Begin typing your search above and press return to search.

ముద్దుల కూతురి జ్ఞాపకంతో దీపిక‌ ప్రత్యేక ఆకర్షణ!

బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె - రణ్‌వీర్ సింగ్ మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది.

By:  Srikanth Kontham   |   16 Aug 2026 6:00 PM IST
ముద్దుల కూతురి జ్ఞాపకంతో దీపిక‌ ప్రత్యేక ఆకర్షణ!
X

బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె - రణ్‌వీర్ సింగ్ మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ప్రస్తుతం మూడవ త్రైమాసికంలో ఉన్న దీపికా పదుకొణె ఇటీవల విమానాశ్రయంలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. తన పని నిమిత్తం బయలుదేరిన దీపిక‌కు భర్త రణ్‌వీర్ సింగ్ విమానాశ్రయం వరకు వచ్చి వీడ్కోలు పలికారు. ఈ సమయంలో రణ్‌వీర్ చూపిన ప్రేమ, వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని మరోసారి చాటి చెప్పింది. విమానాశ్రయ ప్రయాణంలో దీపికా ఎంతో హుందాగా... సౌకర్యవంతంగా కనిపించారు.

గర్భవతిగా ఉన్నా? అమ్మ‌డు స్టైలిష్ లుక్‌ను ఏమాత్రం తగ్గించుకోలేదు. బ్లూ ఓవర్ సైజ్డ్ షర్ట్, డెనిమ్ ప్యాంట్స్ , బ్రౌన్ సన్‌గ్లాసెస్‌లో దీపిక‌ మెరిసిపోతున్నారు. గర్భాన్ని బహిర్గతం చేయకుండా సౌకర్యవంతమైన దుస్తులను ఎంచుకోవడం గమనార్హం. అన్నింటికంటే ముఖ్యంగా ఆవుటింగ్‌లో అందరినీ ఆకట్టుకున్న అంశం దీపిక‌ ధరించిన చిన్న బంగారు గొలుసు. ఆ గొలుసులో కుమార్తె దువా పేరును హృదయం గుర్తుతో కలిపి డిజైన్ చేశారు. దువా తనతో లేకపోయినా? ఈ ఆభరణం ద్వారా ఎప్పుడూ తన గుండెకు దగ్గరగా ఉంచుకున్నట్లు దీపిక‌ చూపిన తీరు అభిమానులను ఎంతగానో భావోద్వేగానికి గురి చేస్తుంది.

దీనిపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. దీపిక- రణ్‌వీర్ దంపతులు కుమార్తె దువాను చాలా కాలం పాటు మీడియా కళ్లకు దూరంగానే ఉంచుతున్నారు. గతేడాది దీపావళి వేళ ఆమెను ప్రపంచానికి పరిచయం చేసినా? అప్పటి నుండి వారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఏప్రిల్ నెలలో సోషల్ మీడియా వేదికగా తాము రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నామనే శుభవార్తను అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.

వృత్తిపరంగా చూస్తే దీపికా పదుకొణె తదుపరి చిత్రం `కింగ్` లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న భారీ ప్రాజెక్టులో షారూఖ్ ఖాన్, సుహానా ఖాన్ , అభిషేక్ బచ్చన్ వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారు. అలాగే అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి `రాకా` లోనూ దీనిప న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ రెండు సినిమాలకు సంబంధించి దీపిక ఇప్ప‌టికే త‌న పార్ట్ షూటింగ్ పూర్తి చేసారు. గ‌ర్బ‌వ‌తి కావ‌డంతో? కొత్త ప్రాజెక్ట్ లు ఏవీ క‌మిట్ అవ్వ‌డం లేదు. ప్ర‌స‌వం వ‌ర‌కూ కొత్త సినిమాల‌కు సైన్ చేయ‌దు. అంటే వ‌చ్చే ఏడాది మిడ్ వ‌ర‌కూ దీపిక పూర్తిగా సినిమా ప్ర‌పంచానికి దూరంగా ఉంటుంది.