshmi Srungarapu | 27 May 2026 11:00 PM ISTతెలుగు సినీ పరిశ్రమలో సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టేజ్‌పై అయినా, స్టూడియోలో అయినా, ఇంటర్వ్యూల్లో అయినా ఆయన కనిపించే తీరు ఎప్పుడూ ఫుల్ జోష్‌తోనే ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దేవీ శ్రీ ప్రసాద్ చెప్పిన ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో తనకు జరిగిన ఓ ఫిలాసఫికల్ సంభాషణను ఆయన గుర్తు చేసుకోవడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఓ సారి పవన్ కళ్యాణ్ దేవీశ్రీని చూసి నువ్వెప్పుడు చూసినా చాలా జాలీగా, చిల్‌గా కనిపిస్తావు. ఎప్పుడూ డల్‌గా ఉండవు. ఆ ఎనర్జీకి కారణమేంటి? అని అడిగారట. ఆ ప్రశ్నకు మొదట ఏమి చెప్పాలో తెలియకపోయినా, వెంటనే నేను దేన్నీ ద్వేషించను సర్ అని చెప్పాడట. ఆ మాట విన్న పవన్ కళ్యాణ్ ఆశ్చర్యపోయి ఒక్క లైన్‌లో పెద్ద ఫిలాసఫీ చెప్పావ్. దాన్ని ఇంకాస్త వివరంగా చెప్పు అని అడిగారట. దానికి దేవీ, "ఐ యామ్ లివింగ్ ఇన్ ది మూమెంట్ సర్. ఏది వచ్చినా దాన్ని ఎంజాయ్ చేస్తాను. ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్లాలని ప్లాన్ చేసి వాళ్లు రాకపోయినా నేను నిరాశ చెందను. నాకు చేయాల్సిన మరో పని చూసుకుంటాను. బీచ్‌కు వెళ్తే అక్కడి సైలెన్స్ ను ఆస్వాదిస్తాను. పబ్‌కు వెళ్తే లౌడ్ మ్యూజిక్‌ను కూడా అదే స్థాయిలో ఎంజాయ్ చేస్తాను. నాకు నచ్చదు అనే విషయం నా జీవితంలో లేదు" అని చెప్పినట్లు దేవీ తెలిపాడు.
దేవీ చెప్పిన ఆ ఆలోచన పవన్ కళ్యాణ్‌ను ఎంతగానో ప్రభావితం చేసిందట. ఆ సంభాషణ తర్వాత పవన్ కళ్యాణ్ వావ్... ఎంత మంచి ఫిలాసఫీ చెప్పావ్ అంటూ దేవీని అభినందించారట. ఆ తర్వాత ఇద్దరి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ రిలీజై మొదటి రోజే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. అదే రోజు రాత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా దేవీకి ఫోన్ చేసి కంగ్రాట్స్, థ్యాంక్యూ అని చెప్పారట. దానికి దేవీ సర్, నేను మీకు చెప్పాలి కదా అని అడిగితే, పవన్ ఇచ్చిన సమాధానం తనకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేసిందని దేవీ అన్నాడు.
ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు విన్నాక, ఒక సినిమాపై మన ప్రేమ మొత్తం పెట్టి చేస్తే ఏమవుతుందో చూడాలనిపించింది. ఆ ఫీలింగ్‌తోనే ఈ సినిమా చేశా. ఇప్పుడు రిజల్ట్ చూశావు కదా అని పవన్ కళ్యాణ్ దేవీతో చెప్పారట. ఆ మాటలు విన్న క్షణంలో తనకు అరికాళ్ల నుంచి తలనిండా గూస్‌బంప్స్ వచ్చాయని, ఆ సంఘటనను గుర్తు చేసుకున్నప్పుడల్లా ఇప్పటికీ అదే ఫీలింగ్ వస్తుందని దేవీ శ్రీ ప్రసాద్ తెలిపాడు.
ఇదిలా ఉంటే, దేవీ శ్రీ ప్రసాద్ మరియు పవన్ కళ్యాణ్ కలయికలో వచ్చిన అనేక సినిమాలు సంగీత పరంగా భారీ విజయాలు సాధించాయి. ముఖ్యంగా వారి కాంబినేషన్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం దేవీ శ్రీ ప్రసాద్ టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతూనే, మరోవైపు హీరోగా కూడా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాడు. ఎల్లమ్మ అనే సినిమాతో హీరోగా అరంగేట్రం చేయబోతుండగా, ఈ ప్రాజెక్ట్‌పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
