Begin typing your search above and press return to search.

ఆ డైరెక్టర్ కి ఒక్క కమర్షియల్ హిట్ ఉంటే సుకుమార్ కి పోటీ ఇచ్చేవాడా?

‘వెన్నెల’, ‘ప్రస్థానం’ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు దేవకట్ట.. కమర్షియల్ విజయాలు లేక వెనుకబడిపోయారు. ‘ఆటోనగర్ సూర్య’, ‘రిపబ్లిక్’ వంటి కంటెంట్ బేస్డ్ చిత్రాలు ప్రశంసలు అందుకున్నా భారీ వసూళ్లు సాధించలేదు. అయితే ఆయన రైటింగ్ నచ్చడంతో రాజమౌళి ‘వారణాసి’ సినిమాకు డైలాగ్స్ రాయించారు. ఒక్క కమర్షియల్ హిట్ పడినా దేవకట్ట స్థాయి మారేదని సినీ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.

By:  Gopi Velupala   |   13 Nov 2026 8:00 PM IST
ఆ డైరెక్టర్ కి ఒక్క కమర్షియల్ హిట్ ఉంటే సుకుమార్ కి పోటీ ఇచ్చేవాడా?
X

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నవాళ్లకే గుర్తింపు ఉంటుంది. వాళ్లకి మాత్రమే స్టార్ హీరోల నుంచి అవకాశాలు వస్తాయి. కొంతమంది దర్శకులు చేసిన సినిమాలు విమర్శకుల ప్రశంసలను అందుకున్నప్పటికి కమర్షియల్ సక్సెస్ లను సాధించిన వాళ్లకు మాత్రమే టైర్ వన్ హీరోల నుంచి అవకాశాలు దక్కుతాయి. ప్రొడ్యూసర్లు సైతం వాళ్ళ సినిమాల కోసం ఎక్కువ బడ్జెట్ ని కేటాయించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ప్రస్తుతం కమర్షియల్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులు ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు...

కమర్షియల్ సక్సెస్ ఉంటే ఆ దర్శకుడు టాప్ లో ఉండేవాడా?

'వెన్నెల' సినిమాతో దర్శకుడి గా పరిచయమైన దేవకట్ట డిఫరెంట్ ఫిలిం మేకర్ గా పేరు సంపాదించుకున్నాడు. 'ప్రస్థానం' సినిమాతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఆయన సరికొత్త మేకర్ గా అవతరించాడు. తన కెరీర్లో చేసిన సినిమాలన్నీ ప్రశంసలను అందించాయి తప్ప కమర్షియల్ సక్సెస్ లను సాధించలేదు. దానివల్ల ఆయన చాలావరకు వెనుకబడిపోయారు. ఆయన చేసిన 'ఆటోనగర్ సూర్య', 'రిపబ్లిక్' లాంటి కంటెంట్ బేస్డ్ మూవీస్ చేసినప్పటికి కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువగా ఉండడం వల్ల ఈ సినిమాలు ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అలరించలేదు. కలెక్షన్లు భారీగా రాలేకపోయాయి. మొత్తానికైతే దేవకట్ట ప్రస్తుతం తనకున్న టాలెంట్ కి సక్సెస్ లు పెద్దగా లేకపోవడం వల్ల మీడియం రేంజ్ డైరెక్టర్ గా మిగిలిపోయాడు. కానీ ఒకవేళ సరైన కమర్షియల్ హిట్ ఒక్కటి దక్కి ఉంటే సుకుమార్ స్థాయిలో టాప్ డైరెక్టర్ గా మారిపోయేవాడు. పాన్ ఇండియాలో సైతం తన సత్తా చాటుకునేవాడని కొంతమంది సినీ విమర్శకులు సైతం అభిప్రాయపడుతున్నారు...

దేవకట్ట బలం ఏంటి?

దేవకట్ట లాంటి మేకర్ కథల విషయంలో క్లారిటీగా ఉంటాడు. హీరోలను మెప్పించడానికి మార్పులు చేర్పులు చేయడు. కథను నమ్ముకొని తను ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని హానెస్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. ఆయన రాసే ప్రతి మాటకి చాలా లోతైన అర్థం ఉంటుంది. దానివల్ల సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించినప్పటికి కమర్షియల్ గా రావాల్సినంత గుర్తింపు రాకపోవడం వల్ల ఆయన ఇప్పటికీ మీడియం రేంజ్ డైరెక్టర్ గానే కొనసాగుతున్నాడు... తన రైటింగ్ స్టైల్ నచ్చి రాజమౌళి తను చేస్తున్న అత్యంత ప్రస్టీజియస్ ప్రాజెక్ట్ 'వారణాసి' లో డైలాగ్స్ రాయించాడు. ఫ్యూచర్ లో దేవకట్ట నుంచి మరికొన్ని డిఫరెంట్ మూవీస్ వచ్చే అవకాశం ఉంది...