టాలీవుడ్ పై దీపికా పదుకొణే రివేంజ్ ఈ రేంజ్ లోనా!
నేరుగా ఎటాక్ చేయకపోయినా డిసిప్లెన్ విషయంలో? షారుక్ ఖాన్ సినిమాను అడ్డుపెట్టుకుని అమ్మడు చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో కలకలం రేపాయి.
By: Srikanth Kontham | 27 Sept 2025 11:54 AM ISTబాలీవుడ్ నటి దీపికా పదుకొణే టాలీవుడ్ కి ఏ రేంజ్ లో టార్గెట్ అయిందో తెలిసిందే. 'స్పిరిట్' ని రిజెక్ట్ చేయడం.. సందీప్ వంగా ఎటాకింగ్...అటుపై ప్రతిదాడి...అది మరువక ముందే `కల్కి2` నుంచి వైదొలగడం ఇలా రెండు నెలల కాలంలోనే టాలీవుడ్ కి శత్రువులా మారింది. బన్నీతో ఓ సినిమా చేస్తున్నా? మార్కెట్ లో ప్రశంస కన్నా విమర్శకే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుంది కాబట్టి దీపిక టార్గెట్ అవ్వక తప్పలేదు. `స్పిరిట్` సంగతి పక్కన బెడితే? `కల్కి 2` నుంచి నిష్క్రమించడాన్ని దీపిక కాస్త సిరియస్ గానే తీసుకుని స్పందించింది.
విమర్శలకు సమాధానంగా:
నేరుగా ఎటాక్ చేయకపోయినా డిసిప్లెన్ విషయంలో? షారుక్ ఖాన్ సినిమాను అడ్డుపెట్టుకుని అమ్మడు చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో కలకలం రేపాయి. దీపిక అంటే అంత వరకూ ఓ పాజిటివ్ వైబ్ కనిపించేది. కానీ ఆ వ్యాఖ్యల తో నేరుగా టాలీవుడ్ కి టార్గెట్ గా మారింది. దీంతో సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలకు గురైంది. ట్రోలింగ్ బారిన పడింది. మరి వీటికి సమాధానంగా దీపిక తానేంటో చూపించబోతుందా? తన రేంజ్ ఏంటో చెప్పబోతుందా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. `ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేక్` సినిమాతో దీపిక హాలీవుడ్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే.
హాలీవుడ్ టీమ్ తో చర్చలు:
తొలి సినిమాతోనే అమ్మడు హాలీవుడ్ లో అదర గొట్టింది. స్పై యాక్షన్ థ్రిల్లర్ తనదైన మార్క్ వేసింది. ఈ సినిమా తర్వాత హాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వచ్చాయి. కానీ బాలీవుడ్ పై మోజుతో అటువైపు వెళ్లలేదు. అయితే తాజాగా 'ట్రిపుల్ ఎక్స్' సీక్వెల్ కు సన్నాహాకాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఏకంగా ముంబైలో లాంచ్ చేసేలా దీపిక సన్నాహాలు చేస్తోంది. అమెరికాలో కంటే ముంబై వచ్చి ఇక్కడ షూటింగ్ చేయగలిగితే సినిమ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుందని మేకర్స్ ని కన్విన్స్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రయత్నాలు ఫలించేనా:
ఇదే జరిగితే గనుక దీపిక రేంజ్ ఏంటి? అన్నది మరోసారి అర్దమవుతుంది. తనని విమర్శించిన నోళ్లే మళ్లీ ప్రశంశించడం ఖాయం. హాలీవుడ్ టీమ్ నే ముంబైకి రప్పించిందంటే? ఘనాపాటే అన్న ప్రశంస తనకే సొంతమవుతుంది. ఇందులో దీపిక మొదటి భాగం కంటే బలమైన పాత్రకు ఎంపికైనట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. మరి దీపిక ప్రయత్నాలు ఫలిస్తాయా? లేదా? అన్నది చూడాలి.
