ట్రెండింగ్ లో దీపిక.. తప్పంతా ఆమెదేనా?
అయితే ఈ వివాదం సద్దుమణిగింది అనుకునేలోపే.. తాజాగా దీపికకు మరోసారి షాక్ తగిలింది.
By: Madhu Reddy | 18 Sept 2025 4:19 PM ISTబాలీవుడ్ నటి దీపిక పదుకొనే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. దానికి కారణం దీపిక పదుకొనేకి వరుస షాక్స్ తగలడమే. అయితే గతంలో 'స్పిరిట్' మూవీ కోసం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ సరసన హీరోయిన్ గా దీపిక పదుకొనేని ఫిక్స్ చేసుకున్నారు. తర్వాత దీపిక 8 గంటల పని దినాన్ని కోరుతూ అభ్యర్థించడం.. పైగా అధిక రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందనే కారణంతో ఈమెను సందీప్ రెడ్డివంగా పక్కకు పెట్టి.. యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ ను తీసుకున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు.
ఆ సమయంలో దీపిక పీఆర్ టీమ్.. స్పిరిట్ మూవీ కథను కొంతవరకు లీక్ చేయడమే కాకుండా సందీప్ సెట్ లో ఆడవారికి గౌరవం లేదు అనేటట్టుగా కామెంట్స్ చేస్తూ పోస్ట్లు పెట్టారు.. దీంతో మండిపడ్డ సందీప్ రెడ్డివంగా.. ఒకరిని నమ్మి కథను చెబితే దాన్ని వారు ఎన్ని రోజులైనా బయటకు లీక్ చేయకుండా ఉండాలి కానీ దీపిక డర్టీ పీ ఆర్ గేమ్ ఆడుతోంది అంటూ కౌంటర్ ఇచ్చాడు. అయితే సందీప్ రెడ్డి వంగా పెట్టిన పోస్ట్ తో కొంత మంది దీపికకి సపోర్ట్ చేస్తే.. మరి కొంతమంది సందీప్ కి సపోర్ట్ చేశారు.
అయితే ఈ వివాదం సద్దుమణిగింది అనుకునేలోపే.. తాజాగా దీపికకు మరోసారి షాక్ తగిలింది. అదేంటంటే కల్కి 2898AD కి సీక్వెల్ గా రాబోతున్న కల్కి పార్ట్ 2 లో దీపిక పదుకొనేని తొలగిస్తున్నట్టు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. దీంతో చాలామందికి దీపిక పదుకొనే మీదే అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా వైజయంతి మూవీస్ బ్యానర్ సోషల్ మీడియా ఖాతాలో ఒక షాకింగ్ ట్వీట్ పెట్టారు.అన్ని ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. అలాగే దీపిక పదుకొనే భవిష్యత్తు ప్రాజెక్టులకు శుభాకాంక్షలు తెలుపుతూనే మరో విషయాన్ని కూడా నొక్కి చెప్పారు.
అదేంటంటే.. మా సినిమాకి కమిట్మెంట్ అంతకుమించి కావాలి అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అంటే ఈ విషయంలో దీపిక పదుకొనేని నిందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగా విషయంలో ఏదో అలా జరిగిపోయిందిలే అనుకుంటే ఇప్పుడు కల్కి పార్ట్-2 మూవీ విషయంలో కూడా అదే జరిగింది అని దీపిక పదుకొనే పైనే తప్పు తోసేస్తున్నారు.
దీపిక ప్రవర్తన వల్లే వరుస సినిమాల్లో ఆమెకు షాక్స్ తగులుతున్నాయి అని, దీపిక తీరు దర్శక నిర్మాతలకు నచ్చడం లేదని,అందుకే ఆమెను పక్కన పెడుతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన దీపిక పదుకొనేకి సౌత్ ఇండస్ట్రీలో కల్కి 2898 AD అనే సినిమాతో ఒక పవర్ఫుల్ పాత్రను ఇచ్చారు దర్శకుడు నాగ్ అశ్విన్. అలాగే ఆ పాత్రకి దీపిక కూడా న్యాయం చేసింది.
కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో సడన్ గా వైజయంతి మూవీస్ బ్యానర్ తీసుకున్న నిర్ణయం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరి సోషల్ మీడియాలో తనపై వస్తున్న నెగిటివిటీపై దీపిక పదుకొనే ఏ విధంగా క్లారిటీ ఇచ్చుకుంటుందో చూడాలి. ఏది ఏమైనా ఈ రెండు కారణాలవల్ల దీపిక ట్రెండింగ్ లోకి రావడమే కాకుండా తప్పంతా ఆమెదే అన్నట్లు కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
