Begin typing your search above and press return to search.

ఆశిష్ రెడ్డి 'దేత్తడి'.. గ్లింప్స్ ఎప్పుడంటే?

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు, యంగ్ హీరో ఆశిష్ రెడ్డి ఇప్పుడు దేత్తడి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

By:  M Prashanth   |   20 March 2026 10:49 PM IST
ఆశిష్ రెడ్డి దేత్తడి.. గ్లింప్స్ ఎప్పుడంటే?
X

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు, యంగ్ హీరో ఆశిష్ రెడ్డి ఇప్పుడు దేత్తడి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఆ సినిమాతో ఆదిత్య రావు గంగసాని డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. తెలంగాణ నేపథ్యంలో రా అండ్ రస్టిక్ థీమ్‌ తో ప్రత్యేకమైన కథతో రూపొందిస్తున్నారు. మాస్ అప్పీల్‌ తో కల్చరల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.





హైదరాబాద్‌ కల్చర్ తోపాటు అక్కడి ప్రజల లైఫ్ స్టైల్ ను ప్రతిబింబించే కథతో రూపొందుతున్న ఆ సినిమాలో ఆశిష్ రెడ్డి కొత్త లుక్ లో కనిపించనున్నారు. రౌడీ బాయ్స్, లవ్ మీ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆశిష్.. దేత్తడితో కూడా అలరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆశిష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ కు సినీ ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా దేత్తడి సినిమా నుంచి మరో కీలక అప్డేట్‌ ను మేకర్స్ అందించారు. దేత్తడి మూవీ గ్లింప్స్‌ ను మార్చి 24న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఆ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. డీప్ షేడ్స్ లో నలుపు, ఎరుపు రంగులతో రూపొందించిన ఆ పోస్టర్‌ లో హీరో ఫైర్ బ్రిథింగ్ యాక్ట్ చేస్తూ కనిపించడం విశేషం. అయితే ఆశిష్ ఫేస్ ను చూపకుండా వెనుక నుంచి చూపించడం ద్వారా సస్పెన్స్‌ ను కొనసాగించారు.

అదే సమయంలో దేత్తడి మూవీ సాధారణ కమర్షియల్ ఫార్మాట్‌ కు భిన్నంగా ఉండబోతోందని సమాచారం. ఎమోషన్స్ కు ఇంపార్టెన్స్ ఇవ్వడంతో పాటు ఇప్పటివరకు పెద్దగా టచ్ చేయని కమ్యూనిటీ బేస్డ్ స్టోరీ ఇందులో చూపించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ కు చెందిన స్థానిక భాష, స్లాంగ్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆశిష్ పూర్తి మాస్ ట్రాన్స్ఫార్మేషన్‌ లో కనిపిస్తూ హైదరాబాదీ యాసలో డైలాగులు చెప్పడం సినిమాకు హైలైట్‌ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది.

సినిమాలో మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించనుంది. దేత్తడికి జునైద్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు బాధ్యతలను ప్రసన్న కుమార్ బెజవాడ నిర్వహిస్తున్నారు. ఆయన క్రియేటివ్ హెడ్‌ గా కూడా పనిచేస్తున్నారు. నిర్మాణ పరంగా కూడా మూవీ భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఆ ప్రాజెక్ట్‌ కు ఎక్స్ ప్రొడ్యూసర్‌ గా మురళి పున్నా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం దేత్తడి మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఫ్రెష్ స్టోరీ, విభిన్నమైన ప్రెజెంటేషన్, స్థానిక సంస్కృతి ప్రతిబింబించే అంశాలతో దేత్తడి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మార్చి 24న విడుదల కానున్న గ్లింప్స్.. సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచే అవకాశం ఉంది. మరి ఇంకొన్ని రోజుల్లో రానున్న గ్లింప్స్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.