Begin typing your search above and press return to search.

దీవాన 'తెల్ల పోరి'.. చిన్న ప్రోమోతోనే హైప్ పెంచేలా..

ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్‌ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ రాగా.. ఇప్పుడు రెండో పాట ప్రోమో కూడా నెట్టింట ట్రెండ్ అవుతోంది.

By:  M Prashanth   |   26 May 2026 11:44 AM IST
దీవాన తెల్ల పోరి.. చిన్న ప్రోమోతోనే హైప్ పెంచేలా..
X

యంగ్ హీరో హర్షిత్ రెడ్డి నటిస్తున్న అప్ కమింగ్ మూవీ దీవాన ప్రస్తుతం యూత్‌ లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్‌ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ రాగా.. ఇప్పుడు రెండో పాట ప్రోమో కూడా నెట్టింట ట్రెండ్ అవుతోంది. తెల్ల పోరి పేరుతో విడుదల చేసిన ఆ చిన్న ప్రోమో ఇప్పుడు నెటిజన్లతో పాటు మ్యూజిక్ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.

శుభం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హర్షిత్ రెడ్డి లీడ్ రోల్ లో నటిస్తుండగా.. స్మేహ మణిమేగలై హీరోయిన్‌ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్లపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. ప్రేమ కథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై మొదటి నుంచే యూత్ ఆడియన్స్‌ లో ఇంట్రెస్ట్ కనిపిస్తోంది.

ఇప్పటికే విడుదలైన ఇది ప్రేమ అంటూ సాగే పాట మంచి రెస్పాన్స్ అందుకుంది. సింగర్ కార్తీక్ ఆలపించిన ఆ మెలోడీ సాంగ్ యూట్యూబ్‌ లో మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. ముఖ్యంగా లవ్ ఫీల్ ను స్మూత్ గా చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో సినిమాకి మ్యూజికల్‌ గా మంచి బజ్ ఏర్పడింది. ఇప్పుడు విడుదలైన తెల్ల పోరి సాంగ్ ప్రోమో మాత్రం స్పెషల్ టోన్‌ లో ఉండడం విశేషం.

క్రేజీ బాయ్, క్రేజీ లవ్, క్రేజీ లిరక్స్ అంటూ అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన సెకెండ్ సాంగ్ ప్రోమోలో యూత్‌ కు కనెక్ట్ అయ్యే ఫన్నీ, క్రింజ్ స్టైల్ లిరిక్స్ వినిపిస్తున్నాయి. చిన్న ప్రోమో అయినప్పటికీ పాటలోని బీట్, కంపోజింగ్, వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తెల్ల పోరి అంటూ వచ్చే హుక్ లైన్ కు ఫుల్ గా రీల్స్ క్రియేట్ అవ్వడం పక్కా అని చెప్పాలి.

ఆ పాటకు సంగీతం అందించడంతో పాటు లిరిక్స్ కూడా ఈశ్వర్ చంద్ రాశారు. ఆయనే సాంగ్ ను ఆలపించారు కూడా. యూత్ పల్స్‌ కు తగ్గట్టుగా ఫన్నీ స్టైల్‌ లో కంపోజ్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో చాలా మంది ఆ ప్రోమోను ఫన్ లవ్ సాంగ్ గా కామెంట్ చేస్తున్నారు. మరోవైపు దీవాన సినిమా పోస్టర్లు కూడా ఆసక్తి పెంచుతున్నాయి.

ముఖ్యంగా ఇది వన్‌ సైడ్ లవ్ స్టోరీలోని మ్యాడ్‌ నెస్‌ ను చూపించే కథగా ఉండబోతుందని అర్థమవుతోంది. యూత్ లో ఉండే లవ్, అట్రాక్షన్, ఎమోషన్స్‌ ను కొత్త తరహాలో చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దీవాన సినిమాను గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ వరల్డ్ వైడ్ గా జూన్ 19న గ్రాండ్‌ గా విడుదల చేయనుంది. ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తోంది. అయితే టీజర్, పాటలు మంచి స్పందన తెచ్చుకుంటుండటంతో.. రిలీజ్ సమయానికి మూవీపై మరింత హైప్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మే 28న రానున్న సెకెండ్ సింగిల్ తెల్ల పోరి ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.