దీపిక పదుకొనే ఇంట్లో శుభకార్యం
`కల్కి 2898 ఏడి` చిత్రంతో తెలుగు ప్రజలకు సుపరిచితమైన నటి దీపిక పదుకొనే. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది.
By: Sivaji Kontham | 30 Nov 2025 11:02 AM IST`కల్కి 2898 ఏడి` చిత్రంతో తెలుగు ప్రజలకు సుపరిచితమైన నటి దీపిక పదుకొనే. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. దీపిక నటించిన ఓంశాంతి ఓం, పద్మావత్, లవ్ ఆజ్ కల్ చిత్రాలను తెలుగు ప్రజలు అమితంగా ఇష్టపడ్డారు. ఇక ఈ బ్యూటీ సౌత్ లోనే కథానాయిగా ఆరంగేట్రం చేసినా బాలీవుడ్ లో అగ్ర కథానాయికగా సెటిలైంది.
అయితే దీపిక గురించి తెలిసినంతగా ఆమె సోదరి అనీషా గురించి ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు. అనీషా దీపికకు షాడో.. తన వ్యాపారాలలో ఒక భాగం. తాజా సమాచారం మేరకు అనీషాకు పెళ్లి కుదిరింది. అనీషా ఇష్టపడుతున్న వ్యక్తితో ముడిపెట్టేందుకు దీపిక భర్త రణ్ వీర్ సింగ్ మన్మథుడి పాత్రను పోషించాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
అనిషా పదుకొనే వ్యాపారవేత్త రోహన్ ఆచార్యను వివాహం చేసుకోబోతున్నారు. కానీ కుటుంబం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అయితే దీపిక సోదరిని పెళ్లాడే యువకుడు రోహన్ ఎవరో అంటూ ఆరాలు మొదలయ్యాయి. అతడు ప్రముఖ చిత్రనిర్మాత బిమల్ రాయ్ మునిమనవడు. సన్నీ డియోల్ కుమారుడు కరణ్ డియోల్‌ను వివాహం చేసుకున్న దిశా ఆచార్య సోదరుడు.
పదుకొనే కుటుంబానికి క్లోజ్ సోర్స్ అందంచిన వివరాల ప్రకారం.. అనిషా- రోహన్ ఇద్దరూ తమ సంబంధం గురించి చాలా గోప్యంగా ఉంచారు. కానీ వారు చాలా కాలంగా ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. రణవీర్ ఆ ఇద్దరికీ మధ్య ఉన్నాడు.. రణవీర్ తల్లిదండ్రులు.. సుమిత్ ఆచార్య చాలా సన్నిహితులు అని కూడా తెలుస్తోంది. అనిషా - రోహన్ చాలా సందర్భాలలో కలుసుకున్నప్పుడు ఒకరినొకరు ఇష్టపడ్డారని కూడా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే అనిషా, రోహన్ ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. వివాహాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కుటుంబం నుండి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
అనిషా బ్యాడ్మింటన్ లెజెండ్ ప్రకాష్ పదుకొనే - ఉజ్జల దంపతుల చిన్న కుమార్తె. తన సోదరి దీపికా పదుకొనే ప్రారంభించిన `ది లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్`కు డైరెక్టర్. ఆమె మానసిక ఆరోగ్యం, నిరాశ గురించి అవగాహన పెంచడానికి చురుగ్గా పనిచేస్తుంది.
దీపిక పదుకొనే కెరీర్ మ్యాటర్ కి వస్తే, కల్కి 2898 ఏడి తర్వాత ప్రభాస్ తో రెండు భారీ పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలను కోల్పోయింది. హిందీలో చివరిసారిగా రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన సింగం అగైన్ చిత్రంలో కనిపించింది. ఈ చిత్రంలో రణవీర్, కరీనా కపూర్, అజయ్ దేవ్‌గన్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తదితరులు నటించారు. ఇది గత సంవత్సరం థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ చిత్రం కింగ్‌లో కలిసి పనిచేస్తోంది.
