బాగా తిని హోటల్ బిల్ కట్టమన్న దీపిక మాజీ ప్రియుడు
తాజా ఇంటర్వ్యూలో తన మాజీ ప్రియుడు సిద్ధార్థ్ మాల్యా 'అసహ్యకరమైన' ప్రవర్తన గురించి దీపిక మాట్లాడింది.
By: Sivaji Kontham | 11 Sept 2025 2:00 PM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే డేటింగ్ వ్యవహారాల గురించి తెలిసిందే. రణవీర్ సింగ్ ని పెళ్లాడక ముందు రణబీర్ కపూర్ తో కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన దీపిక, అంతకంటే ముందు కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యాతో రొమాంటిక్ డేట్ కి వెళ్లిన విషయాన్ని అంగీకరించింది. ఈ జంట డేటింగ్ స్వల్ప కాలమే అయినా నిత్యం మీడియా హెడ్ లైన్స్ లో నిలిచింది.
కొన్నేళ్ల క్రితం డేటింగ్ సమయంలో జరిగిన ఓ త్రోబ్యాక్ మ్యాటర్ ఇప్పుడు మరోసారి వెబ్ లో చర్చగా మారింది. తాజా ఇంటర్వ్యూలో తన మాజీ ప్రియుడు సిద్ధార్థ్ మాల్యా `అసహ్యకరమైన` ప్రవర్తన గురించి దీపిక మాట్లాడింది. ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్‌తో జరిగిన సంభాషణలో దీపికా పదుకొనే ''నేను బంధాన్ని విజయవంతం చేయడానికి చాలా ప్రయత్నించాను, కానీ ఇటీవలి కాలంలో అతడి ప్రవర్తన అసహ్యంగా ఉంది. మేము చివరిసారిగా విందులో కలిసినప్పుడు అతడు నన్ను బిల్లు చెల్లించమని అడిగాడు. అది నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఈ సంబంధాన్ని కొనసాగించడానికి నాకు ఏమీ మిగిలి లేనందున, ముగించడం తప్ప నాకు వేరే మార్గం లేదు'' అని తెలిపాడు.
ఆ తర్వాత సిద్ధార్థ్ మాల్యా దీపికా పదుకొనేను 'ఒక పిచ్చి పిల్ల' అని ముద్ర వేశారు. అతడు మాట్లాడుతూ..దీపిక ఒక పిచ్చి అమ్మాయి అని అన్నాడు. నాన్న అప్పులు తీర్చేసి, ప్రభుత్వం అతడిని విడిపించిన తర్వాత నేను ఆమె డబ్బు తిరిగి ఇస్తానని చెప్పాను.. కానీ తను జీవితంలో స్థిరపడటానికి సిద్ధంగా లేదు'' అని అన్నాడు. ఖరీదైన వజ్రాలు, విలాసవంతమైన కానుకలు ఇచ్చిన విషయాన్ని కూడా మర్చిపోయింది. వెకేషన్స్ పేరుతో భారీగా డబ్బు కూడా ఖర్చు చేసానని, దీపిక స్నేహితుల కోసం పార్టీలు చేసానని సిద్ధార్థ్ అన్నాడు.
దీపిక కెరీర్ మ్యాటర్ కి వస్తే.. తదుపరి అట్లీ దర్శకత్వంలో AA22xA6 లో కనిపించనుంది. ఈ చిత్రంలో పుష్ప స్టార్ అల్లు అర్జున్ సరసన అవకాశం అందుకుంది. ప్రభాస్ సరసన కల్కి 2898 ఏడిలో కూడా దీపిక నటించాల్సి ఉంది.
