దెయ్యాల కోటలోకి దీపిక పదుకొణే ఎంట్రీ!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ఇప్పటి వరకూ ఎన్నో జానర్లో చిత్రాలు చేసింది. ఎంతో మంది హీరోలతో కలిసి పని చేసింది.
By: Srikanth Kontham | 2 Dec 2025 8:00 PM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ఇప్పటి వరకూ ఎన్నో జానర్లో చిత్రాలు చేసింది. ఎంతో మంది హీరోలతో కలిసి పని చేసింది. `పద్మావత్` లాంటి లేడీ ఓరియేంటెడ్ చిత్రంతోనూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉందని ప్రూవ్ చేసుకుంది. కానీ దెయ్యాల కోటలోకి మాత్రం ఇంత వరకూ ఎంటర్ అవ్వలేదు. హారర్ థ్రిల్లర్ జానర్లో సినిమాలు చేయలేదు. మరి ఇప్పుడా సమయం ఆసన్నమైందా? అంటే అవుననే తెలుస్తోంది. మడాక్ ఫిల్మ్స్ లో అమ్మడు ఏకంగా రెండు హారర్ చిత్రాలకు కమిట్ అయిందని సమాచారం.
హారర్ చిత్రాల్లో ఓ బ్రాండ్:
ఇందులో బెంగాల్ నేపథ్యంలో సాగే హారర్ చిత్రం కథ ఒకటని తెలిసింది. అలాగే యూపీలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా మరో చిత్ర కథ గాను వినిపిస్తోంది. అయితే ఈ రెండింటికి ఇంకా దర్శకులు ఫైనల్ కాలేదు. కథల మాత్రమే రైటర్ల నుంచి సిద్దం చేసి పెట్టుకుంది. వాటిని డీల్ చేయగల సమర్దుల కోసం వెతుకుతున్నారు.
మరి ఆ ఛాన్స్ ఎవరు? అందుకుంటారో చూడాలి. మడాక్ ఫిల్మ్స్ కొంత కాలంగా హారర్ థ్రిల్లర్లకు బ్రాండ్ గా మారిన సంగతి తెలిసిందే. వరుసగా ఆ జానర్లో సినిమాలు నిర్మించి బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నారు.
శ్రద్దా కపూర్, రష్మిక తర్వాత:
`మూంజ్యా`, `స్త్రీ 2` లాంటి సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో తెలిసిందే. ఈ రెండు సినిమాల నుంచే 1000 కోట్ల వసూళ్లను రాబట్టారు. ఈ మధ్యనే రిలీజ్ అయిన `థామా`తోనూ మరో సక్సస్ ను అందుకున్నారు. అయితే ఈ సినిమాకు నిర్మాణ పరంగా భారీగా ఖర్చు చేయడంతో పెద్దగా లాభాలు రాలేదు. 120 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సినిమా 160 కోట్లను రాబట్టింది. ఈ సినిమాతోనే నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హారర్ వరల్డ్ లోకి అడుగు పెట్టింది. `స్త్రీ` ప్రాంచైజీతో శ్రద్దా కపూర్ కూడా అదే బ్యానర్లోనే డెవిల్ గా మారింది.
రెండు సినిమాలకు అగ్రిమెంట్:
హీరోయిన్లే లీడ్ రోల్స్ పోషించడంతో మడాక్ సంస్థకు కలిసొచ్చింది. దీంతో ఇప్పుడది సెంటిమెంట్ గా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ టాప్ స్టార్ నే రంగంలోకి దించుతున్నారు. దీపికా పదుకోణే ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఒకే సారి రెండు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ప్రస్తుతం దీపిక వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న 26వ చిత్రంలోనూ దీపిక హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
