Begin typing your search above and press return to search.

కల్కి2 నుంచీ దీపికా ఔట్.. నాగ్ అశ్విన్ ఆసక్తికర పోస్ట్!

ఇలాంటి సమయంలో కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ స్టోరీ.. ఇప్పుడు అందరిలో పలు రకాల అనుమానాలు రేకెత్తిస్తోంది అని చెప్పవచ్చు.

By:  Madhu Reddy   |   19 Sept 2025 1:23 PM IST
కల్కి2 నుంచీ దీపికా ఔట్.. నాగ్ అశ్విన్ ఆసక్తికర పోస్ట్!
X

దీపికా పదుకొనే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈమె.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన 'కల్కి2898AD' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో దీపిక పేరు మారుమ్రోగిపోయింది కూడా.. కల్కి సక్సెస్ అవడంతో.. మళ్లీ ప్రభాస్ తో జతకట్టే అవకాశం దీపికాకు లభించింది. అలా ప్రభాస్ హీరోగా.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న 'స్పిరిట్' మూవీలో దీపిక హీరోయిన్ గా నటిస్తోంది అంటూ వార్తలు వచ్చాయి. కానీ సడన్ గా ఆమెను తప్పించి, ఆమె స్థానంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీను రంగంలోకి దింపారు. అదే సమయంలో దీపికా పదుకొనేను హీరోయిన్ గా ఈ సినిమా నుండి తప్పించడంపై కూడా సందీప్ రెడ్డివంగా పలు ఆసక్తికర పోస్టులు పంచుకున్న విషయం తెలిసిందే. అటు సందీప్ ఇటు దీపిక మధ్య సోషల్ మీడియాలో చిన్నపాటి వార్ కూడా జరిగింది. అదే సమయంలో చాలామంది దీపికాకు అండగా నిలిచారు.


ఇకపోతే కల్కి సినిమా హిట్ కొట్టడంతో కల్కి సీక్వెల్ లో కూడా దీపిక నటిస్తోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ నిన్న ఆమెను తొలగిస్తున్నట్టు వైజయంతి మూవీస్ బ్యానర్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆమెపై పెద్ద ఎత్తున నెగెటివిటీ నెలకొంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో దీపికాపై వ్యతిరేకంగా పోస్టులు వెలువడుతున్నాయి. ఇలాంటి సమయంలో కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ స్టోరీ.. ఇప్పుడు అందరిలో పలు రకాల అనుమానాలు రేకెత్తిస్తోంది అని చెప్పవచ్చు.

అసలు విషయంలోకి వెళ్తే.. కల్కి 2898AD సినిమాలోని కృష్ణుడి ఎంట్రీ సీన్ ను షేర్ చేస్తూ.. అందులో " కర్మను ఎవరు కూడా తప్పించలేరు. నీ కర్మకు నువ్వే బాధ్యుడివి.. కాబట్టి నీ కర్మను నువ్వు అనుభవించాల్సిందే " అంటూ అశ్వద్ధామకు కృష్ణుడు చెప్పే డైలాగ్ ఉంది. ఈ సీన్ ఆయన షేర్ చేస్తూ ఒక ఆసక్తికర క్యాప్షన్ కూడా పంచుకున్నారు." జరిగిపోయిన దానిని ఎవరు మార్చలేరు. కానీ ఆ తర్వాత ఏం జరగాలో మీరు ఎంచుకోవచ్చు" అంటూ రాసుకువచ్చారు. ఈ పోస్టును దీపికాను ఉద్దేశించే పోస్ట్ పెట్టారని అటు నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే నాగ్ అశ్విన్ దీపికాకు ఏదో చెప్పాలని చూస్తున్నారని.. అందులో భాగంగానే జరిగిపోయిన దానిని వదిలేసి భవిష్యత్తులో జరిగే దాని గురించి ఆలోచించమని ఆమెకు ఇండైరెక్టుగా సలహా ఇస్తున్నారంటూ కూడా నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. కల్కి2 నుండి దీపికను సడన్గా తొలగించడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా నిబద్ధత కలిగిన వ్యక్తులు కావాలి అని వైజయంతి మూవీ మేకర్స్ నిన్న స్పష్టంగా ప్రకటించడంతో ఈమె పారితోషకం విషయంలో డిమాండ్ చేసింది అని, అటు పని గంటల విషయంలో కూడా కాస్త కండిషన్లు పెట్టిందని, అందుకే ఈమెను తప్పించి ఇంకో కొత్త టీం తో మన ముందుకు వస్తామని చెబుతున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ దీపికాను తప్పించడం వెనక అసలు కారణాన్ని మాత్రం వైజయంతి మూవీస్ స్పష్టంగా బయట పెట్టలేదు.