Begin typing your search above and press return to search.

'తెలుగు సినిమాను చంపేయాలనుకుంటున్నారు'.. దీవాన డైరెక్టర్ సంచలన కామెంట్స్

"సెన్సార్ కరెక్షన్స్ చేసి ఇచ్చాక కూడా ఇంకా ఉన్నాయని అంటున్నారు. క్రియేటివిటీ, బ్యూటీగా సినిమా తీసిన సీన్ ను, రెండు రోజుల్లో చేసిన పాటను కట్ చేసేశారు.

By:  M Prashanth   |   22 Jun 2026 9:54 PM IST
తెలుగు సినిమాను చంపేయాలనుకుంటున్నారు.. దీవాన డైరెక్టర్ సంచలన కామెంట్స్
X

యంగ్ క్యాస్టింగ్ హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేఖలై జంటగా నటించిన లేటెస్ట్ లవ్ అండ్ ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామా దీవాన మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌ తో బాక్సాఫీస్ వద్ద సినిమా సందడి చేస్తుండగా.. మరోవైపు సెన్సార్ బోర్డు ఇచ్చిన ఏ సర్టిఫికెట్ విషయంలో మూవీ టీమ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్‌లో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

సినిమా కోసం పడిన కష్టాన్ని గుర్తించకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన శ్రీకాంత్.. తెలుగు సినిమాపై కావాలనే వివక్ష చూపుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. "ఒక మనిషిని మర్డర్ చేయడం ఎంత ఘోరమైనదే అంటే.. ఒక శత్రువు ఉంటే వాడు మనకు హాని కల్పిస్తే ఓకే.. ఎందుకంటే మనం అంటే ఇష్టం లేదు కాబట్టి.. తెలియని మనిషి ఎక్కడో కూర్చుని తెలుగు సినిమా క్యా హై అంటున్నాడు" అని అన్నారు.

"సెన్సార్ కరెక్షన్స్ చేసి ఇచ్చాక కూడా ఇంకా ఉన్నాయని అంటున్నారు. క్రియేటివిటీ, బ్యూటీగా సినిమా తీసిన సీన్ ను, రెండు రోజుల్లో చేసిన పాటను కట్ చేసేశారు.. సినిమాకు అవే మెయిన్. చిన్న పిల్లలు చూసే సీన్స్ ను కట్ చేయించారు. సినిమాకు తల తీసినట్లు అయింది. నేను ఎవరైతే ఇలా చేస్తున్నారో.. ఎంత హింసించారో.. నా డ్రీమ్ ను చంపేశారు" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

"మా అమ్మ ఎప్పుడూ ఒకటే మాట అనేది.. పిల్లలంతా అమెరికాలో ఉన్నారు.. అందరూ వచ్చేయాలి ట్రంప్ వల్ల అని అనేది.. కానీ ఇప్పుడు దీవానకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారని చెబితే.. పిల్లలు అక్కడే ఉండాలి.. మనం కూడా వెళ్లిపోవాలని అనేది. తెలియని మనిషి పగ బెట్టుకోవడం ఏంటో.. ఎవరో ముంబైలో కూర్చుని దీవాన మూవీ రిలీజ్ కు రెండు రోజుల ముందు రివ్యూ రిలీజ్ చేశాడు" అని తెలిపారు.

"వాళ్లు తెలుగు సినిమా డామినేషన్ ను చంపాలనుకుంటున్నారు. తెలుగు సినిమాపై ఎంతో పగ ఉందో అర్థమవుతోంది. మొత్తం ఇండియా అయినా తెలుగు సినిమా కళను చంపాలనుకుంటున్నారు" అంటూ శ్రీకాంత్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అయితే దీవాన చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నప్పటికీ.. సెన్సార్ బోర్డు ఇచ్చిన ఏ సర్టిఫికెట్ వల్ల వసూళ్లపై ప్రభావం పడిందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, యువతలో కొంతమంది సినిమా విషయంలో ముందుగానే భిన్నాభిప్రాయానికి వచ్చారని చెబుతున్నారు. విడుదలకు ముందే కొన్ని సీన్స్, పాట తొలగించడంతో సినిమాకు నష్టం జరిగిందని దర్శకుడు వాపోయారు. ‘శుభం వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హర్షిత్ రెడ్డి ఈ చిత్రంలో సోలో హీరోగా నటించగా.. స్మేహ మణిమేఖలై హీరోయిన్‌ గా కనిపించింది. నరేష్, ఝాన్సీ కీలక పాత్రలు పోషించారు. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్లపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఆ సినిమాను గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేసింది.