Begin typing your search above and press return to search.

టైప్‌కాస్టింగ్‌కు చెక్.. దీపిక కెరీర్‌లో బిగ్ టర్న్!

ముఖ్యంగా కింగ్ మూవీలో ఆమె క్యారెక్ట‌ర్ పై క్లారిటీ లేక‌పోయినా, మూవీలో ఆమె పాత్ర క‌థ‌ను మ‌లుపు తిప్పుతుంద‌ని తెలుస్తోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   16 April 2026 10:00 PM IST
టైప్‌కాస్టింగ్‌కు చెక్.. దీపిక కెరీర్‌లో బిగ్ టర్న్!
X

బాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దీపికా ప‌దుకొణె, ఇప్పుడు కీలక దశలో తన కెరీర్‌ను మరింత జాగ్రత్తగా మలుచుకుంటున్నట్టు కనిపిస్తోంది. రెండేళ్ల గ్యాప్ తర్వాత ఆమె కింగ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కంబ్యాక్ కేవలం మరో సినిమా రీఎంట్రీగా కాకుండా, ఆమె కెరీర్‌లో ఒక కొత్త దిశను సూచించే అవకాశంగా భావిస్తున్నారు. ముఖ్యంగా కింగ్ మూవీలో ఆమె క్యారెక్ట‌ర్ పై క్లారిటీ లేక‌పోయినా, మూవీలో ఆమె పాత్ర క‌థ‌ను మ‌లుపు తిప్పుతుంద‌ని తెలుస్తోంది.

స‌క్సెస్‌ఫుల్ కాంబోగా దీపికా- షారుఖ్

ఇక మరోవైపు, షారుఖ్- దీపికా జంట ఇప్పటికే పలుమార్లు బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకోవడంతో, అదే కాంబినేషన్ మళ్లీ రావడంపై మిక్డ్స్ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దీపిక కొత్త జోడీల వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. యంగ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ద్వారా తన ఇమేజ్‌ను రీడిజైన్ చేసుకోవాలనే ప్రయత్నం కనిపిస్తోంది. ఇది కేవలం కమర్షియల్ స్ట్రాటజీ మాత్రమే కాకుండా, కొత్త ఆడియన్స్‌ను ఆకర్షించాలనే లాంగ్‌టర్మ్ ప్లాన్‌గా కూడా విశ్లేషిస్తున్నారు.

జాంబీపై దీపికా ఆస‌క్తి

దీపిక తీసుకుంటున్న డెసిష‌న్స్ ను పరిశీలిస్తే, ఆమె స్పష్టంగా కెరీర్ రీ ఇన్వెన్షన్ దిశగా అడుగులేస్తున్నట్టు కనిపిస్తోంది. టైప్‌కాస్టింగ్‌ నుంచి బయటపడుతూ, కేవలం స్టార్ హీరోయిన్ పాత్రలకు పరిమితం కాకుండా, కథను నడిపించే మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రల వైపు షిఫ్ట్ అవ్వాలనే సంకేతాలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో, ర‌ణ్‌వీర్ సింగ్ న‌టిస్తున్న జాంబీ ప్రాజెక్ట్‌పై ఆమె ఆసక్తి చూపార‌నే వార్తలు కూడా చర్చకు దారితీశాయి. ఆమె ఈ ప్రాజెక్ట్‌లో పారితోషికం లేకుండా కూడా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరిగినా, మేకర్స్ వేరే దిశలో ఆలోచిస్తున్నారని సమాచారం. ఇది ఆమె కొత్త జానర్స్‌పై ఆసక్తిని స్పష్టంగా చూపిస్తోంది.

ఇక సినిమాల ఎంపికలో కూడా దీపిక మరింత సెలెక్టివ్‌గా మారింది. వరుసగా సినిమాలు సైన్ చేయడం కంటే, క్వాలిటీ ఉన్న ప్రాజెక్ట్స్‌నే ఎంచుకోవాలనే ధోరణి కనిపిస్తోంది. ఇది ఓవర్ ఎక్స్‌పోజర్‌ను నివారించడమే కాకుండా, ప్రతి సినిమాతో ప్రత్యేక గుర్తింపు పొందాలనే స్ట్రాటజీగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ యంగ్ హీరోలతో జోడీ అవ్వడం ఒక ట్రెండ్‌గా మారుతున్న సమయంలో, దీపిక కూడా అదే మార్గాన్ని అనుసరిస్తున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్త‌మ్మీద, ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు కేవలం సినిమాల ఎంపికకే పరిమితం కాకుండా, తన కెరీర్‌ను కొత్త దిశలో తీసుకెళ్లే వ్యూహాత్మక అడుగులుగా కనిపిస్తున్నాయి.