కొరటాల టైం మొదలైనట్టేనా..?
ఒక దశలో దేవర 2 ఆపేసే ఆలోచన కూడా చేశారు. కానీ కొరటాల శివ దేవర 2 మీద రెండేళ్లు వర్క్ చేసి ఫైనల్ గా ఒక మంచి కథతో రెడీ చేశాడని తెలుస్తుంది.
By: Ramesh Boddu | 6 Feb 2026 11:56 AM ISTదేవర తర్వాత కొరటాల శివ కెరీర్ డైలమాలో పడిపోయిందని తెలిసిందే. అంతకుముందు ఎన్ టీ ఆర్ కి జనతా గ్యారేజ్ లాంటి సక్సెస్ ఇచ్చాడని కొరటాల శివతో దేవర అంటూ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేశాడు తారక్. ఐతే దేవర సినిమాపై ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ అవ్వలేకపోయింది. సినిమా కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా దేవర పార్ట్ 1 వల్ల ఎన్టీఆర్ డిజప్పాయింట్ అయ్యాడు. ఐతే దేవర సెకండ్ పార్ట్ ఉంటుందా లేదా అన్న డిస్కషన్ నిన్న మొన్నటిదాకా జరిగింది.
ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో దేవర 2..
ఒక దశలో దేవర 2 ఆపేసే ఆలోచన కూడా చేశారు. కానీ కొరటాల శివ దేవర 2 మీద రెండేళ్లు వర్క్ చేసి ఫైనల్ గా ఒక మంచి కథతో రెడీ చేశాడని తెలుస్తుంది. ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో దేవర 2 సెట్స్ మీదకు వెళ్లబోతుందని టాక్. ఐతే ఈ సినిమా తర్వాత కొరటాల శివ నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తాడని తెలుస్తుంది. బాలయ్య బాబుతో కొరటాల శివ ఈ కాంబినేషన్ అసలు డిస్కషన్ లో లేదు.
దేవర తర్వాత కొరటాల నెక్స్ట్ ఏం చేయాలన్న కన్ ఫ్యూజన్ ఏర్పడింది. ఐతే కాస్త టైం తీసుకున్న కొరటాల శివ నెక్స్ట్ సినిమాల మీద ఫోకస్ పెట్టాడు. ఎన్టీఆర్ తో దేవర 2 చేయడంతో పాటు బాలకృష్ణ 113వ సినిమా కూడా లైన్ చేస్తున్నారట. కొరటాల శివ లాంటి డైరెక్టర్ తో బాలకృష్ణ సినిమా అనగానే నందమూరి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
రైటర్ నుంచి డైరెక్టర్ గా మారిన కొరటాల శివ..
అంతేకాదు ఈ రెండు సినిమాలతో పాటు కొరటాల శివ మరో యంగ్ హీరోతో కూడా సినిమా చేస్తారని తెలుస్తుంది. ఐతే ఆ హీరో ఎవరన్నది ఇంకా బయటకు రాలేదు. సో దేవర 2 ఆ తర్వాత బాలకృష్ణ సినిమా ఈ రెండిటి తర్వాత యంగ్ యాక్టర్ తో సినిమా ఇలా మళ్లీ కెరీర్ మీద గ్రిప్ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు కొరటాల శివ.
రైటర్ నుంచి డైరెక్టర్ గా మారిన కొరటాల శివ మిర్చి నుంచి భరత్ అనే నేను వరకు సక్సెస్ అందుకున్నా కూడా ఆచార్య, దేవర 1 సినిమాల ఫలితాలు అన్ని వెనక్కి నెట్టేశాయి. అందుకే కెరీర్ లో తిరిగి ట్రాక్ ఎక్కాలనే ఉద్దేశంతో కొరటాల శివ తన ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ సినిమాలతో అయినా కొరటాల శివ కంబ్యాక్ ఇస్తారేమో చూడాలి. దేవర 2 కోసం కొరటాల శివ పూర్తిగా కొత్త కథతో కొత్త ట్విస్ట్ లతో వస్తుండగా సినిమా మాత్రం ఈసారి నెక్స్ట్ లెవెల్ లో సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే కొరటాల శివతో దేవర 2 మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.
