Begin typing your search above and press return to search.

DSP ముందున్న అసలైన మైండ్ సెట్ ఛాలెంజ్!

సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నటుడిగా తెరంగేట్రం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   26 Oct 2026 3:45 PM IST
DSP ముందున్న అసలైన మైండ్ సెట్ ఛాలెంజ్!
X

సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నటుడిగా తెరంగేట్రం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. `ఎల్లమ్మ` చిత్రంతో దేవి శ్రీ ప్ర‌సాద్ కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అవుతుండటం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. స్టేజ్ పై ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌లు.. డ్యాన్స్ మూమెంట్స్‌తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న డీఎస్పీ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఇతరులతో పోలిస్తే పబ్లిసిటీ అడ్వాంటేజ్ లభిస్తుందనడంలో సందేహం లేదు.

అయితే కొత్త ఇన్నింగ్స్‌లో దేవిశ్రీ ప్రసాద్ ఎదుర్కొంటున్న సవాల్ ఏమిటంటే? రెండు దశాబ్దాలుగా ప్రేక్షకుల మనస్సుల్లో ముద్రపడిన సంగీత దర్శకుడి ఇమేజ్‌ను దాటి తెరపై నటుడిగా మెప్పించడం. స్టేజ్ షోలో ఐదు నిమి షాల ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో మెప్పించడం వేరు. రెండున్నర గంటలపాటు పాత్రలో జీవిస్తూ సినిమాను భుజ స్కం ధాలపై నడిపించడం పూర్తిగా వేరు. తెరపై ప్రేక్షకుడు దేవిశ్రీ ప్రసాద్ కాకుండా ఆయన పోషిస్తున్న క్యారెక్టర్‌ను మాత్రమే చూసేలా చేయడం ప్రాజెక్టు ముందున్న అతిపెద్ద పరీక్ష. తమిళంలో సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి `బిచ్చగాడు` వంటి సంచలన విజయంతో నటుడిగా స్థిరపడిన విజయ్ ఆంటోనీ ప్రయాణం గుర్తుకురావడం సహజం.

అయితే విజయ్ ఆంటోనీ విజయం సాధించడానికి కారణం ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఇమేజ్ మాత్ర‌మే కాదు. కథలో భావోద్వేగాలు .. ఆయన ఎంచుకున్న పాత్రల సహజత్వమే. డీఎస్పీ కూడా అదే తరహాలో మ్యూజిక్ ఇమేజ్ ను ప‌క్క‌న‌బెట్టి నటనలో భావోద్వేగాలతో ప్రేక్షకులకు క‌నెక్ట్ అవ్వాలి. కేవలం స్టార్‌డమ్ .. సెలబ్రిటీ క్రేజ్ మాత్రమే సినిమాను బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలబెట్టలేవు. `ఎల్లమ్మ` సినిమాతో దేవిశ్రీ ప్రసాద్ విజయం సాధించాలంటే బల మైన కథ .. కథనంతో పాటు ఆయన పాత్ర చిత్రణ ప్రేక్షకులకు నేరుగా కనెక్ట్ కావాల్సి ఉంది.

నటుడిగా డీఎస్పీకి సరిపోయే సన్నివేశాలు, సహజమైన అభినయానికి అవకాశం ఇచ్చే ఎమోషనల్ పాయింట్స్ ఉన్నప్పుడే డెబ్యూ మూవీ నిలబడుతుంది. సంగీత ప్రపంచంలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న డీఎస్పీకి నటన అదనపు సృజనాత్మక ప్రయాణం మాత్రమే. ఈ ప్రయత్నం కోసం డీఎస్పీ మ్యూజిక్ కెరీర్‌ను వదులుకోవాల్సిన అవసరం లేదు కానీ నటుడిగా ప్రేక్షకులు ఆమోద ముద్ర వేస్తే మాత్రంన కెరీర్‌కు మరో బలమైన కోణం తోడవుతుంది. డీఎస్పీలో సహజమైన ఎనర్జీ.. బాడీ లాంగ్వేజ్‌ను సరిగ్గా వినియోగించుకుంటే వైవిధ్యమైన నటుడిగా నిలదొక్కుకునే అవకాశం పుష్కలంగా ఉంది.