టాలీవుడ్ కి దూరంగానే దీపిక భవిష్యత్ నిర్ణయం!
బాలీవుడ్ లో దీపికా పదుకొణే ఎంత పెద్ద హీరోయిన్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. అక్కడ స్టార్ హీరోలే ఆమె కోసం క్యూలో ఉన్నారు
By: Srikanth Kontham | 19 Sept 2025 1:00 PM ISTబాలీవుడ్ లో దీపికా పదుకొణే ఎంత పెద్ద హీరోయిన్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. అక్కడ స్టార్ హీరోలే ఆమె కోసం క్యూలో ఉన్నారు. స్టార్ డైరెక్టర్లు...నిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. బాక్సాపీస్ వద్ద సోలోగానూ సత్తా చాటడం అమ్మడి ప్రత్యేకత. పద్మావత్ లాంటి సినిమాతో దేశ వ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయింది. హాలీవుడ్ లో సైతం సినిమాలు చేసిన అనుభవం ఉంది. బలంగా సంకల్పించాలి గానీ హాలీవుడ్ లో బిజీ అయ్యే ప్రతిభావంతురాలు. మరి అలాంటి బ్యూటీకి టాలీవుడ్ ఎంత మాత్రం కలిసి రావడం లేదా? తాను ఒకటనుకుంటే మరొకటి జరుగుతోందా? అంటే సన్నివేశాలన్నీ అలాగే కనిపిస్తున్నాయి.
తాజాగా `కల్కి 2` ప్రాజెక్ట్ నుంచి అమ్మడు ఎగ్జిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇదే క్రమంలో ఆమె భవిష్యత్ సినిమాలకు, బాలీవుడ్ కెరీర్ కు శుభాంకాక్షలు తెలియజేసిందా సంస్థ. కల్కి 2 నుంచి దీపిక కావాలని తప్పుకుందా? డేట్లు సర్దుబాటు కాక ఎగ్జిట్ అయిందా? లేక నిర్మాణ సంస్థ కావాలని తప్పించిందా? అన్న సందేహాలు ఇప్పటికే వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ఎవరు రైట్ ? ఎవరు రాంగ్ ? అన్నది పక్కన బెడితే? దీపిక విషయంలో టాలీవుడ్ నుంచి ఎందురవుతోన్న సంఘటనలు చూస్తుంటే? భవిష్య త్ లో దీపిక తెలుగు సినిమాల విషయంలో సంచలనం నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదంటున్నారు.
సందీప్ రెడ్డి వంగా -దీపిక వివాదం తెలిసిందే. రెండు నెలల క్రితం ఇదో సంచలనం. దీపిక సందీప్ మధ్య నువ్వా? నేనా? అన్న రేంజ్ లో వివాదం నలిగింది. చివరకు ఎలాగూ వ్యవహారం కామ్ అయింది. ఆ ఘటన జరిగిన కొన్ని రోజులకే పాన్ ఇండియా చిత్రం `కల్కి 2` నుంచి దీపిక ఎగ్జిట్ అవ్వడం మరింత పసంచలనంగానూ కనిపిస్తోంది.ఈ విషయంలో దీపిక కార్నర్ అయినట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల దృష్ట్యా దీపిక ఇకపై తెలుగు సినిమాలు చేస్తుందా? అన్న సందేహం అంతే వ్యక్తమవుతోంది.
బాలీవుడ్ లో తాను కోరుకున్న జీవితాన్ని పక్కనబెట్టి ప్రత్యేకంగా తెలుగు సినిమాలు చేయాల్సిన అవసరం తనకేముందనే వాదన తెరపైకి వస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఆమె కొత్తగా సాధించాల్సిందేముందని...అక్కడ ఉన్న అవకాశాలతోనే గొప్ప సినీ జీవితాన్ని ఆస్వాదించడానికి అవకాశం ఉంది? కదా? అవన్నీ వదిలేసి వివాదాలు కొని తెచ్చుకోవడం దేనికని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
