Begin typing your search above and press return to search.

'దేవ‌ర 2' షూటింగ్‌పై మ‌ళ్లీ ఊహాగానాలు!

రాజ‌మౌళి వంటి స్టార్ డైరెక్ట‌ర్ త‌రువాత అప‌జ‌య‌మెరుగ‌ని డైరెక్ట‌ర్ అనిపించుకున్నాడు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌.

By:  Ravindar Gorantla   |   17 Feb 2026 2:00 PM IST
దేవ‌ర 2 షూటింగ్‌పై మ‌ళ్లీ ఊహాగానాలు!
X

రాజ‌మౌళి వంటి స్టార్ డైరెక్ట‌ర్ త‌రువాత అప‌జ‌య‌మెరుగ‌ని డైరెక్ట‌ర్ అనిపించుకున్నాడు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌.రైట‌ర్‌గా నాలుగు స‌క్సెస్‌ఫుల్ సినిమాల‌కు ప‌ని చేసిన కొర‌టాల శివ `మిర్చి`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకుని తొలి మూవీతోనే స్టార్ డైరెక్ట‌ర్ల జాబితాలోకి చేరిపోయాడు. యూవీ క్రియేష‌న్స్‌కిది ఫ‌స్ట్ మూవీ. అలాగే మైత్రీ మూవీ మేక‌ర్స్‌ని `శ్రీ‌మంతుడు` సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసి తొలి మూవీతోనే వారికి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని అందించారు.

అప్ప‌టి వ‌ర‌కు వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న సూప‌ర్ స్టార్ మ‌హేష్‌కు ఈ మూవీతో సూప‌ర్ స‌క్సెస్‌ని అందించి మ‌ళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చారు. ఎన్టీఆర్‌తో `జ‌న‌తా గ్యారేజ్‌`, మ‌హేష్ బాబుతో `భ‌ర‌త్ అనే నేను` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని అందించి అప్ప‌టి వ‌ర‌కు నాలుగు సూప‌ర్ హిట్‌ల‌ని అందించి అప‌జ‌య‌మెరుగ‌ని డైరెక్ట‌ర్ అనిపించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌తో చేసిన `ఆచార్య‌` ఆ ట్యాగ్‌ని బ్రేక్ చేసింది. డైరెక్ట‌ర్‌గా కొర‌టాల‌కు బిగ్ షాక్ ఇచ్చింది. ఇద్ద‌రు స్టార్లు న‌టించిన `ఆచార్య‌` బాక్సాఫీస్ వ‌ద్ద భారీ డిజాస్ట‌ర్ అనిపించుకుని అభిమానుల‌తో పాటు సినీ ల‌వ‌ర్స్‌ని షాక్‌కు గురి చేసింది.

ఇలాంటి టైమ్‌లో ఉన్న కొర‌టాల శివ‌..యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో చేసిన యాక్ష‌న్ డ్రామా `దేవ‌ర‌`. మెన్ ఆఫ్ యాక్ష‌న్ ఎన్టీఆర్‌ని రెండు విభిన్న‌మైన క్యారెక్ట‌ర్ల‌లో చూపించిన ఈ మూవీ భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టినా `ఆర్ఆర్ఆర్‌` త‌రువాత ఎన్టీఆర్‌కు ఏర్ప‌డిన క్రేజ్‌ని మాత్రం మ్యాచ్ చేయ‌లేక‌పోయింది. హిట్ టాక్‌ని సొంతం చేసుకున్నా కానీ ఎన్టీఆర్ అభిమానుల్ని, సినీ ల‌వ‌ర్స్‌ని ఆశించిన స్థాయిలో సంతృప్తిప‌ర‌చ‌లేక‌పోయింది. దీంతో `దేవ‌ర‌` సీక్వెల్ ఉంటుందా? అనే అనుమానాలు స‌ర్వ‌త్రా వినిపించాయి.

దానికి తోడు ఎన్టీఆర్ ఇత‌ర ప్రాజెక్ట్‌ల‌లో బిజీగా ఉండ‌టంతో ఇక `దేవ‌ర‌` సీక్వెల్ క‌ష్ట‌మ‌నే సంకేతాలు బ‌ల‌ప‌డ్డాయి. ఈ నేఫ‌థ్యంలో `దేవ‌ర 2` ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని, దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంద‌ని, ప‌వంబ‌ర్ నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించి ఈ ప్రాజెక్ట్‌పై వ‌స్తున్న రూమ‌ర్‌ల‌కు చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. అయినా స‌రే `దేవ‌ర 2` షూటింగ్‌పై ఊహ‌గానాలు ఆగ‌డం లేదు. న‌వంబ‌ర్ నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ని చెబుతున్నా అది నిజంగా జ‌రుగుతుందా? అనే అనుమానాల్ని అంతా వ్య‌క్తం చేస్తున్నారు.

దీంతో `దేవ‌ర 2` మ‌ళ్లీ వార్త‌ల్లో నిలుస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ `డ్రాగ‌న్‌` మూవీ చేస్తున్నాడు. ప్ర‌శాంత్ నీల్ డార్క్ ఫాంట‌సీ థీమ్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. దీని కోసం ఎన్టీఆర్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీతో త‌మ అభిమాన హీరో పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బ‌స్ట‌ర్‌ని సొంతం చేసుకోవాల‌ని కోరుకుంటున్నారు. ఈ మూవీ త‌రువాత మేక‌ర్స్ అంటున్న‌ట్టుగా `దేవ‌ర 2` సెట్స్‌పైకి వెళుతుందా? అన్న‌ది వేచి చూడాల్సిందే.