మహేష్ తోనే కాదు, ఎన్టీఆర్ తో కూడానా?
ఆర్ఆర్ఆర్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను అందుకుంది.
By: Sravani Lakshmi Srungarapu | 3 Nov 2025 1:00 AM ISTఆర్ఆర్ఆర్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను అందుకుంది. అప్పుడెప్పుడో అరవింద సమేత తర్వాత తారక్ నుంచి వచ్చిన సోలో సినిమా కావడంతో దేవర మూవీకి ఫస్ట్ నుంచే భారీ అంచనాలున్నాయి. పైగా వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ కూడా హిట్ అవడంతో దేవర కు ఆ పాయింట్ కూడా బాగా కలిసొచ్చింది.
రెండు భాగాలుగా దేవర కథ
భారీ అంచనాల నడుమ రిలీజైన దేవర కు టాక్ పరంగా మిక్డ్స్ టాక్ వచ్చింది కానీ కలెక్షన్లు మాత్రం భారీగా రాబట్టుకుంది. అయితే దేవర కథ చాలా పెద్దదని, దాన్ని ఒక సినిమాలో చెప్పడం వీలవదని దేవరను రెండు భాగాలుగా చేసి దేవర1, దేవర2 లుగా రిలీజ్ చేస్తామని డైరెక్టర్ ముందే అనౌన్స్ చేయగా, గతేడాది దేవర1 రిలీజై ఫ్యాన్స్ ను బాగా శాటిస్‌ఫై చేసింది.
దేవర2పై భారీ అంచనాలు
అయితే దేవర సినిమాలో కంటే దేవర2లోనే కథ ఎక్కువ ఉండటంతో దేవర2పై అంచనాలు పెరిగాయి. దేవర1లో మిగిలిన ఎన్నో ప్రశ్నలకు దేవర2లో సమాధానం దొరకనుంది. ఇదిలా ఉంటే ఇప్పుడే దేవర2 గురించి టాలీవుడ్ సర్కిల్స్ లో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దేవర2లో మరో భామను హీరోయిన్ గా తీసుకోవాలని కొరటాల భావిస్తున్నట్టు తెలుస్తోంది.
దేవర2లో కీలక పాత్ర కోసం బాలీవుడ్ హీరో
దేవర1 కోసం ఆల్రెడీ బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ను రంగంలోకి దింపిన కొరటాల, ఇప్పుడు దేవర2 కోసం మరో హీరోయిన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. ఆ హీరోయిన్ మరెవరో కాదు, ప్రియాంక చోప్రా. ఆల్రెడీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సరసన నటిస్తుండగా, ఇప్పుడు ఈ సినిమాలో కూడా ప్రియాంక నటించనుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది. మరో హీరోయిన్ తో పాటూ ఓ బాలీవుడ్ హీరోను కూడా దేవర2 కోసం తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్న తారక్, ఆ సినిమాను పూర్తి చేసి డిసెంబర్ నుంచి దేవర2ను సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట.
