అప్పుడు సందీప్ వంగ.. ఇప్పుడు నాగ్ అశ్విన్.. మరి అట్లీ దీపికను భరించగలడా?
బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
By: Madhu Reddy | 18 Sept 2025 2:46 PM ISTబాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బాలీవుడ్లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిన ఈమె ఈమధ్య తెలుగు చిత్రాలలో కూడా నటించడానికి ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తొలిసారి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన 'కల్కి 2898AD' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకుంది. దాంతో ' కల్కి 2' సినిమాలో కూడా ఈమె నటిస్తోంది అంటూ వార్తలు రాగా.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నిర్మాణ సంస్థ వైజయంతి మూవీ బ్యానర్ ఒక అధికారిక పోస్ట్ చేస్తూ.. ఈ సినిమా నుండి దీపికను తప్పించినట్లు అధికారిక ప్రకటన చేసింది. దీనితో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మాణ సంస్థ ఎక్స్ ద్వారా ఒక పోస్ట్ షేర్ చేస్తూ.. "జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మేము ఒక నిర్ణయానికి వచ్చాము. కల్కి సీక్వెల్ లో దీపికా భాగం కాదని అధికారికంగా తెలియజేస్తున్నాము. తొలి భాగం కోసం ఆమెతో సుదీర్ఘ ప్రయాణం చేసినప్పటికీ.. రెండవ భాగంలో భాగస్వామి కాలేకపోయింది. గొప్ప టీం తో కలిపి సీక్వెల్ మీ ముందుకు వస్తుంది. భవిష్యత్తులో దీపిక మంచి సినిమాలతో అలరించాలని కోరుకుంటున్నాం" అంటూ పోస్ట్ పెట్టింది. ఇకపోతే ఈ విషయం విని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు దీపికా పదుకొనేకి ఇలా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం కల్కి 2 నుంచి దీపిక పదుకొనేను తప్పించాం అంటూ నిర్మాణ సంస్థ ప్రకటించడంతో పలు అనుమానాలు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఎందుకంటే గతంలో సందీప్ రెడ్డివంగా - ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న ' స్పిరిట్' మూవీలో కూడా మొదట దీపికా పదుకొనేను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఈమె చాలా ఖరీదైన నటి. దీనికి తోడు ఖర్చులు కూడా అధికం. అందుకే ఈమెను భరించలేక ఈ సినిమా నుండి తప్పించి .. ఈమె స్థానంలో 'యానిమల్' సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న త్రిప్తి డిమ్రీని రంగంలోకి దింపారు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభం కాబోతోంది. అలా ఈ సినిమా నుంచి తప్పించడంతోనే పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన ఈమె.. ఇప్పుడు మళ్లీ కల్కి2 నుండి కూడా తప్పించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ప్రస్తుతం దీపికా పదుకొనే.. అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్లో వస్తున్న AA22xA6 సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే . ఇప్పటికే ఈమె పాత్రకు సంబంధించి కొంత షూటింగ్ కూడా జరిగినట్లు సమాచారం. అయితే అటు సందీప్ రెడ్డివంగా ఇటు నాగ అశ్విన్ మూవీల నుంచి ఈమెను తప్పించడంతో.. మరి అట్లీ అయినా ఈమెను భరిస్తారా? అనే కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రేక్షకులు. సాధారణంగా ఈమె చాలా ఎక్స్పెన్సివ్ నటి. మరి ఈమె ఖర్చులను భరించడానికి కళానిధి మారన్ సిద్ధంగా ఉన్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా అప్పుడు సందీప్ రెడ్డివంగా.. ఇప్పుడు నాగ్ అశ్విన్.. మరి అట్లీ దీపికను భరిస్తారా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి దీనికి సమాధానం తెలియాలు అంటే మునుముందు ఏం జరగబోతుందో తెలియాల్సి ఉంది.
