దేవర 2ని పర్మినెంట్‌గా పక్కన పెట్టినట్టేనా?
భారీ అంచనాల మధ్య విడుదలైన `దేవర` బాక్సాఫీస్ వద్ద అనుకున్న విధంగా ఆకట్టుకోలేకపోయింది. వసూళ్ల పరంగా పరవాలేదు అనిపించినా ఎన్టీఆర్‌కు, ఆయన అభిమానులకు మాత్రం భారీ నిరాశ కలిగించింది.
By: Srikanth Kontham | 24 Dec 2025 11:00 PM ISTస్టార్ డైరెక్టర్ కొరటాల శివకు అపజయమెరుగని దర్శకుడిగా పేరుంది. తను డైరెక్టర్‌గా పరిచయమైన `శ్రీమంతుడు` నుంచి `భరత్ అనే నేను` వరకు వరుస విజయాల్ని సొంతం చేసుకున్నారు. నాలుగు వరుస హిట్‌లతో అపజయమెరుగని డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న కొరటాలకు మెగాస్టార్ షాక్ ఇచ్చాడు. ఆయనతో కలిసి కొరటాల చేసిన మూవీ `ఆచార్య`. ఇందులో రామ్‌చరణ్ ఎక్స్‌టెండెడ్ గెస్ట్ రోల్ లో నటించాడు. చిరు, చరణ్ తొలిసారి కలిసి నటించిన సినిమా కావడం, ప్రారంభానికి ముందే సినిమాపై హైప్ క్రియేట్ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఆ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా భారీ షాక్ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచి దర్శకుడిగా కొరటాల శివకు తొలి ఫ్లాప్‌ని అందించింది. ఈ సినిమా ఫలితంతో కాస్త నిరాశకు గురైన కొరటాల శివ రెండేళ్ల విరామం తరువాత చేసిన మూవీ `దేవర`. ఈ మూవీని రెండు భాగాలుగా తీయాలని ముందు ఎలాంటి ప్లాన్ లేదు. కానీ తరువాతే ప్లాన్ మారి రెండు భాగాలుగా చేయాలనుకున్నారు. అందులో భాగంగానే `దేవర` పార్ట్ 1ని గత ఏడాది రిలీజ్ చేశారు.
భారీ అంచనాల మధ్య విడుదలైన `దేవర` బాక్సాఫీస్ వద్ద అనుకున్న విధంగా ఆకట్టుకోలేకపోయింది. వసూళ్ల పరంగా పరవాలేదు అనిపించినా ఎన్టీఆర్‌కు, ఆయన అభిమానులకు మాత్రం భారీ నిరాశ కలిగించింది. ఆర్ ఆర్ ఆర్ తరువాత విడుదలైన `దేవర` ఎన్టీఆర్ క్రేజ్‌కు తగ్గట్టుగా ఆ స్థాయిని మ్యాచ్ చేయలేకపోయింది. దీంతో పార్ట్ 2పై అనుమానాలు మొదలయ్యాయి. అదే సమయంలో బాలీవుడ్ మూవీ `వార్ 2`కు ఎన్టీఆర్ టైమ్ కూటాయించడంతో `దేవర 2` ఇప్పట్లో కష్టమే అనే టాక్ వినిపించింది.
ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ `డ్రాగన్` షూటింగ్‌తో బిజీగా ఉండటంతో కొరటాల శివ ఫైనల్‌గా `దేవర 2 `ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టారనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టిన కొరటాల తన తదుపరి ప్రాజెక్ట్ కోసం నందమూరి బాలకృష్ణని కలిశాడని, ఇద్దరు కలిసి త్వరలో ఓ భారీ మూవీకి శ్రీకారం చుట్టబోతున్నారని టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. రీసెంట్‌గా బాలయ్య `అఖండ 2`తో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. `అఖండ` సూపర్ సక్సెస్ కావడంతో ఈ సీక్వెల్‌పై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి.
బోయపాటి శ్రీను, బాలయ్యల కాంబినేషన్‌లో రూపొందిన సినిమా కావడంతో అందరి దృష్టి `అఖండ 2`పై పడింది. కానీ డిసెంబర్ 12న విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో మాత్రం వసూళ్లని రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో కొరటాల శివతో బాలయ్య సినిమా అనే వార్త ఫ్యాన్స్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో ఓ భారీ హిస్టారికల్ మూవీ చేస్తున్నాడు. నయనతార హీరోయిన్ నటిస్తున్న ఈ మూవీలో బాలకృష్ణ కింగ్‌గా, వారియర్‌గా డ్యుయెల్ రోల్‌లో కనిపించబోతున్నాడు. దీని తరువాతే కొరటాల ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్.
