Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. నాగార్జున ఫైర్ కెప్టెన్సీ క్యాన్సిల్..!

ఇదివరకు కేవలం హౌస్ లో ఏదైనా జరిగితే ఒక సైడ్ మాత్రమే ఆలోచించి బిగ్ బాస్ టీం ఇచ్చే స్క్రిప్ట్ ను ఫాలో అయ్యే నాగార్జున ఈసారి ఏదైనా ఇష్యూ జరిగితే రెండు వైపుల నుంచి ఆలోచించి క్లాస్ పీకుతున్నాడు

By:  Ramesh Boddu   |   21 Sept 2025 10:13 AM IST
బిగ్ బాస్ 9.. నాగార్జున ఫైర్ కెప్టెన్సీ క్యాన్సిల్..!
X

బిగ్ బాస్ సీజన్ 9 లో నాగార్జున హోస్టింగ్ కూడా చాలా బాగుంది. ఇదివరకు కేవలం హౌస్ లో ఏదైనా జరిగితే ఒక సైడ్ మాత్రమే ఆలోచించి బిగ్ బాస్ టీం ఇచ్చే స్క్రిప్ట్ ను ఫాలో అయ్యే నాగార్జున ఈసారి ఏదైనా ఇష్యూ జరిగితే రెండు వైపుల నుంచి ఆలోచించి క్లాస్ పీకుతున్నాడు. బిగ్ బాస్ 9 రెండో వారం వీకెండ్ ఎపిసోడ్ అదే శనివారం ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నాగార్జున ఫైర్ అయ్యాడు అంటే ఆయన కంటెస్టెంట్స్ మీద ఏమి నోరేసుకుని పడిపోలేదు. కూల్ గా నవ్వుతూనే ఒక్కొక్కళ్ళకి క్లాస్ పీకాడు.

మిస్టేక్ సరిదిద్దు కోవాలని..

ముఖ్యంగా లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో డీమాన్ పవన్ ని సంచాలక్ గా ఉన్న రీతూ చౌదరి కావాలని గెలిపించిందని నాగార్జున అన్నారు. దానికి కొన్ని వీడియోస్ ప్రూఫ్ గా చూపించాడు. హౌస్ మెట్స్ కూడా దానికి ఒప్పుకున్నారు. డీమాన్ పవన్ ని నాగార్జున ఈ గెలుపు కరెక్టేనా అని అడిగితే లేదు సార్ నాకు వద్దు అన్నాడు. అందుకే సంచాలక్ నిర్ణయం వల్ల జరిగిన మిస్టేక్ సరిదిద్దు కోవాలని నాగార్జున డీమాన్ పవన్ కెప్టెన్సీ క్యాన్సిల్ చేశాడు.

అతని కెప్టెన్ బ్యాండ్ ని హరీష్ స్టోర్ రూం లో పెట్టాడు. కెప్టెన్సీ టాస్క్ లో ఫైనల్ గా నిలిచిన భరణి, ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్ లకు మళ్లీ కెప్టెన్సీ టాస్క్ పెడతా అన్నారు నాగార్జున. అలా రీతూ చౌదరి చేసిన పని వల్ల డీమాన్ పవన్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నాగార్జున శనివారం ఎపిసోడ్ లో ప్రియా, దమ్ము శ్రీజాలకు కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. హౌస్ లో ఏం జరిగినా కూడా మీ ఇద్దరు అక్కడ ఒకరు మాట్లాడుతుంటే మరొకరు మాట్లాడి పెద్దది చేస్తున్నారని అన్నారు.

ఫుడ్ మీద అలిగిన మనీష్..

నాగార్జున హరీష్ కి కూడా ఇన్ పుట్స్ ఇచ్చారు. హరితతో మాట్లాడాను నీలో ఫన్ యాంగిల్ తీసుకు రమ్మని చెప్పారు. హౌస్ లోకి వెళ్లిన 3 టార్గెట్స్ ని పూర్తి చేయమని అన్నారని నాగార్జున హరీష్ తో చెప్పారు. హరీష్ కాస్త ఎమోషనల్ అయ్యి కాస్త కుదుట పడినట్టు ఉన్నాడు. ఇక మనీష్ కూడా ఫుడ్ మీద అలిగిన విషయం గుర్తించిన నాగార్జున హౌస్ లో ఎలాంటి సమస్య ఉన్నా దాన్ని ఫుడ్ మీద చూపించకండి అని అన్నారు.

అలా శనివారం ఎపిసోడ్ మాత్రం మంచి డిస్కషన్స్ తో సూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా రీతు చౌదరి వల్ల డీమాన్ పవన్ కెప్టెన్సీ అవ్వడం ఆమె నిజంగానే బయాస్డ్ గా చేసిందని ప్రూవ్ అవ్వడంతో ఆ కెప్టెన్సీ రద్దు చేయడం ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చింది.