Begin typing your search above and press return to search.

వాయిదా నేప‌థ్యంలో 'దేవ‌ర‌2' జూన్ నుంచా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న‌ భారీ యాక్షన్ చిత్రం ఈ ఏడాదే విడుదలవుతుందని అంతా ఆశించారు.

By:  Srikanth Kontham   |   22 April 2026 6:00 PM IST
వాయిదా నేప‌థ్యంలో దేవ‌ర‌2 జూన్ నుంచా?
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న‌ భారీ యాక్షన్ చిత్రం ఈ ఏడాదే విడుదలవుతుందని అంతా ఆశించారు. కానీ ఊహించని విధంగా చిత్రాన్ని ఏకంగా 2027 జూన్‌కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. అంటే మూడేళ్ల త‌ర్వాత రిలీజ్ అవుతున్న చిత్ర‌మిది. ఈసినిమా షూటింగ్ ఎంత వ‌ర‌కూ పూర్త‌యింది? అన్న దానిపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు. ఈ నేప‌థ్యంలో తార‌క్ ఈ ఒక్క సినిమాకే డేట్లు కేటాయిస్తారా? మ‌ధ్య‌లో మ‌రో సినిమా మొద‌లు పెట్ట‌డానికి అవ‌కాశం ఉందా? అంటే ఉంద‌నే చెప్పాలి. తార‌క్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `దేవ‌ర 2` పూర్తి చేయాల్సిన సంగ‌తి తెలిసిందే. ఇరువురు ప్రాజెక్ట్ ను అధికారికంగానూ ప్ర‌క‌టించారు.

వాస్త‌వానికి ప్ర‌శాంత్ నీల్ ప్రాజెక్ట్ కంటే ముందే ప‌ట్టాలెక్కాలి. కానీ `దేవ‌ర` పై వ‌చ్చిన డివైడ్ టాక్ నేప‌థ్యంలో వాయిదా వేసారు. అయినా ప్రాజెక్ట్ ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఎక్క‌డా ప్ర‌క‌టించ‌లేదు. `దేవ‌ర 2` విష‌యంలో రెట్టించిన ఉత్సాహంతో ప‌ని చేయ‌డానికే తామిద్ద‌రం సిద్దంగా ఉన్నామ‌నే సంకేతాన్ని అభిమానుల్లోకి పంపించారు. ఈ నేప‌థ్యంలో నీల్ ప్రాజెక్ట్ డిలే కావ‌డంతో? `దేవర 2` షూటింగ్‌ పట్టాలెక్కించేందుకు మార్గం సుగమమైంది. గతంలోనే చిత్ర బృందం చెప్పినట్లుగా జూన్ నెల నుండి రెండో భాగం షూటింగ్ ప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నాయి.

తారక్ కాల్‌షీట్లు వృథా కాకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లే అవకాశం దక్కింది. ఓ వైపు ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ కొనసాగుతుండగానే మ‌రోవైపు కొరటాల శివ సినిమాను కూడా సమాంతరంగా పూర్తి చేయాలని తారక్ ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఒకే సమయంలో రెండు విభిన్నమైన ప్రపంచాల్లో ప్రయాణించడం అంత సుల‌భం కాదు. ఏన‌టుడికైనా పెద్ద పరీక్షే. కానీ తార‌క్ ఆ క‌ష్టాన్ని సునాయాసంగా జ‌యించ‌గ‌ల‌డు. న‌టుడిగా అత‌డి ప్ర‌తిభ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. నంద‌మూరి వార‌సత్వం ఉన్నా? ఆ ఇమేజ్ ఎక్క‌డా త‌న‌పై ప‌డ‌కుండా ఇండ‌స్ట్రీలో ఎదిగారు.

ద‌ర్శ‌కుల‌కు ది బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వ‌డం కోసం ఎక్క‌డా రాజీ ప‌డ‌ని న‌టుడు. సింగిల్ టేక్ అర్టిస్ట్ అయినా? పూర్తిగా ద‌ర్శ‌కుల‌కు క‌ట్టుబ‌డి ప‌ని చేస్తారు. ఈ నేప‌థ్యంలో ఏక కాలంలో రెండు సినిమాలు పూర్తి చేయ‌డం తార‌క్ అంత ఒత్తిడిగా భావించరు. ఇప్ప‌టికే `దేవ‌ర‌2 `స్క్రిప్ట్ పనులను పూర్తి చేసి కొర‌టాల సిద్దంగా ఉన్నారు. మొదటి భాగంలో వదిలేసిన ప్రశ్నలకు సమాధానాలు, సముద్ర తీరంలో జరిగే మరిన్ని భీకరమైన పోరాటాలు ఈ రెండో భాగంలో ఉండబోతున్నాయి. జూన్ నుండి షూటింగ్ మొదలైతే? ప్రశాంత్ నీల్ సినిమా 2027లో వచ్చేలోపే `దేవర 2`ని సిద్ధం చేసే అవకాశం ఉంది. కొర‌టాల త‌న సినిమా షూటింగ్ లు పూర్తి చేయ‌డానికి సంవ‌త్స‌రాలు పాటు స‌మ‌యం కేటాయించరు. స్టోరీ బేబేస్ట్ క‌థ‌లు కాబ‌ట్టి? వీలైనంత త్వ‌ర‌గానే షూటింగ్ చేసే అవ‌కాశం ఉంటుంది.