Begin typing your search above and press return to search.

హెరిటేజ్ వైబ్స్‌తో దీపికా పదుకొనే స్టన్నింగ్ లుక్.. ఔట్‌ఫిట్ ధర తెలిస్తే షాక్!

బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే ఎప్పుడు ఏ వేడుకలో కనిపించినా తన రాయల్ అండ్ క్లాసీ ఫ్యాషన్ ఛాయిస్‌తో అందరినీ మైమరపిస్తుంటారు.

By:  Madhu Reddy   |   20 Sept 2026 5:48 PM IST
హెరిటేజ్ వైబ్స్‌తో దీపికా పదుకొనే స్టన్నింగ్ లుక్.. ఔట్‌ఫిట్ ధర తెలిస్తే షాక్!
X

బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే ఎప్పుడు ఏ వేడుకలో కనిపించినా తన రాయల్ అండ్ క్లాసీ ఫ్యాషన్ ఛాయిస్‌తో అందరినీ మైమరపిస్తుంటారు. తాజాగా ఆమె హెరిటేజ్ వైబ్స్ ఉట్టిపడేలా ధరించిన సబ్యసాచి ట్రెడిషనల్ ఔట్‌ఫిట్, దానికి తగ్గ రాయల్ ఆభరణాలు సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకట్టుకున్నాయి. రాయల్ ఫ్యాషన్‌కు సరైన నిర్వచనంగా నిలిచిన దీపికా పడుకోన్ ఐకానిక్ లుక్ పూర్తి ప్రైస్ బ్రేక్‌డౌన్ వివరాలు మరియు ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం.

సబ్యసాచి రాయల్ కుర్తా అండ్ సల్వార్ ధర ఎంతంటే? :

ఈ సాంప్రదాయ లుక్‌లో దీపికా ధరించిన ప్రత్యేకమైన కుర్తా ప్రసిద్ధ డిజైనర్ సబ్యసాచికి చెందినది. ఈ 'సబ్యసాచి ఎంబ్రాయిడర్డ్ కుర్తా' ధర దాదాపు రూ. 2,85,000. దానికి కాంబినేషన్‌గా ఆమె జత చేసిన రాయల్ పర్పుల్ షేడ్‌లో ఉన్న 'సబ్యసాచి సిల్క్ సల్వార్' ధర రూ. 95,000గా ఉంది. ఈ రెండింటి కాంబినేషన్ ఆమెకు అత్యంత రిచ్ అండ్ ఎలిగంట్ లుక్‌ను అందించింది.

మెరిసే టిష్యూ దుపట్టా డీటైలింగ్ :

ఈ రాయల్ ఔట్‌ఫిట్‌కి మరింత మెరుగులద్దేలా దీపికా ఒక ప్రత్యేకమైన షైనీ టిష్యూ దుపట్టాను జత చేశారు. ఈ 'సబ్యసాచి టిష్యూ దుపట్టా' సుమారు ధర రూ. 1,75,000. షైనీ టిష్యూ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన ఈ దుపట్టా కుర్తా మరియు సల్వార్ కాంబినేషన్‌కు ఒక పర్ఫెక్ట్ హెరిటేజ్ అట్రాక్షన్‌ను జోడించి గ్రాండ్ వైబ్‌ని తెచ్చిపెట్టింది.

సబ్యసాచి ఝుమ్కాలు అండ్ మోడర్న్ వాచ్ :

దీపికా ఆభరణాల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. చెవులకు ధరించిన 'సబ్యసాచి హెరిటేజ్ ఝుమ్కాలు' ధర రూ. 3,95,000. ఇక మోడర్న్ టచ్ ఇస్తూ చేతికి రూ. 41,900 విలువ చేసే 'యాపిల్ వాచ్ సిరీస్ 9' ధరించారు. కాళ్లకు రూ. 24,500 విలువైన 'నీడిల్‌డస్ట్ ఎంబ్రాయిడర్డ్ మోజ్రీలు', తలకు రూ. 500 విలువైన తాజా మల్లెపూల గజ్రా చుట్టి నిండుగా కనిపించారు.

మరోసారి మాతృత్వపు ఆనందంలో దీపికా:

ఇక కెరీర్, ఫ్యాషన్ పరంగా సంచలనాలు సృష్టిస్తున్న దీపికా పడుకోన్ ఇంట్లో మళ్లీ పండుగ వాతావరణం నెలకొంది. ఇదివరకే పాపకి జన్మనిచ్చిన దీపికా-రణవీర్ దంపతులు, తాజాగా మరోసారి తల్లిదండ్రులయ్యామనే శుభవార్తను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు.

ఇక ట్రెడిషనల్ గ్రేస్, మోడర్న్ స్టైల్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ దీపికా పడుకోన్ ప్రదర్శించిన ఈ రాయల్ లుక్ ఫ్యాషన్ ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంది. వ్యక్తిగత జీవితంలో మాతృత్వపు ఆనందాన్ని ఆస్వాదిస్తున్న దీపికా, రాబోయే రోజుల్లో కూడా ఇలాగే అలరించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.