యాక్షన్ కట్ చెప్పి ఇక్కడే కాలం!
దేవకట్టా పరిచయం అసవరం లేని పేరు. 'వెన్నెల', 'ప్రస్తానం' లాంటి విజయాలతో దర్శకుడిగా తన ముద్ర వేసారు.
By: Srikanth Kontham | 6 Aug 2025 7:00 PM ISTదేవకట్టా పరిచయం అసవరం లేని పేరు. 'వెన్నెల', 'ప్రస్తానం' లాంటి విజయాలతో దర్శకుడిగా తన ముద్ర వేసారు. ఇండస్ట్రీలో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా రెండు సినిమాలతోనే అసాధరణమైన గుర్తింపును దక్కించుకున్నారు. మనుషులు, వ్యక్తిత్వాలు, సమాజ స్థితి గతలుపై దేవకట్టా చేసిన సినిమాలే అంతటి ఖ్యాతికి కారణమయ్యాయి. ఆయన అపారమైన జ్ఞానం సినిమాల్లో కనిపిస్తుంటుంది. అయితే డైరెక్టర్ గా మాత్రం అనుకున్న స్థాయికి వెళ్లలేకపోయారు. ప్రస్తానం సక్సెస్ ని కొనసాగించలేకపోయారు.
'ఆటోనగర్ సూర్య', 'డైనమైట్', 'రిపబ్లిక్' లాంటి సినిమాలు చేసినా? అవేవి ఆశించిన ఫలితాలు సాధించలేదు. దీంతో అవకాశాలు కూడా తగ్గాయి. ఈ సినిమాలు చేసిన క్రమంలో చాలా గ్యాప్ కూడా ఏర్పడింది. దీంతో దేవకట్టా సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారా? విదేశాలకు వెళ్లిపోయారా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. త్వరలో 'మయసభ' వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇదీ దేవా మార్క్ కంటెంట్ ఉన్న సిరీస్. రిలీజ్ ప్రచారంలో భాగంగా ఆయనపై వచ్చిన విమర్శలకు దేవకట్టా స్పందించారు.
తాను సినిమాలపై ఫ్యాషన్ తో అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చినవాడినన్నారు. ఆరంభంలో మంచి విజయాలు వచ్చినా? తర్వాత వాటిని కొనసాగించలేకపోయినా? తానెప్పుడు మాత్రం ఖాళీగా లేనన్నారు. ఏదో సినిమాకు రైటర్ గా పనిచేస్తూనే ఉన్నానన్నారు. ఊపిరి ఉన్నంత వరకూ ఇండస్ట్రీలో డైరెక్టర్ గానే ఉంటానన్నారు. కెమెరా వెనుక యాక్షన్ కట్ చెప్పి అక్కడే కాలం చేస్తాను తప్ప...పరిశ్రమను వదిలి వెళ్లే ప్రసక్తి లేదన్నారు.
అమెరికాలో తాను చూసిన జీవితం...భారతదేశంలో చూసిన జీవితాలు ఆధారంగా తన కథలు పుడతాయన్నారు. తన సినిమాల్లో డైలాగులకు అంత కీలకంగా ఉండటానికి కారణం బాగా చదవడం ద్వారానే అది సాధ్యమవుతుందన్నారు. ఏ డైలాగ్ రాసినా? వాటంతటవి వస్తాయి? తప్ప పని గట్టుకుని ఆ డైలాగ్ ఇలా ఉండాలని ముందే ఎలాంటి ప్రణాళిక సిద్దంగా ఉండదని....రాసే ప్రోసస్ లోనే అది జరిగిపోతుందన్నారు. నెగిటివ్ ప్రచారంపై స్పందిస్తూ కొంత మంది కావాలనే పనిగట్టుకుని చేసిన ప్రచారంగా కొట్టి పారేసారు.
