వేరే సినిమాకు డైరెక్షన్.. ఇది దేవకట్ట క్లారిటీ
అందుకే దేవకట్ట నుంచి సినిమా వస్తుందంటే సగటు ప్రేక్షకుడిలో ఎప్పుడూ ఒక ఆసక్తి ఉంటుంది.
By: M Prashanth | 12 Jun 2026 12:37 PM ISTతెలుగు ఇండస్ట్రీలో దేవ కట్టా పేరు వినగానే వెంటనే గుర్తొచ్చేది ఆయన పెన్ పవర్. కమర్షియల్ గా ఆయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు రాబట్టకపోయినా, ఒక మేకర్ గా ఇండస్ట్రీలో మంచి రెస్పెక్ట్ ఉంది. ప్రస్థానం లాంటి సినిమాతో ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. కథలో డెప్త్, క్యారెక్టర్స్ మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్, ఆలోచింపజేసే డైలాగ్స్ రాయడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పొచ్చు. అందుకే దేవకట్ట నుంచి సినిమా వస్తుందంటే సగటు ప్రేక్షకుడిలో ఎప్పుడూ ఒక ఆసక్తి ఉంటుంది.
అతనిలో ఉన్న ఈ అద్భుతమైన రైటింగ్ టాలెంట్ వల్లే ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లు సైతం సలహాలు తీసుకుంటుంటారు. గతంలో రాజమౌళి లాంటి క్రియేటర్ బాహుబలి సినిమా టైమ్ లో కొన్ని కీలకమైన సీన్స్ కు దేవ కట్టా రైటింగ్ సపోర్ట్ తీసుకున్నారు. ఈ బలమైన హిస్టరీ ఉండటం వల్లే, ఏ పెద్ద ప్రాజెక్ట్ అనౌన్స్ అయినా అందులో దేవ కట్టా ఇన్వాల్వ్మెంట్ ఉందనే వార్తలు ఈజీగా జనాల్లోకి వెళ్లిపోతుంటాయి.
ఈ క్రమంలోనే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఆయన చుట్టూ రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కనున్న గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసిలో కూడా అతని హస్తం ఉందనే టాక్ గట్టిగా వినిపించింది. అలాగే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్స్ కు, దేవర లాంటి పాన్ ఇండియా సినిమాలకు కూడా ఆయన తన పెన్ పవర్ తో సహాయం చేస్తున్నారని గుసగుసలు వచ్చాయి.
ఇక పవన్ కళ్యాణ్ తో ఆయన ఒక పవర్ ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ చేయబోతున్నారనే రూమర్స్ కూడా ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇన్ని వార్తలు వస్తున్నా ఎప్పుడూ పెద్దగా స్పందించలేదు. కానీ రీసెంట్ గా ఈ రూమర్స్ డోస్ కాస్త శృతి మించింది. కేవలం రైటింగ్ మాత్రమే కాదు, వేరే దర్శకుల సినిమాలకు ఆయన డైరెక్షన్ కూడా చేస్తున్నారని ప్రచారం మొదలైంది.
కొన్ని కీలకమైన షాట్స్ ఆయన డైరెక్షన్ లోనే తెరకెక్కుతున్నాయని వార్తలు పుట్టించారు. కేవలం రెండు క్లిక్స్ కోసం కొన్ని వెబ్ సైట్లు ఇలాంటి చెత్త ప్రచారం చేయడంతో దేవకట్టకు అసహనం తెప్పించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ఫేక్ ప్రచారంపై డైరెక్ట్ గా స్పందించారు. వేరే వాళ్ళ సినిమాలకు తను కనీసం ఒక్క షాట్ కూడా డైరెక్ట్ చేయడం లేదని తేల్చి చెప్పారు.
క్లిక్స్ కోసం ఇంత దిగజారి వార్తలు రాయడం కరెక్ట్ కాదని గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తన సమయం మొత్తం తన తదుపరి సినిమా స్క్రిప్ట్ వర్క్ కోసమే కేటాయిస్తున్నానని, ఆ జర్నీని తాను చాలా ఎంజాయ్ చేస్తున్నానని ఆయన క్లారిటీ ఇచ్చారు. వేరే సినిమాలకు షాడో డైరెక్టర్ గా పనిచేస్తున్నారనే వాదనలకు శాశ్వతంగా చెక్ పడింది. తన కెరీర్ లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ కోసం కష్టపడుతున్నట్లు అర్థమవుతోంది. సరైన సమయం చూసుకుని ఆ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ డీటెయిల్స్ ను అధికారికంగా ప్రకటిస్తానని చెప్పారు.
