Begin typing your search above and press return to search.

దీపిక మాటలు కాదు.. చేతల్లో చూపించాలి

తాను ప్రభాస్ కంటే ఎక్కువ సినిమాలు చేశానని.. తన కంటే ఎక్కువ సక్సెస్ ఫుల్ అన్నట్లుగా దీపికా పదుకొనే ఇటీవల ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపుతున్నాయి.

By:  Garuda Media   |   28 Aug 2026 9:00 PM IST
దీపిక మాటలు కాదు.. చేతల్లో చూపించాలి
X

తాను ప్రభాస్ కంటే ఎక్కువ సినిమాలు చేశానని.. తన కంటే ఎక్కువ సక్సెస్ ఫుల్ అన్నట్లుగా దీపికా పదుకొనే ఇటీవల ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపుతున్నాయి. వేరే హీరో అంటే ఏమో కానీ.. దేశవ్యాప్తంగా తిరుగులేని అభిమానాన్ని సంపాదించుకుని ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా అవతరించిన ప్రభాస్‌ను.. వివాదాలకు దూరంగా ఉంటూ, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే హీరో మీద పరోక్షంగా తన అక్కసు వెళ్లగక్కడం.. తనతో పోటీ పెట్టుకుని మాట్లాడ్డం.. అతణ్ని కించపరిచేలా మాట్లాడ్డం తెలుగు వాళ్లకే కాదు.. ఇతర భాషల వాళ్లకు కూడా నచ్చట్లేదు.

ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేసే దీపికకు ముందు నుంచే సోషల్ మీడియాలో హేటర్స్ ఎక్కువ. తాజా వ్యాఖ్యలతో ఆమె మీద వ్యతిరేకత మరింత పెరిగిపోతోంది. దీపిక పాస్ట్ ఎఫైర్ల దగ్గర్నుంచి.. వివిధ సందర్భాల్లో ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోల వరకు తీసుకొచ్చి ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

ఇదంతా పక్కన పెడితే.. ప్రభాస్ కంటే తాను పెద్ద స్టార్ అన్నట్లు చెప్పుకుంటూ తనకు దీటుగా పారితోషకం డిమాండ్ చేస్తున్న దీపికకు నెటిజన్లు ఒక సలహా ఇస్తున్నారు. నిజంగా దీపిక అంత పెద్ద స్టార్, తనకు భారీ మార్కెట్ ఉందని నమ్ముతున్నట్లయితే.. మేల్ సూపర్ స్టార్లతో కలిసి చేసే సినిమాల్లో వారితో పోటీ పెట్టుకునే బదులు ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ చేసి తన బాక్సాఫీస్ స్టామినా ఎంతో రుజువు చేయాలని అంటున్నారు. తనే లీడ్ రోల్ చేసిన సినిమాతో తాను ఎన్ని వందల కోట్లు రాబట్టగలదో చూపిస్తే.. ఆమె ఫాలోయింగ్, మార్కెట్ ఎంత అన్నది అందరికీ అర్థమవుతుంది కదా అని అభిప్రాయపడుతున్నారు.

చివరగా దీపిక నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘చప్పక్’ అయితే రూ.50 కోట్లకు అటు ఇటుగా వసూళ్లు రాబట్టింది. అది 2020లో రిలీజైన సినిమా. పైగా అదొక ప్రయోగాత్మక చిత్రం. ఇప్పటికి దీపిక మార్కెట్ ఇంకా పెరిగి ఉంటుంది కాబట్టి.. ఇప్పుడు ఒక యాక్షన్ టచ్ ఉన్న లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసి దీపిక తన స్టామినా ఏంటో చూపించాలి. ఆ సినిమా ప్రభాస్ చిత్రాల్లాగే వందలు, వేల కోట్ల వసూళ్లు రాబడితే.. అందుకు తగ్గట్లే పారితోషకం కోసం డిమాండ్ చేయొచ్చు. ప్రభాస్ కంటే తానే పెద్ద స్టార్, సక్సెస్ ఫుల్ అని బల్లగుద్ది చెప్పొచ్చు.