అవి రెండు మామూలు గుండెలు కాదే!
కానీ సినిమా రిలీజ్ అయిన అనతరం పార్ట్ 2 ఉంటుందని ప్రకటించారు. సెట్స్ లో ఉన్నప్పుడే రెండు భాగాలుగా చేస్తున్నట్లు కొరటాల ప్రకటించారు.
By: Srikanth Kontham | 28 Sept 2025 12:51 PM IST`దేవర` మొదటి భాగం పాన్ ఇండియాలో ఎలాంటి ఫలితం సాధించిందో తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా డివైడ్ టాక్ తో నడిచింది. సినిమాకి రివ్యూలు కూడా డివైడ్ గానే వచ్చాయి. వీటిలో హైలైట్ అయింది నెగిటివ్ రివ్యూలే. `దేవర` అనే కొత్త ప్రపంచంలో పాత మసాలా కథనే చూపించారు? అన్నది ప్రధానంగా హైలైట్ అయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇమేజ్ తో భారీ ఓపెనింగ్స్ అయితే సాధించింది గానీ లాంగ్ రన్ లో ఆశించిన ఫలితాలైతే సాధించలేదు. ఇలాంటి రిజల్ట్ చూసిన తర్వాత పార్ట్ 2 తీయడానికి ఎవరూ సాహసించరు. ముందుకు రారు.
లైన్ క్లియర్ చేసిన నిర్మాణ సంస్థ:
కానీ సినిమా రిలీజ్ అయిన అనతరం పార్ట్ 2 ఉంటుందని ప్రకటించారు. సెట్స్ లో ఉన్నప్పుడే రెండు భాగాలుగా చేస్తున్నట్లు కొరటాల ప్రకటించారు. కథ పెద్దది కావడంతో? రెండు భాగాలు చేసినట్లు అర్దమైంది. కానీ రిలీజ్ తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత రెండవ భాగం ఉండదనుకున్నారంతా. ఆరంభంలో ఉంటుందని చెప్పినా? వెంటనే నో చెప్పలేక అలా చెబుతున్నారనుకున్నారంతా. కానీ పార్ట్ 2 కథపై కొరటాల మరింత వర్క్ చేయడం మొదలు పెట్టారు. అయినా మొదలయ్యే వరకూ గ్యారెంటీ లేదనే ప్రచారం జోరుగా సాగింది.
దేవర 2 పిక్చర్ క్లియర్:
తారక్ కూడా `డ్రాగన్` తో బిజీ అవ్వడం..ఇదే సమయంలో కొత్త దర్శకుల పేర్లు తెరపైకి రావడంతో `దేవర 2` అటకెక్కినట్లేనని ప్రచారం పతాక స్థాయిలో జరిగింది. కానీ కొరటాల-ఎన్టీఆర్ మాత్రం `దేవర 2` విషయంలో ఎంత మాత్రం రాజీ పడలేదని మరోసారి క్లారిటీ వచ్చేసింది.`దేవర` రిలీజ్ అయి ఏడాది పూర్తయిన సందర్భంగా సీక్వెల్ పోస్టర్ ను పంచుకోవడంతో `దేవర 2` ఉంటుందని ఖరారైంది. దీంతో `దేవర2` విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని పుల్ క్లారిటీ వచ్చేసింది. `దేవర` ఎప్పటికీ గుర్తు పెట్టుకునే పేరు అది.
డౌట్ అక్కర్లేదు..కొరటాల అదే పనిలో:
అతను పంచిన ప్రేమ, చూపిన భయం ఎప్పటికీ మర్చిపోరు. దేవర 2 కోసం అందరూ సిద్దంగా ఉండండి` అంటూ నిర్మాణ సంస్థ నుంచే క్లియర్ గా ప్రకటనే వచ్చేసింది. దీంతో ఈ సినిమా 2026 లో ప్రారంభం కావడం దాదాపు లాంఛ నంగానే కనిపిస్తోంది. ఇలాంటి ప్రకటన వచ్చిందంటే? కొరటాల-ఎన్టీఆర్ `దేవర` కథని ఎంతగా నమ్ముతున్నారు? అన్నది మరోసారి బయట పడింది. `దేవర` రిలీజ్ అనంతరం కొరటాల `దేవర 2` కథపైనే వర్క్ చేస్తున్నారు? అంతే నిజమని తేలిపోయింది.
