మ్యాక్సీ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న దీపిక.. ఖరీదు తెలిస్తే షాక్!
ఎప్పటికప్పుడు ట్రెండీ ఔట్ఫిట్ తో దర్శనం ఇచ్చే ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో మ్యాక్సీ డ్రెస్ ధరించి అభిమానులను సర్ప్రైజ్ చేసింది.
By: Madhu Reddy | 8 Dec 2025 2:15 PM ISTసాధారణంగా సెలబ్రిటీలు లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అందులో భాగంగానే ఎప్పటికప్పుడు తమ కారు కలెక్షన్స్ , వాడే వస్తువుల కలెక్షన్ తో అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా తాము ధరించే దుస్తులతోనే కాదు వాటి ధరలతో కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బాలీవుడ్లో అగ్ర కథానాయకగా పేరు సొంతం చేసుకొని.. ఇప్పుడు తెలుగు చిత్రాలలో కూడా నటించి పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న దీపికా పదుకొనే కూడా ఆ జాబితాలోకి చేరిపోయింది.
ఎప్పటికప్పుడు ట్రెండీ ఔట్ఫిట్ తో దర్శనం ఇచ్చే ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో మ్యాక్సీ డ్రెస్ ధరించి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ డ్రెస్ ఖరీదు తెలిసి అభిమానులే కాదు నెటిజన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. డ్రెస్ తో పాటు ఆమె చేతిలో పట్టుకున్న బ్యాగ్ ఖరీదు కూడా అందరిని ఆశ్చర్యపరుస్తోంది. మరి లగ్జరీ మెయింటైన్ చేస్తున్న దీపిక.. తాజాగా తను వేసుకున్న డ్రెస్, పట్టుకున్న బ్యాగ్ ఖరీదు ఎంతో ఇప్పుడు చూద్దాం
దీపికా పదుకొనే తాజాగా మాగ్డా బుట్రిమ్ హై నెక్ బ్రౌన్ కలర్ మ్యాక్సీ డ్రెస్ ధరించింది. వింటేజ్ స్టైల్ లో ఓవర్ సైజ్డ్ లెదర్ జాకెట్ తో స్టైల్ చేసింది. ఈ మ్యాక్సీ డ్రెస్ ఖరీదు అక్షరాలా రూ.1,80,600. అలాగే తన చేతిలో లూయిస్ విట్టన్ సైడ్ ట్రంక్ బ్యాగును ధరించింది. దీని విలువ అక్షరాలా రూ.3,50,000. ముఖ్యంగా ఈ బ్యాగు ఆమెకు ఒక క్లాసిక్ రిచ్ లుక్కును అందిస్తోంది అని చెప్పవచ్చు. ఇక బ్లాక్ కలర్ హై హీల్డ్ బూట్లు ధరించిన ఈమె బంగారు వర్ణం కలిగిన బ్రాస్ లెట్ లతో తన మేకోవర్ ను పుల్ ఫిల్ చేసింది. ముఖ్యంగా ఆకట్టుకుంటున్న చెవి దిద్దులు మరింత హైలెట్గా నిలిచాయి. అంతేకాదు లూజ్ హెయిర్ తో తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక దీపిక పదుకొనే తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇవి చూసిన నెటిజెన్స్ దీపిక లగ్జరీకి ఈ వస్తువులే నిదర్శనం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక దీపిక విషయానికి వస్తే.. బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898AD చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. కల్కి సీక్వెల్ నుండి తప్పుకొని విమర్శలు ఎదుర్కొంది. అలాగే స్పిరిట్ నుండి సందీప్ రెడ్డి వంగా ఈమెను తప్పించడంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్లో పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈమె తాజాగా అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
