పవన్ 'దేఖ్లేంగే సాలా'.. DSP రీక్రియేషన్ అదుర్స్..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి రీసెంట్ గా దేఖ్లేంగే సాలా సాంగ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 4 Jan 2026 2:51 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి రీసెంట్ గా దేఖ్లేంగే సాలా సాంగ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాపై టీజర్, పోస్టర్స్ ఇప్పటికే హైప్ క్రియేట్ చేయగా.. దేఖ్లేంగే సాలా సాంగ్ వాటిని ఫుల్ గా పెంచేసింది.
''రంపంపం రంపంపం.. స్టెప్పేస్తే భూకంపం.. దేఖ్లేంగే సాలా.. చూసినాము చాలా'' అంటూ సాగే పాట అటు ఫ్యాన్స్ ను.. ఇటు మ్యూజిక్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ అభిమానులతో విజిల్స్ వేయించేలా ఉందని చెప్పాలి.
మంచి డ్యాన్స్ నంబర్ ను కంపోజ్ చేసి మెప్పించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్.. ఇప్పుడు సాంగ్ ను రీ క్రియేట్ చేయడం విశేషం. అందుకు సంబంధించిన వీడియోను తాజాగా మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. చార్ట్ బస్టర్ సాంగ్ ను రాక్ స్టార్.. స్పెషల్ గా రీ క్రియేట్ చేశారని చెప్పారు. ప్రస్తుతం నెట్టింట వీడియో వైరల్ గా మారింది.
అయితే ఫారిన్ లో దేవిశ్రీ ప్రసాద్.. దేఖ్లేంగే సాలా సాంగ్ ను రీ క్రియేట్ చేసినట్లు స్పష్టంగా విజువల్స్ ద్వారా తెలుస్తోంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా దేవిశ్రీ స్టెప్పులు ఓ రేంజ్ లో ఉన్నాయి. గ్రేస్ తో ఫిదా చేశారు. సాంగ్ లో యమా స్టైలిష్ గా కనిపిస్తూ తనలోనే డ్యాన్స్ టాలెంట్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు.
దేఖ్లేంగే సాలా సాంగ్ ను ఎంతటి రేంజ్ లో కంపోజ్ చేశారో.. ఇప్పుడు అంతకుమించి రీ క్రియేషన్ తో డీఎస్పీ మెప్పించారని ఫ్యాన్స్, నెటిజన్లు, సినీ ప్రియులు చెబుతున్నారు. అదుర్స్ సార్ అంటూ కొనియాడుతున్నారు. ప్రతి స్టెప్ లో గ్రేస్ ఉందని చెబుతున్నారు. మామూలుగా డ్యాన్స్ చేయలేదుగా అంటూ డీఎస్పీని ఆకాశానికెత్తేస్తున్నారు.
ఇక సాంగ్ విషయానికొస్తే.. దేఖ్లేంగే సాలా పాటను సింగర్ విశాల్ దడ్లానీ హుషారుగా ఆలపించారు. భాస్కర భట్ల క్యాచీ లిరిక్స్ అందించగా.. దినేష్ మాస్టర్ పవర్ స్టార్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా కొరియోగ్రఫీ చేశారు. సాంగ్ సెటప్ తోపాటు విజువల్స్ అద్భుతంగా ఉండగా.. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ డ్యాన్స్ చేయడం కొత్తగా అనిపించింది.
ఉస్తాద్ సినిమా విషయానికొస్తే.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి గ్రాండ్ గా రూపొందిస్తుండగా.. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.
