Begin typing your search above and press return to search.

జైలుకు యువ‌కుడు.. గ్యాంగ్‌స్ట‌ర్ అని ఊహించుకుని!

స‌మాజంపై సినిమాల ప్ర‌భావాన్ని త‌క్కువగా అంచ‌నా వేయ‌లేం. ఓజీ వ‌చ్చింది.. గ్యాంగ్ స్ట‌ర్ ఓజాస్ పాత్ర‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ద‌ర్శ‌న చాలామందికి గూస్ బంప్స్ తెచ్చింది.

By:  Sivaji Kontham   |   25 Sept 2025 11:00 PM IST
జైలుకు యువ‌కుడు.. గ్యాంగ్‌స్ట‌ర్ అని ఊహించుకుని!
X

స‌మాజంపై సినిమాల ప్ర‌భావాన్ని త‌క్కువగా అంచ‌నా వేయ‌లేం. ఓజీ వ‌చ్చింది.. గ్యాంగ్ స్ట‌ర్ ఓజాస్ పాత్ర‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ద‌ర్శ‌న చాలామందికి గూస్ బంప్స్ తెచ్చింది. అంత‌కుముందు `సాహో`లో ప్ర‌భాస్ యాక్ష‌న్ స్టంట్స్, కేజీఎఫ్ లో రాకింగ్ స్టార్ య‌ష్ గ‌ట్స్, స్టైలిష్ మ్యాన‌రిజ‌మ్స్ ప్ర‌తిదీ యువ‌త‌రాన్ని ప్రేరేపించాయి. అయితే సినిమాల్లో స్టంట్స్ చూసి తాము కూడా గ్యాంగ్ స్ట‌ర్ అయిపోయామ‌ని క‌ల‌లు కంటే అది వ్య‌క్తిగ‌తంగా ఎలాంటి ముప్పు తెస్తుందో ఈ యువ‌కుడికి ప్రాక్టిక‌ల్‌గా అర్థ‌మైంది.

ఇదంతా 23 ఏళ్ల ఢిల్లీ యువకుడికి సంబంధించిన నిజ‌ క‌థ‌. అత‌డు చాలా చిన్న వ‌య‌సులో త‌న‌ను తాను గ్యాంగ్ స్ట‌ర్ గా ఊహించుకున్నాడు. హ‌త్య‌లు దోపిడీలు, అరాచ‌కాల్లో ఆరితేరిపోయాడు. గ్యాంగ్ స్ట‌ర్ ప్రపంచంలోకి సులువుగా అడుగుపెట్టాడు. అయితే పోలీసుల‌కు చిక్కిన త‌ర‌వాత‌ అత‌డు త‌న ప్ర‌వృత్తి గురించి చెప్పిన విష‌యాలు ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. అత‌డు త‌న‌ను తాను `మాయ` అని పిలుచుకుని `మాయా.. మౌత్ కా దుస్రా నామ్`` అనే నినాదంతో ఒక గ్యాంగ్‌ని సృష్టించాడు. అరాచ‌కాల‌కు తెగ‌బ‌డ్డాడు. భ‌య‌ప‌ట్టేందుకు సోష‌ల్ మీడియాల్లో వెప‌న్స్ తో ద‌ర్శ‌న‌మిచ్చారు. అత‌డి వాల‌కం ప‌సిగ‌ట్టాక‌, పోలీసులు దొర‌క‌బుచ్చుకుని అతడిపై 20కి పైగా దోపిడీ, స్నాచింగ్, హత్యాయత్న కేసులు పెట్టారు.

గ్యాంగ్‌స్ట‌ర్ అని చెప్పుకున్న ఈ యువ‌కుడి భ‌విత‌వ్యం ఇప్ప‌టికి అయోమ‌యంగా మారింది. వాస్త‌వంలో అత‌డి ఫాంట‌సీలు వ‌ర్క‌వుట్ కావ‌ని కూడా ప్రూవ్ అయింది. ఇదేమీ సినిమా కాదు.. సెకండ్ ఆప్ష‌న్ ఉండ‌టానికి.. ఇప్పుడు చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుని వెళుతుంది.

ఈ యువ‌కుడు త‌న గ్యాంగ్ తో క‌లిసి ప్ర‌తి ఒక్క‌రినీ బెదిరించ‌డం మొద‌లు పెట్టాడు. అంతేకాదు స‌హ నేర‌గాళ్ల‌లో కొంద‌రిని బెదిరించి డ‌బ్బు కూడా లాక్కున్నాడు. అత‌డి నేర ప్ర‌పంచం అంచెలంచెలుగా ఎదిగింది. కానీ ఏదో ఒక రోజు పోలీసుల‌కు దొరికిపోవాల్సిందేనని ప్రూవైంది. ఫాంట‌సీలు వ‌ద్దు.. సాధార‌ణ జీవితం ముద్దు! అనేది ఇందుకే.