దేవర 2: బిగ్ షాక్ తప్పదా?
నిన్న మొన్నటి వరకు షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది.
By: M Prashanth | 25 Nov 2025 10:45 AM ISTబాక్సాఫీస్ విజయాలు వచ్చినప్పుడు సీక్వెల్స్ ప్రకటించడం ఈ మధ్య కామన్ అయిపోయింది. కానీ ఆ ప్రకటించిన ఉత్సాహం చివరి వరకు కొనసాగించడం కత్తి మీద సాము లాంటిది. 'దేవర' సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఎన్టీఆర్ కొరటాల తప్పకుండా, పార్ట్-2 చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆ విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
నిన్న మొన్నటి వరకు షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. ఈ సినిమా ఇక సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ లేదని, ప్రాజెక్ట్ ను పూర్తిగా నిలిపివేశారని టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే ఇది డేట్స్ అడ్జస్ట్ కాకనో, బడ్జెట్ కుదరకనో తీసుకున్న నిర్ణయం కాదు. దీని వెనుక బలమైన "క్రియేటివ్" కారణమే ఉందని ఇండస్ట్రీ టాక్.
అసలు విషయానికొస్తే.. దర్శకుడు కొరటాల శివ, సీక్వెల్ కోసం కొత్త వెర్షన్ డ్రాఫ్ట్ ను సిద్ధం చేసి ఎన్టీఆర్ కు వినిపించారట. కానీ ఆ కథ తారక్ ను మెప్పించలేకపోయిందని సమాచారం. మొదటి భాగానికి కొనసాగింపుగా కథ సహజంగా సాగలేదని, ఏదో బలవంతంగా సాగదీసినట్లు అనిపించిందట. కేవలం సీక్వెల్ అనౌన్స్ చేశాం కాబట్టి చేయడం ఎందుకని తారక్ పునరాలోచనలో పడ్డారట.
బలమైన కథ లేకుండా ముందుకెళ్తే, మొదటి పార్ట్ తెచ్చిన మిక్స్ డ్ టాక్ వలన మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని అనుకుంటున్నారట. అందుకే కాంప్రమైజ్ అయ్యి సినిమా చేయడం కంటే, ప్రాజెక్ట్ ను పక్కన పెట్టడమే మంచిదని ఎన్టీఆర్ భావించినట్లు తెలుస్తోంది. ఇది కఠినమైన నిర్ణయమే అయినా, లాంగ్ రన్ కెరీర్ పరంగా చూస్తే, క్వాలిటీ విషయంలో రాజీపడకపోవడం చాలా మంచి నిర్ణయం అని విశ్లేషకులు అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
దేవర 2 విషయంలో సందిగ్ధత ఉన్నా, ఎన్టీఆర్ లైనప్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. ఆయన ఫోకస్ ఇప్పుడు పూర్తిగా మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ మీదే ఉంది. 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ నుంచి కొత్త షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా చేస్తోంది. నీల్ మార్క్ ఎలివేషన్స్ కోసం తారక్ ఈ సినిమాకే ఓటు వేశారు.
