4 ఏళ్ల తర్వాత మళ్లీ జతకట్టబోతున్న స్టార్ కపుల్..
సినీ సెలబ్రిటీలు ఎక్కువగా 1 లేదా 2 సినిమాలలో వరుసగా నటించి.. ఆ సినిమాల సమయంలోనే ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.
By: Madhu Reddy | 14 Nov 2025 12:27 PM ISTసినీ సెలబ్రిటీలు ఎక్కువగా 1 లేదా 2 సినిమాలలో వరుసగా నటించి.. ఆ సినిమాల సమయంలోనే ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే అలా పెళ్లిళ్లు చేసుకున్న వారు మళ్లీ మళ్లీ జతకడుతూ అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే. అలా గత కొన్ని సంవత్సరాలుగా ఇటు రియల్ లైఫ్ లోనే కాదు అటు రీల్ లైఫ్ లో కూడా బెస్ట్ జోడిగా పేరు దక్కించుకొని.. కలసి సినిమాలను చేస్తూ ఆకట్టుకుంటున్న స్టార్ కపుల్స్ లో దీపికా పదుకొనే , రణవీర్ సింగ్ జంట కూడా ఒకటి.
2013లో మొదలైన వీరి సినీ ప్రయాణం.. మళ్లీమళ్లీ తెరపై కనిపిస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే 2023లో సర్కస్ సినిమాలో అతిథి పాత్రలో నటించిన ఈ జంట 2021లో హీరో హీరోయిన్గా 83 సినిమాలో నటించి అబ్బురపరిచారు. అయితే ఇప్పుడు మళ్లీ 4 ఏళ్ల తర్వాత జతకట్టబోతున్నారని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
2013లో వచ్చిన 'గోలియోన్ కి రాస్లీలా రామ్ లీలా' సినిమాలో తొలిసారి వీరిద్దరూ జంటగా నటించి.. మొదటి సినిమాతోనే అందరిని అబ్బురపరిచారు. అంతేకాదు వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అభిమానులు కూడా ఫిదా అయిపోయారు. ఈ చిత్రం తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో 2015లో 'బాజీరావు మస్తానీ' సినిమా విడుదల అయింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణవీర్ సింగ్ బాజీరావు మస్తానీగా.. దీపికా పదుకొనే మస్తానీ పాత్ర పోషించారు. ఈ సినిమా వీరిద్దరికి మంచి గుర్తింపును అందించి స్టార్ కపుల్ గా పేరు కూడా అందించింది.
ఆ తర్వాత 2018లో వచ్చిన పద్మావత్ సినిమాలో కూడా వీరిద్దరూ కలిసి నటించారు. చారిత్రాత్మక ఫిల్మ్ గా వచ్చిన ఈ సినిమాలో రణవీర్ సింగ్ అల్లావుద్దీన్ ఖిల్జీగా.. దీపికా పదుకొనే పద్మావతిగా నటించారు. అంతే కాకుండా 2021 లో వచ్చిన 83 అనే సినిమాలో కపిల్ దేవ్ అతని భార్య రోమీ భాటియా పాత్రలలో వీరిద్దరూ కలిసి నటించారు. వీరిద్దరూ హీరో హీరోయిన్ గానే కాకుండా కొన్ని చిత్రాలలో అతిధి పాత్రలు కూడా పోషించి ప్రేక్షకులను మెప్పించారు అలా 2014లో వచ్చిన ఫైండింగ్ ఫ్యానీ అనే సినిమాలో అతిథి పాత్ర పోషించిన వీరు 2023లో వచ్చిన సర్కస్ సినిమాలో కూడా గెస్ట్ పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. అలా తమ అద్భుతమైన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తో ప్రేక్షకులను మెప్పించిన ఈ జంట.. హీరో హీరోయిన్గా మళ్లీ నటించాలని.. వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూడగా.. ఇప్పుడు ఒక న్యూస్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
విషయంలోకి వెళ్తే... ఇటీవల ఒక ఈవెంట్ లో పాల్గొన్న రణవీర్ సింగ్ తన భార్య దీపికతో కలిసి పనిచేయడం గురించి మాట్లాడుతూ.. "నాకు దీపికతో కలిసి పనిచేయడం చాలా ఇష్టం. మా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా సహజంగా ఉంటుంది. ముఖ్యంగా మా జంట అమూల్యమైన ప్రామాణికతను కూడా కలిగి ఉంది. ఇది నిజంగా ప్రేక్షకులతో ప్రతిధ్వనిస్తుంది" అంటూ తన మనసులో మాటను చెప్పుకొచ్చారు రణబీర్ సింగ్. ఇక దీంతో మళ్లీ వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి నెటిజన్స్ లో.. ఒకవేళ ఇదే నిజమైతే మళ్లీ అభిమానులకు ఇది అతిపెద్ద ఫీస్ట్ అని చెప్పడంలో సందేహం లేదు.
