Begin typing your search above and press return to search.

నా జీవితంలో మర్చిపోలేని ఘటన అదే!

ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి మర్చిపోలేని సంఘటన అనేది ఉంటుంది.అలాంటి ఒక సంఘటనే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ జీవితంలో కూడా ఉందట.

By:  Madhu Reddy   |   3 Nov 2025 4:50 PM IST
నా జీవితంలో మర్చిపోలేని ఘటన అదే!
X

ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి మర్చిపోలేని సంఘటన అనేది ఉంటుంది.అలాంటి ఒక సంఘటనే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ జీవితంలో కూడా ఉందట. ఆ సంఘటన నా జీవితంలోనే చాలా గొప్ప సంఘటన అని..ఆరోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు దేవిశ్రీప్రసాద్. మరి దేవిశ్రీప్రసాద్ లైఫ్ లో మర్చిపోలేని ఆ సంఘటన ఏంటో ఇప్పుడు చూద్దాం ..

దేవిశ్రీప్రసాద్ తాజాగా పాల్గొన్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోలో తన లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే దేవిశ్రీప్రసాద్ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయట పెట్టారు.ఆయన మాట్లాడుతూ.." ఎవరైనా లైఫ్ లో ఏ విషయాన్ని అయినా సరే బలంగా కోరుకుంటే అది కచ్చితంగా జరిగి తీరుతుంది అంటారు. అందరి లైఫ్ లో ఏమో గానీ నా లైఫ్ లో మాత్రం నేను కోరుకున్న విషయం జరిగింది. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి ఒక్కసారైనా ఇళయరాజా గారిని చూడాలి అని ఎంతో బలంగా అనుకున్నాను. అయితే నా కోరిక నెరవేరింది. ఒకరోజు ఇళయరాజా గారే స్వయంగా నా స్టూడియో కి వచ్చారు. ఇళయరాజా గారు నాకు దేవుడితో సమానం.. అలాంటిది ఆయన నా స్టూడియోకి రావడం నిజంగా నేను చేసుకున్న పుణ్యమే. ఇళయరాజా గారు నా స్టూడియోకి వచ్చిన రోజును నేను ఎప్పటికీ మర్చిపోను.నా జీవితంలో అదే గొప్ప సంఘటన" అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దేవిశ్రీప్రసాద్.

అలాగే తన పెళ్లికి సంబంధించి ఎదురైన ప్రశ్నకు కూడా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు.. నా లైఫ్ లో పెళ్లి పక్కనే మరో ఏదైనా ఆప్షన్ ఉంటే కచ్చితంగా ఆ ఆప్షన్ నే ఓకే చేస్తాను. ఇప్పుడు ముందు హీరో అవుతారా.. పెళ్లి చేసుకుంటారా అంటే కచ్చితంగా హీరో అవుతాను అనే ఆప్షన్ నే ఎంచుకుంటాను అంటూ పెళ్లికి సంబంధించి కూడా స్పందించారు. దేవిశ్రీప్రసాద్ మాటలు చూస్తుంటే ఆయన ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కనిపించడం లేదు. చాలా రోజుల నుండి దేవిశ్రీప్రసాద్ పెళ్లి వార్తలు సోషల్ మీడియా లో వైరల్ అయినప్పటికీ ఏది నిజం కాలేదు.

గతంలో ఆయన ఓ హీరోయిన్ ని గాఢంగా ప్రేమించారని, కానీ ఆ హీరోయిన్ చేసిన మోసమే ఆయన్ని పెళ్లికి దూరం చేసింది అనే టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ దేవిశ్రీప్రసాద్ పాటలతో మెప్పించినట్లుగానే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటే చూడాలని ఉంది అంటూ ఆయన ఫ్యాన్స్ అందరూ భావిస్తున్నారు.మరి చూడాలి దేవిశ్రీప్రసాద్ ఫ్యూచర్ లో అయినా పెళ్లి చేసుకుంటారా.. లేక బ్రహ్మచారిగానే మిగిలిపోతారా అనేది..

ఇక దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారినప్పటినుండి తన మ్యూజిక్ కి చిరంజీవి డ్యాన్స్ చేస్తే చూడాలి అనే కోరిక ఉండేదట. అలా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కి చిరంజీవి డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆయన అలా షాక్ లో చూస్తూనే ఉంటారట. అంతేకాదు చిరంజీవి గారి ఎనర్జీ లెవెల్స్ సూపర్ అంటూ పొగిడారు.