Begin typing your search above and press return to search.

వార‌సుల్ని సిద్దం చేస్తోన్న న‌యా విల‌న్!

బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో డియోల్ కుటుంబానికి ప్రత్యేకమైన చరిత్ర - భారీ క్రేజ్ ఉన్నాయి. లెజెండరీ నటుడు ధర్మేంద్ర నుండి సన్నీ డియోల్, బాబీ డియోల్ వరకూ ప్రతి ఒక్కరూ తమదైన మాస్ ఇమేజ్‌తో ప్రేక్షకులను అలరించారు.

By:  Srikanth Kontham   |   31 May 2026 9:00 PM IST
వార‌సుల్ని సిద్దం చేస్తోన్న న‌యా విల‌న్!
X

బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో డియోల్ కుటుంబానికి ప్రత్యేకమైన చరిత్ర - భారీ క్రేజ్ ఉన్నాయి. లెజెండరీ నటుడు ధర్మేంద్ర నుండి సన్నీ డియోల్, బాబీ డియోల్ వరకూ ప్రతి ఒక్కరూ తమదైన మాస్ ఇమేజ్‌తో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడీ నటన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తదుపరి తరం కూడా సిద్ధమవుతోంది. నటుడు బాబీ డియోల్ తన ఇద్దరు కుమారులు, ఆర్యమాన్ డియోల్ - ధరమ్ డియోల్ ను చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాలని -నటులుగా స్థిరపడాలని బలంగా కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా బాబీ డియోల్ తన పెద్ద కుమారుడు ఆర్యమాన్ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.




ఆర్యమాన్ అమెరికాలో ప్రతిష్టాత్మకమైన బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యను అభ్యసించడంతో, అతను బహుశా అక్కడే ఉండి కార్పొరేట్ రంగంలో స్థిరపడిపోతాడని తాను భావించినట్లు బాబీ తెలిపారు. ఒక స్టార్ కిడ్ అయినప్పటికీ విదేశాలలో చదువుకుని వ్యాపార రంగం వైపు మొగ్గు చూపుతాడని అనుకున్న కొడుకు హఠాత్తుగా తన మనసు మార్చుకుని వెండితెరపైనే కెరీర్ నిర్మించుకుంటానని చెప్పడం తండ్రిగా తనకు ఆశ్చ‌ర్యాన్ని.. సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. అంతే కాదు చిన్నకుమారుడు ధరమ్ డియోల్ కూడా నటనపైనే పూర్తి ఆసక్తిని కలిగి ఉన్నాడని బాబీ వివరించారు. లుక్ పరంగా ..హావభావాల పరంగా చిన్నప్పటి నుండే ధరమ్‌కు సినిమాల పట్ల ప్రత్యేకమైన మక్కువ ఉందన్నారు.

ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఒకే లక్ష్యంతో ముందుకు సాగడం చూస్తుంటే డియోల్ కుటుంబంలో నటన అనేది రక్తాన్నే జీర్ణించుకుపోయిందని అర్థమవుతోందని చమత్కరించారు. ఇద్దరు యువకులు ఒకేసారి పరిశ్రమలోకి రావడానికి సన్నద్ధమవుతుండటం బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న సవాళ్లు, ఒడిదుడుకులను స్వయంగా అనుభవించిన ఓ సీనియర్ నటుడిగా, బాబీ డియోల్ తన కుమారులు ఇద్దరికీ ఎంతో పరిణతితో కూడిన సలహాలను ఇస్తున్నారు. కేవలం ఒక స్టార్ కుటుంబంలో పుట్టినంత మాత్రాన విజయం సులభంగా దక్కదని ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి కఠినమైన శ్రమ, అంకితభావం ఎంతో అవసరమని స్పష్టం చేశారు.

బ‌య‌ట గ్లామర్‌ను చూసి మోసపోకుండా.. నటనలోని లోతులను, నైపుణ్యాలను నేర్చుకోవాలని కుమారుల‌కు సూచించినట్లు బాబీ తెలిపారు. ప్రస్తుతం ఆర్యమాన్ - ధరమ్ ఇద్దరూ తమ సినీ రంగ ప్రవేశం కోసం తెరవెనుక క‌స‌ర‌త్తులు చేస్తు న్నారు.బాలీవుడ్‌లో రాణించాలంటే భాషా నైపుణ్యం ఎంత ముఖ్యమో గ్రహించిన వీరు ప్రత్యేకంగా హిందీ డిక్షన్ క్లాసులకు హాజర వుతున్నారు. దీంతో పాటు నటనలో మెలకువలు నేర్చుకుంటూ శారీరక దృఢత్వం డ్యాన్స్‌లపై పూర్తి దృష్టి పెట్టారు. పక్కా ప్రణాళికతో.. పూర్తి సన్నద్ధతతోనే ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్ని స్తున్నట్లు తెలుస్తోంది. నటుడిగా బాబి డియోల్ ఎంతో బిజీగా ఉంటూనే.. కుమారు ల భవిష్యత్తును సరైన దిశలో మార్గనిర్దేశం చేయడం విశేషం. రాబోయే రోజుల్లో ఇద్దరు యంగ్ హీరోలు డియోల్స్ మాస్ లెగసీని కాపాడుకుంటూ నేటి తరం వెండి తెర ప్రేక్షకుల అభిరుచులకు తగినట్లుగా తమను తాము ఎలా ఆవిష్కరించు కుంటారో చూడాలి.