Begin typing your search above and press return to search.

క్రియేటివ్ గా సాటిస్ఫికేషన్.. ఫైనాన్సియల్ గా కూడా త్వరలోనే: దీవాన ప్రొడ్యూసర్స్

సినిమా విడుదల తర్వాత రోజురోజుకూ కలెక్షన్లు పెరుగుతున్నాయని వాసుదేవ్ వెల్లడించారు.

By:  M Prashanth   |   23 Jun 2026 9:04 PM IST
క్రియేటివ్ గా సాటిస్ఫికేషన్.. ఫైనాన్సియల్ గా కూడా త్వరలోనే: దీవాన ప్రొడ్యూసర్స్
X

హర్షిత్ రెడ్డి హీరోగా తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ దీవాన ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోందని నిర్మాతలు వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి తెలిపారు. జూన్ 20న విడుదలైన ఆ సినిమా తొలి రోజుల నుంచి మంచి స్పందన అందుకుంటోందని, ముఖ్యంగా ప్రేక్షకుల మధ్య పాజిటివ్ మౌత్ టాక్ వేగంగా వ్యాపిస్తోందని చెప్పారు.

అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఆ చిత్రంతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయమయ్యారు. సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. నిర్మాత శ్రీదేవి కార్యంపూడి మాట్లాడుతూ.. దీవానకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోందన్నారు.

ముఖ్యంగా ఇంటర్వెల్, సెకండాఫ్‌ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. సినిమా చూసిన వారు కథలోని కీలక మలుపులను బయటపెట్టకుండా ఉండటం ఆనందంగా ఉందన్నారు. సినిమా స్ట్రాంగ్ స్టోరీ, ఎమోషన్స్ తో ముందుకు సాగుతుందని తెలిపారు. సినిమా నిర్మాణంలో ఇన్వెస్టర్లుగా కాకుండా క్రియేటివ్ గా కూడా పార్టనర్స్ అని శ్రీదేవి పేర్కొన్నారు.

రోల్స్ క్యారక్టరైజేషన్ నుంచి కథా చర్చల వరకు ప్రతి అంశంలో తమ రోల్ ఉందని చెప్పారు. దీవాన తమకు క్రియేటివిటీ పరంగా ఎంతో సంతృప్తినిచ్చిందని, వీకెండ్ లో ఫైనాన్సియల్ గా మంచి రిజల్ట్స్ అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాత వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ.. విడుదలకు ముందు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ, సెన్సార్ ప్రక్రియ ఆలస్యం కావడంతో ప్రమోషనల్ ఈవెంట్స్ కొన్ని నిర్వహించలేకపోయామని తెలిపారు.

చిన్న సినిమాలకు విడుదల తేదీ మార్చడం అంత ఈజీ కాదని అన్నారు. ప్రేక్షకుల్లో దీవానపై మొదట యూత్‌ ఫుల్ లవ్ స్టోరీ అనే అభిప్రాయం ఏర్పడిందని, అయితే ఇది ప్రేమతో పాటు ఫ్యామిలీ రిలేషన్స్, లవ్, ఎమోషన్స్ ను మిక్స్ చేసిన పూర్తి కుటుంబ కథా చిత్రమని వివరించారు. సినిమా చూసినవారు కుటుంబ సభ్యులతో కలిసి చూడదగిన చిత్రమని చెబుతున్నారని పేర్కొన్నారు.

సినిమా విడుదల తర్వాత రోజురోజుకూ కలెక్షన్లు పెరుగుతున్నాయని వాసుదేవ్ వెల్లడించారు. చూసిన ప్రతి ఒక్కరూ సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారని, అదే ఇప్పుడు సినిమాకు పెద్ద బలంగా మారిందన్నారు. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుండడంతో షోలకు ప్రేక్షకుల హాజరు పెరుగుతోందని చెప్పారు. దీంతో వచ్చే రోజుల్లో సినిమా మరిన్ని వసూళ్లు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రేక్షకులను మరింతగా థియేటర్లకు రప్పించేందుకు టికెట్ ధరలను కూడా తగ్గించినట్లు తెలిపారు. సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.105గా నిర్ణయించామని చెప్పారు. ప్రస్తుతం తమ సంస్థలో రెండు కొత్త చిత్రాలపై పనులు జరుగుతున్నాయని నిర్మాతలు వెల్లడించారు. వాటిలో ఒకటి తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే సూపర్ హీరో చిత్రం కాగా, మరొకటి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ అని తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.