అడగడం తప్పు కాదు డిమాండ్ చేస్తేనే.. దీపిక విషయంలో సందీపే కరెక్టా?
ఇలా ఈ విషయాలు వైరల్ అవడంతో.. నిజానికి దీపికా వైపు నుంచి ఎలాంటి సమస్య లేకపోతే.. అదేదో స్పిరిట్ నుంచి తప్పుకున్నప్పుడే క్లారిటీ ఇవ్వాల్సింది.. కానీ ఆమె మనసు చెప్పిందే వింటాను అని చెప్పి మరిన్ని అనుమానాలకు తావు ఇచ్చేలా చేసింది.
By: Madhu Reddy | 18 Sept 2025 11:00 PM ISTతాజాగా సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే దీపిక ప్రవర్తనలోనే లోపం ఉంది అనే విషయం స్పష్టంగా కనిపిస్తోందని.. పలువురు సినీ ప్రముఖులు కూడా తెలియజేస్తున్నారు. వాస్తవానికి గతంలో ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా ప్రకటించినప్పుడు.. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది అంటూ అధికారికంగా ప్రకటించారు కూడా.. అయితే దీపిక అదే సమయంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.. ఇక పాప ఆలనా పాలన చూసుకోవడం కోసం.. 8 పని దినాలను డిమాండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. పని దినాలు మాత్రమే కాకుండా రెమ్యూనరేషన్ కూడా భారీగా డిమాండ్ చేసిందని, అందుకే సందీప్ రెడ్డివంగా ఆమెను తప్పించి, ఆమె స్థానాన్ని యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీతో భర్తీ చేశారు.
అయితే ఆ సమయంలో కొంతమంది సందీప్ కి మద్దతుగా నిలిచినా.. చాలామంది తల్లి అయిన సందర్భంగా ఆమె ఇలాంటి కోరికలు కోరడంలో తప్పు లేదని, ఆమెకు అండగా నిలిచారు. పైగా పట్టు జనాల నుంచి ఇటు సెలబ్రిటీల నుంచి సింపథీ బాగా వర్కౌట్ అవ్వడంతో చాలామంది సందీప్ రెడ్డి వంగానే టార్గెట్ చేశారు. ఆ తర్వాత అంతా సద్దుమణిగింది అనుకునేలోపే ఇప్పుడు మళ్ళీ కల్కి 2 నుంచి దీపికాను తొలగిస్తున్నట్లు వైజయంతి మూవీస్ బ్యానర్ అధికారికంగా ప్రకటించింది. దీంతో సందీప్ వంగా - దీపికా వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.
అప్పుడు దీపికా పై సింపథీ చూపించిన వారంతా.. ఇప్పుడు సందీప్ కి మద్దతుగా సందీప్ చేసింది ముమ్మాటికి కరెక్టే.. ఇందులో డౌట్ అక్కర్లేదు.. అడగడం తప్పు కాదు కానీ డిమాండ్ చేయడమే తప్పు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో సినిమాలు చేసేటప్పుడు కొన్ని విషయాలలో హీరోయిన్లే కాదు ప్రతి ఒక్కరూ రాజీ పడాల్సి ఉంటుంది. అంతే తప్ప నేను చెప్పిందే జరగాలి అంటే ఇలాంటి రాద్దాంతాలే జరుగుతాయి అంటూ నాటి విషయాలను, వీడియోలను, ఇంటర్వ్యూలను తవ్వి తీసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఇలా ఈ విషయాలు వైరల్ అవడంతో.. నిజానికి దీపికా వైపు నుంచి ఎలాంటి సమస్య లేకపోతే.. అదేదో స్పిరిట్ నుంచి తప్పుకున్నప్పుడే క్లారిటీ ఇవ్వాల్సింది.. కానీ ఆమె మనసు చెప్పిందే వింటాను అని చెప్పి మరిన్ని అనుమానాలకు తావు ఇచ్చేలా చేసింది. దీనికి తోడు ఇప్పుడు కల్కి2 నుంచి కూడా తీసేయడంతో అందరూ దీపిక ఆలోచనలోనే తప్పు ఉంది.. ముందు ఆమెలో మార్పు రావాలి.. అప్పుడు సందీప్ ను అన్నారు.. ఇప్పుడు వైజయంతి బ్యానర్స్ వారిది కూడా తప్పేనని చెబుతారా? ఒకరు చేస్తే తప్పు కానీ.. అందరూ అదే చేస్తున్నారు అంటే అందర్నీ తప్పు పట్టలేము కదా.. కాబట్టి ఇందులో దీపికాదే ముమ్మాటికీ తప్పు అంటూ నెటిజన్స్ నొక్కి పలకడం సంచలనంగా మారింది.
ఇకపోతే స్పిరిట్ సినిమా విషయంలో ఈమె అత్యధిక రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం వల్లే తప్పించారు. ఇప్పుడు కల్కి2 సినిమా విషయంలో కూడా ఇదే వినిపిస్తోంది..
దీపికా ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో సినిమా చేస్తోంది.. అయితే ఈ సినిమా విషయంలో దీపికాకు, చిత్ర బృందానికి రెమ్యూనరేషన్ లో ఇబ్బంది కలగలేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ కూడా ఒక మెలిక ఉంది. ఏంటంటే జవాన్ సమయంలో సూపర్ హీరో సబ్జెక్టు గురించి చెప్పాడట అట్లీ.. అప్పుడే చేస్తానని ఆమె మాట ఇచ్చిందట. దీనికి తోడు నిర్మాత ఈమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటున్నారు. కాబట్టి అల్లు అర్జున్ సినిమాకి రెమ్యూనరేషన్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ భవిష్యత్తులో వచ్చినా అది బయటకు రాదు.. మొత్తానికి అయితే ఇప్పుడు కల్కి 2 సినిమా నుంచి దీపికాను తీసేయడంతో తన ప్రమేయం లేని టాపిక్ లో కూడా సందీప్ రెడ్డి మరోసారి హైలెట్ హైలెట్ అవుతున్నారని చెప్పవచ్చు మరి దీనిపై దీపిక ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.
